1) జననం, మరణం అంటే ఏమిటి?
2) జననం, మరణం అంటే పుట్టడం, చనిపోవడం అనేది సాధారణంగా తెలిసిన అర్థం. జననం, మరణం ఎవరికి, ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే, ఇప్పటి వరకు తెలియని లోతులను అది ఆలోచింపచేస్తుంది. సృష్టి గమనంలో మేథావులు 'సృష్టి ఎందుకు జరిగింది' అని వేసుకున్న ప్రశ్నను, దానికి 'సృష్టి భగవంతుని లీల, చిద్విలాసం' అని వచ్చిన సూటి కాని సమాధానాన్ని, ఆ సమాధానానికి సదరు మేథావులు 'భగవంతుడు సృష్టితో ఆడుకుంటున్నాడు' అనేది అర్థం అని వాక్రుచ్చి సృష్టి జనాలను సృష్టి లక్ష్యం విషయంలో పెడదారి పట్టించిన విషయాన్ని, అంతకు మించి ముందుకు పోవడానికి వీలు లేక ఉద్భవించిన సృష్టి లక్ష్యంతో సంబంధం లేని రకరకాల విభిన్న ప్రతిపాదనలను కూడ తలపింపచేస్తుంది. సృష్టి లక్ష్యం సంబంధంగా ఒక ఇదమిత్థత రావడం, దానికి సంబంధించి ఎన్నో ఎన్నెన్నో రహస్యాలు బట్టబయలు కావడం ఈ యోగా రికార్డులలో చూడనవుతుంది.
3) జననం ఉంది మరణం కోసమేనా?
4) అవును అని చెప్పిన సదరు మేథావుల విజ్ఞతను కాదు అని చెప్పడం అంత విశేషం ఏమీ కాకపోయినా, అందుకు సంబంధించిన విషయాలను సహేతుకంగా వివరించి చెప్పుకోవడం విశేషమే అవుతుంది, కొంత కొంత చెప్పుకోవడం ఇప్పటికే జరిగింది కూడ. ప్రస్తుతం జననానికి, మరణానికి అన్వయించి చెప్పుకోవలసిన అవసరం.
5) జననం ఉంది మరణం కోసం కాదు. మూలం/ ప్రాణం స్థూలంలో కలవడమే సృష్టి లక్ష్యం గనుక అలా కలవడానికి స్థూలం తయారు కావలసిన అవసరం ఉన్నప్పటికీ, ఆ కలయిక ఎకాయెకిన ఒక్కసారిగా సాధ్యం కావడానికి వీలు లేని సృష్టిక్రమ వికాస పరిస్థితి గనుక మరణం సంభవిస్తోందనీ, అయినప్పటికీ జననానికి మరణానికి లోనవుతున్న ప్రక్రియలో లక్ష్య దిశగా ఒక నిరంతరాయ ప్రగతి చోటు చేసుకుంటూనే ఉందనీ, సృష్టి లక్ష్య విరుద్ధ భావనలతో పూర్తిగా నిండిన మేథస్సుకు ఆ ప్రగతి గురించి ఏమాత్రం తెలియకుందనీ మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోను వీలవుతుంది.
6) మరణం కోసమే జననం అయితే, మరణం తరువాత మరల జననం ఎందుకు?
7) మరణం కోసమే జననం కాదు అని పైన చెప్పుకోవడం జరిగింది. దానికి ప్రతిగా చెప్పుకోదగిన వాస్తవం ఏమిటి అంటే మరణం మాత్రం మరల జననం కోసమే, ఏ సృష్టి లక్ష్య సిద్ధి కోసం జననం జరిగిందో, ఆ సృష్టి లక్ష్య సిద్ధి పయనంలో కనుపించని ప్రగతితో ముందుకు సాగడం కోసమే. జననానికి సృష్టి లక్ష్యం పరంగా అర్థం, అవసరం ఉంది. ఆ అవసరం తీరడంలో పూర్తి కాని ప్రస్తుత సృష్టిక్రమ వికాస స్థితి దృష్ట్యా, మరణం ప్రస్తుతానికి ఒక మధ్యంతర అవసరంగా మాత్రమే ఉంది. మూలం/ ప్రాణం స్థూలంలో కలిసే నిమిత్తం స్థూలం తయారయిన పిమ్మట మరణం యొక్క అవసరం తీరుతుంది, మరణం లేకుండా పోతుంది.
8) జనన మరణ పరంపరకు సృష్టి/ యోగ లక్ష్యం పరంగా అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
9) మోక్షం అనే మాటకు మః + అక్షం, అంటే జనన మరణ పరంపరకు ఆధారం లేకుండా పోవడం లేదా జననం అనంతరం మరణం లేకుండా పోవడం లేదా వేద సూక్తం 'మృత్యోర్మా అమృతం గమయ', ఈశావాస్య శ్లోక భాగాలు 'విద్యయా అమృతమశ్నుతే', 'సంభూత్యా అమృతమశ్నుతే' లోని అమృతత్వం సిద్ధించడం, అనే అర్థంలో ఒక మధ్యంతర సృష్టి స్థాయి స్థితిగా జనన మరణ పరంపర ఉండకూడనిదిగా లేదా లేకుండా పోవలసినదిగా సృష్టి లక్ష్యంలో, సృష్టి లక్ష్య సిద్ధిలో భాగమే, సృష్టి లక్ష్యమే ఈ యోగ లక్ష్యం కూడ గనుక, ఈ యోగ లక్ష్యంలో, ఈ యోగ లక్ష్య సిద్ధిలో భాగమే.
సమాధానం నెం.078 - ప్రశ్న నెం.078 (1-10-2021) విషయం "జననం, మరణం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm