సమాధానం నెం.076 - ప్రశ్న నెం.076 (27-9-2021) విషయం "ఇహం, పరం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.076 - ప్రశ్న నెం.076 (27-9-2021) విషయం "ఇహం, పరం".

Post by Katakam »

1) ఇహం, పరం అంటే ఏమిటి?

2) ఇహం, పరం అంటే సాధారణ వాడుకలో ఈ లోకం, పరాయి లోకం అని తెలియబడుతున్నాయి. అంటే ప్రాణికోటి ఉండే ఈ భూమి ఇహం అయితే, దానికి భిన్నమైనది పరం అని.

3) అక్షరాల మూల భావాలకు వెళ్ళి చెప్పుకున్నట్లయితే, ఇహం అంటే ప్రాణానికి చోటు లేదా స్థావరం అయినది. అంటే ప్రాణ సహిత జీవులకు స్థావరం అయినది లేదా స్థూల జీవులకు ఆకరం లేదా ఉండే చోటు అయినది. అదే పరం అంటే ఇహానికి పరమైనది లేదా భిన్నమైనది లేదా ఇతరమైనది.

4) ఇహం అనేది పరానికి/ పరలోక వాసానికి అవసరంగా మాత్రమే సంబంధించి ఉందా?

5) ముందుగా, ఈ ప్రశ్నను కొంత వివరంగా చెప్పుకుని, తదనంతరం సమాధానానికి వెళ్ళవలసిన అవసరం. ఏమిటి అంటే ఈ లోకంలో ఉండడం లేదా జీవించడం అనేది పరలోకానికి/ పరలోక వాసానికి వెళ్ళడానికి ఒక సంసిద్ధత మాత్రమేనా అని. ఇది సృష్టి ఎందుకు జరిగింది అనే మానవ శోధనకు వచ్చిన "అది భగవంతుని లీల, చిద్విలాసం" అనే సమాధానం యొక్క లోతులకు వెళ్ళలేని మానవ మేథస్సు 'సృష్టి భగవంతునికి ఒక లీల, ఆట' అని ముగించి, అదే భావనను మనిషి పుట్టుకకు అన్వయించి, స్థూల మానవ జీవనానికి లేదా ఇహలోక జీవనానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి, ఉంటుంది అని లోతులకు వెళ్ళవలసిన అవసరాన్ని త్రోసిపుచ్చి, పరానికి సంబంధించిన భగవంతుడిలో ఐక్యం కావడం లేదా పరలోక సుఖాలను గడించుకోవడం అనే దానిని మనిషి యొక్క స్థూల ఉనికికి అర్థం, పరమార్థం అనీ, అదే మనిషికి లక్ష్యమైన మోక్షం అనీ ప్రవచించి, సృష్టి లక్ష్యాన్ని అపమార్గంలో బోధించిన పర్యవసానం మాత్రమే.

6) ఇహం, పరం అనే వాటికి సృష్టి/ యోగ లక్ష్యం పరంగా అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?

7) సమస్త జీవులలో ఆత్మగా ఉన్నది, సమస్త జీవుల ఆత్మలలో ఉన్నది ఆ భగవత్తత్త్వమే అనే సమాచారాన్ని వీనుల విందుగా సామాన్య జనానీకానికి ప్రవచించడమే తప్ప, మనిషి లోని దివ్యత్వం, మనిషిలోనే ఉన్న దివ్యత్వం అనే అంశాన్ని వాస్తవ దృక్పథంగా, ఆచరణీయంగా తీసుకోలేని మానవ మేధస్సు యొక్క అకృత్యమే ఇహం లేదా ఇహ జీవనం అనేది పరం/ పరలోక జీవనం కోసం ఒక తయారీ/ సంసిద్ధం కావడానికి కేవలం ఒక స్థావరం మాత్రమే అనే సృష్టి లక్ష్య విరుద్ధ తీర్మానం.

8) ఇహం సృష్టి లక్ష్యానికి సంబంధించింది, సృష్టి లక్ష్య సిధ్ధికి స్థావరంగా సంబంధించింది. మాస్టరు గారి డైరీలో 14-11-1912 న యోగం గురించి సరయిన అవగాహన కలగడానికి "ముఖ్యంగా దృష్టి పెట్టవలసినవి" గా మీడియములకు -తమ గత జన్మలలో మహోన్నత తపస్సు, సాధనలతో యోగంలో చేరే అర్హత సాధించుకున్న మీడియములకు, ఇహం పరం కోసమే అనే మోక్ష సాధనకు జన్మ జన్మల పర్యంతం పరిమితమై పోయి, ఆ నేపథ్యంలో ఈ యోగం గురించి తెలిసే అవకాశం ఏమాత్రం లేని సదరు మీడియములకు- వేయబడిన ఏడు ప్రశ్నల లోని "1. ఈ యోగా ప్రాక్టీసు దేని కోసం ఉద్దేశించబడిందో మీరు తెలుసుకోవాలి" (అన్యాపదేశంగా దానికి సమాధానం మోక్షమే గనుక, దానికి చెప్పబడిన అపసవ్య అర్థానికి భిన్నంగా) "2. మోక్షం అంటే ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి" (మోక్షం అనే మాటకు సరయిన అర్థం, సృష్టి లక్ష్యానికి అర్థం, పరమార్థం ఈ భూమి మీద మానవ జీవనానికే సంబంధించి ఉంది గనుక, అందుకుగాను) "3. ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే మొదటి మూడు ప్రశ్నలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పరం కాని ఇహమే సృష్టి లక్ష్య సంబంధం అని నొక్కి వక్కాణించిన వైనం.
Post Reply