సమాధానం నెం.082 - ప్రశ్న నెం.082 (9-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, నూతన సృష్టి విధానం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.082 - ప్రశ్న నెం.082 (9-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, నూతన సృష్టి విధానం".

Post by Katakam »

1) నూతన సృష్టి విధానం అంటే అర్థం ఏమిటి?

2) ప్రస్తుత సృష్టి విధానం గురించి సమాధానం నెం.079 - ప్రశ్న నెం.079 (3-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, ఈ యోగ విధానం" లో వివరించబడి ఉంది. దానికి అదనంగా నూతన సృష్టి విధాన సంబంధంగా ప్రస్తుత సృష్టి విధానం గురించి మరికొంత తెలియవలసిన అవసరం.

3) అనాది నుండి వస్తున్న ఏ కారణాల వలన ప్రస్తుత సృష్టి, సృష్టి జీవులు, అందులో ముఖ్యంగా మనిషి, ఉంటున్న తీరు దిగజారిపోయి సృష్టి సమస్తం భ్రష్టు పట్టిపోయిందో, ఏ కారణాల వలన నూతన సృష్టి విధానం లేదా సృష్టి నూతన విధానం ఆరంభం కావలసిన అవసరం ఏర్పడిందో, వాటికి సంబంధించి ఉన్నటువంటిదే ప్రస్తుత సృష్టి విధానం. ప్రముఖంగా చెప్పుకోదగిన రకరకాల స్దాయీ భేదాల కారణంగా మనుషుల మధ్య ఏర్పడిన గొప్ప, తక్కువ అనే తారతమ్యం పొడసూపి మనుషులలో రెండు విభిన్న వర్గాలు ఏర్పడడం; మనుషులలో అల్ప సంఖ్యాకులు అయిన మేథావులు లేదా తెలివి ఎక్కువగా ఉన్నవారు అధిక సంఖ్యాకులు మరియు తెలివి తక్కువగా ఉన్నవారు అయిన సామాన్య జనానీకాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవడం, సామాన్య జనానీకం మేథావి వర్గం చేత వాడుకోబడడం; అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులను శాసించడం మరియు అధిక సంఖ్యాకులు అల్ప సంఖ్యాకుల చేత శాసించబడడం; ఈ కారణాలకు లోబడి ఉన్నదే ప్రస్తుత సృష్టి విధానం లేదా సృష్టి ప్రస్తుత విధానం.

4) ఇక నూతన సృష్టి విధానం గురించి.
ఏ సృష్టి స్థాయి కారణాలు, వ్యక్తుల ప్రమేయం ఉంది అని అనుకోవడానికి పూర్తి అవకాశాన్ని కలిగించేలా ఉన్న సృష్టి స్థాయి కారణాలు మనుషుల మధ్య రకరకాల అసమానతలకు దారితీశాయో, అవి చక్కదిద్దబడి, సర్వ మానవ సమానత్వం నెలకొనడానికి సంబంధించిందే నూతన సృష్టి విధానం.

5) నూతన సృష్టి విధానానికి, ప్రస్తుత సృష్టి విధానానికి సంబంధం ఏమిటి?

6) ప్రస్తుత సృష్టి విధానం లేదా సృష్టి ప్రస్తుత విధానమే దాని ప్రస్తుత అస్తవ్యస్త, అసమానతల స్థితికి దారితీసిన సృష్టి స్థాయివి, వ్యక్తులలో/ మనుషులలో పనిచేస్తున్నవి అయిన కారణాలు మూల/ శూన్య స్థాయి క్రియలతో, ప్రక్రియలతో చక్కదిద్దబడి, నూతన సృష్టి విధానంగా లేదా సృష్టి యొక్క నూతన విధానంగా మార్పు చెందించబడి, సుస్థిరపరచబడవలసి ఉంది. సృష్టి అదే, దాని ప్రస్తుత విధానమే నూతన విధానంగా తిరిగి మలచబడి, పునర్నమూనీకరణం చేయబడవలసి ఉంది. కాకపోతే, ప్రస్తుత సృష్టి విధానపు స్థితిగతులకు లోబడి ఉన్న ఏ స్థాయి మనిషికీ కూడ నూతన సృష్టి ఎలా ఉండబోతుంది అనేది దురూహ్యం, అనూహ్యం, కేవలం అసంభవం.

7) నూతన సృష్టి విధానం, ప్రస్తుత సృష్టి విధానం, సృష్టి విధానం - వీటి మధ్య సామ్యం ఏమిటి, తారతమ్యం ఏమిటి?

8) నూతన సృష్టి విధానం భవిష్య సంబంధం. ప్రస్తుత సృష్టి విధానం వర్తమాన సంబంధం. నూతనాన్ని, ప్రస్తుతాన్ని మరియు భవిష్యమానాన్ని, వర్తమానాన్ని తనలో ఇముడ్చుకుని ఉన్నది సృష్టి విధానం. సృష్టి లక్ష్యంలో ప్రథమ అంకంగా ప్రస్తుత వర్తమాన సృష్టిని, వర్తమాన సృష్టి విధానాన్ని మరియు సృష్టి లక్ష్యంలో ద్వితీయ/ చరమ అంకంగా నూతన భవిష్యమాన సృష్టిని, భవిష్యమాన సృష్టి విధానాన్ని తనలో ఇముడ్చుకుని ఉంది సృష్టి విధానం.

9) మాస్టరు గారి డైరీలో 14-11-1912 న "దీనిలో (= ఈ లైనులో = ఈ యోగ విధానంలో) ముఖ్యంగా ఆరిజిను గురించి, సృష్టి విధానం గురించి చెప్పబడింది" అనే వాక్యంలో వ్రాయబడి ఉన్న సృష్టి విధానమే ఇప్పుడు చెప్పుకోబడుతున్న సృష్టి విధానం, సృష్టి లక్ష్యం లోని ప్రథమ ద్వితీయ అంకాలు అయిన ప్రస్తుత నూతన సృష్టులను, సృష్టి విధానాలను మరియు వర్తమాన భవిష్యమాన సృష్టులను, సృష్టి విధానాలను తనలో ఇముడ్చుకుని ఉన్న సృష్టి విధానం.
Post Reply