సమాధానం నెం.080 - ప్రశ్న నెం.080 (5-10-2021) విషయం "సృష్టి విధానం, ఈ యోగ విధానం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.080 - ప్రశ్న నెం.080 (5-10-2021) విషయం "సృష్టి విధానం, ఈ యోగ విధానం".

Post by Katakam »

1) సృష్టి విధానం అంటే ఏమిటి?

2) దీని ముందరి ప్రశ్న నెం.079 (3-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, ఈ యోగ విధానం" లో ప్రస్తుత సృష్టి విధానం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇపుడు సృష్టి విధానం గురించి చెప్పుకోవలసిన అవసరం. అంటే ప్రస్తుతం జరుగుతున్న సృష్టి విధానం గురించి ఇంతకుముందు చెప్పుకుని ఉంటే, ఇపుడు వస్తుతః సృష్టి విధానం గురించి చెప్పుకోవలసిన అవసరం. అంటే మాస్టరు గారి డైరీలో 14-11-1912 న "మీడియముల గురించి" చెప్పబడిన విషయాలలో "దానిలో (= ఈ లైనులో = ఈ యోగ విధానంలో) ముఖ్యంగా ఆరిజిను (= మూలం) గురించి, సృష్టి విధానం (= జరుగుతున్న/ ప్రస్తుత సృష్టి విధానం కంటె అతీతమైనది) గురించి చెప్పబడింది" అని చెప్పిన వాక్యంలోని సృష్టి విధానం ఇక్కడి విషయం అని తెలియనగును.

3) ప్రస్తుత సృష్టి విధానం అనేది సృష్టి ఆరంభమైన పిమ్మట సృష్టి ప్రస్తుతం నడుస్తున్న తీరుకు సంబంధించింది. కానీ, సృష్టి విధానం అనేది వస్తుతః సృష్టి ఆరంభం కావడం కంటె ముందుగా సృష్టికి సంబంధించిన విధానంగా ఏర్పడి ఉంది అని తెలియనగును. అంటే వస్తుతః సృష్టి ఉండవలసిన తీరుకు సంబంధించినదిగా సృష్టి విధానాన్ని తీసుకోనగును. అంటే ఒక రకంగా ప్రస్తుత సృష్టి విధానం అనేది సృష్టి విధానంలో భాగంగా తీసుకోనవుతుంది. అంటే మొత్తంగా ఉన్నది సృష్టి విధానం అయితే, అందులో ప్రస్తుత సృష్టి విధానం ఒక భాగం అని. అంటే ప్రస్తుతం ఉన్న సృష్టి విధానాన్ని మించి, ప్రస్తుత సృష్టి విధానంతో పాటు సృష్టి ఇకమీదట ఉండవలసిన విధానాన్ని కూడ తనలో ఇముడ్చుకుని ఉన్నది సృష్టి విధానం అని తెలియనగును.

4) ఈ యోగ విధానం అంటే ఏమిటి?

5) వస్తుతః యోగం ఏ లక్ష్యంతో ఆరంభం అయ్యిందో, ఆ లక్ష్యానికి సంబంధించిందే
యోగ విధానం. సృష్టి లక్ష్యమే యోగ లక్ష్యం అయిన నేపథ్యంలో, సృష్టి గురించి, సృష్టి విధానం గురించి, సృష్టి లక్ష్యం గురించి (కేవలం మోక్షం అనే ఒక్క మాటను మినహాయించి) ఏమాత్రం తెలియని సృష్టి మానవులకు, అందులో ముఖ్యంగా మానవ మేథావులకు, వాటి గురించి ప్రస్తుత సృష్టి విధానం పరంగానూ మరియు సృష్టి విధానం పరంగానూ తెలియచేసి, ఉన్న సృష్టి పరిస్థితిని, దానికి అనుగుణంగా ఉన్న వ్యక్తి స్థాయి పరిస్థితిని వివరించడం మాత్రమే కాక, రావలసిన సృష్టి పరిస్థితిని, అందుకు అనుగుణంగా ఉండి తీరవలసిన వ్యక్తి స్థాయి పరిస్థితిని గుంభనంగా వివరిస్తూ, అందుకు సంబంధించిన మూల స్థాయి మరియు సృష్టి స్థాయి క్రియలను, ప్రక్రియలను, ప్రయోగాలను స్థూలాల మాధ్యమంగా జరిపించడమే యోగ విధానం. జరిపించబడిన యోగ క్రియలు, ప్రక్రియలు‌, ప్రయోగాలు, వాటికి సంబంధించిన యోగా రికార్డులు, ఆ ప్రయోగాల ఆచరణకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న మూల స్థాయి, సృష్టి స్థాయి మార్పులే యోగ విధానం.

6) సృష్టి విధానానికి, యోగ విధానానికి మధ్యన ఉన్న సామ్యం ఏమిటి, తారతమ్యం ఏమిటి?

7) రెండు విధానాల మధ్యన ఉన్న సామ్యం గురించి. సృష్టి విధానం, యోగ విధానం రెండూ కూడ సృష్టికి, సృష్టి జీవులకు, అందులో ముఖ్యంగా మనిషికి, సంబంధించినవే, మనిషి మాధ్యమంగా జరిపించబడవలసినవే.

8) సృష్టి విధానం వస్తుతః జరుగుతున్న, జరగవలసిన సృష్టికి సంబంధించిన విషయాలకు మాత్రమే సంబంధించి ఉంది. ఈ యోగ విధానం విషయ పరమైన సృష్టి విధానాన్ని మించి, దానిని ఆచరణకు తీసుకురాదగిన క్రియలకు, ప్రక్రియలకు, ప్రయోగాలకు కూడ సంబంధించి ఉంది.
Post Reply