సమాధానం నెం.643 - ప్రశ్న నెం.643 (4-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - రీచింగు నెలకొనడం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.643 - ప్రశ్న నెం.643 (4-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - రీచింగు నెలకొనడం".

Post by Katakam »

1) "మళ్ళీ అడ్డవాటపు పార్శ్వంలో ఏదో కొరత అనిపించింది, దిద్దుబాటును చూసుకోడానికి అది వచ్చింది. దానిని ముగించడానికి కొంత సమయం పడుతుంది. అపుడు మాత్రమే రీచింగు నెలకొంటుంది. ఈ మొత్తం వర్గింగులో ఏదో రహస్యం ఉంది. కనుక సూచన నీకు పూర్తిగా ఇవ్వబడదు. ఆల‌స్యం గురించి ఎలాంటి క్రుంగుబాటు చెందకు" - మాస్టరు గారి డైరీలలో 11-3-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం వస్తుతః 30-1-1921 నాటి "రీచింగు గురించిన సూచన" అనే దానికి మరియు "ఆలస్యం" గురించి దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.642 విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆలస్యం" అనే దానికి కొనసాగింపు అని తెలియనగును.

3) మళ్ళీ అడ్డవాటపు పార్శ్వంలో ఏదో కొరత అనిపించింది. ప్రస్తుత ప్రశ్న విషయానికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమం ప్రక్కలకు విస్తరణ అని ముందుగా గుర్తు చేసుకోనగును. మళ్ళీ అడ్డవాటపు పార్శ్వంలో ఏదో కొరత అనిపించింది అనేది దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.640 విషయం "యోగా రికార్డుల విషయాలు - అన్‌లిమిటు" లో చెప్పబడినట్లుగా, "అన్‌లిమిటులో ప్రక్కలకు విస్తరణ వర్కింగులో పూర్తి కాలేదని తీసుకోనగును. అది అన్‌లిమిటును చేరి, దాని నుండి భూమిని చేరాలి" అనే దానికి సంబంధించి ఉంది అనేది విషయం.

4) దిద్దుబాటును చూసుకోడానికి అది వచ్చింది. దిద్దుబాటును చూసుకోడానికి. కొరతను చక్కదిద్దుకోవడానికి లేదా కొరత లేకుండా చేయడం అనే దానిని చూసుకోడానికి. అది. ప్రక్కలకు విస్తరణ. వినడానికి కొంత విడ్డూరం అని అనిపిస్తుంది కదా, ప్రక్కలకు విస్తరణ రావడం ఏమిటి అని. ఇంతకు ముందు వివరించుకున్నట్లుగా, మూల స్థాయిలలో కదలిక లేదా చలనం అంటూ ఉన్న చోట, ఆ ప్రతి కదలికకు లేదా చలనానికి ప్రత్యేక ఉనికి ఉంటుంది. అదే ఇక్కడ అది -అంటే ప్రక్కలకు విస్తరణ- వచ్చింది అని చెప్పబడింది.

5) దానిని ముగించడానికి కొంత సమయం పడుతుంది. దానిని. కొరతను చక్కదిద్దడాన్ని లేదా కొరత లేకుండా చేయడాన్ని. ముగించడానికి. స్పష్టమే. కొంత సమయం పడుతుంది. ఇక్కడ తెలియని లోతులలో ఒక ప్రశ్న ఉదయించే అవకాశం. ఏమిటి అంటే దాదాపుగా ప్రతి దానికీ ఏదో ఒక అడ్డంకి/ ఆటంకం రావడం, ప్రతిసారీ అందుకు కొంత సమయం పట్టడం, ఏమిటి ఇది అని. దీనికి విధాన పరంగా మాత్రమే వివరణ చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. ప్రస్తుత సృష్టి విధానంలో జరిగే ప్రతి దానికీ సదరు విధానం లోతుల లోని మూల స్థాయిల సృష్టి విధానానికి -అంటే ప్రస్తుతం నడుస్తున్న సృష్టి విధానానికి అతీతమైన సృష్టి విధానానికి- సంబంధించిన మూల సూత్రమే పనిచేస్తోంది అని, అలా పనిచేయడానికి దానికి వెనుక ఉన్న తెలియడం అనే సృష్టి లక్ష్య సంబంధమైన ప్రక్రియయే లేదా సూత్రమే -అంటే తెలియడం అంటే తన తెలిసిఉండినతనాన్ని తనకు తెలిసి ఉన్నదిగా తానుగా తెలుసుకోవడం- ఆధారం అని, దీనిని మూల ప్రాణం యొక్క/ లోని సంకల్పానికి పర్యాయ పదంగా చెప్పుకోనవుతుంది అని, ఈ ప్రక్రియ లేదా సూత్రమే సృష్టి క్రియాకలాపాలు మరియు మానవ క్రియాకలాపాల లోతుల లోతుల లోతులలో జరగవలసిన/ జరగనున్న యోగ సంబంధ ప్రక్రియ అని.

6) అపుడు మాత్రమే రీచింగు నెలకొంటుంది. అపుడు మాత్రమే. మూల స్థాయిల ప్రక్రియగా ప్రక్కలకు విస్తరణ పూర్తి అయిన తరువాత మాత్రమే. రీచింగు. రీచింగు అని అన్నపుడు, అది మూల స్థాయిల సంబంధమైన ప్రక్రియ లేదా ప్రయోగ ఫలితం అని మాత్రమే తెలియనగును. నెలకొంటుంది. మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది యొక్క మూల స్థాయి స్థూలంలో నెలకొంటుంది, స్థిరపడుతుంది.

7) ఈ మొత్తం వర్కింగులో ఏదో రహస్యం ఉంది. ఈ మొత్తం వర్కింగులో. రీచింగుకు సంబంధించి జరిగే ఈ మొత్తం వర్కింగులో. ఏదో రహస్యం ఉంది. రహస్యం రహస్యమే కదా. వెల్లడి అయితే అది రహస్యమే కాదు కదా. అది రహస్యం అని చెప్పబడింది 1921 లో. అప్పుడు చెప్పబడని రహస్యం ఏమిటో ఇప్పుడు 103 సంవత్సరాల తరువాత తెలిసే లేదా తెలియచేయబడే అవకాశం ఉందా అని ప్రశ్న వేసుకోవడం అసమంజసం ఏమీ కాదు కదా, తెలుస్తుందా అంటే, ప్రశ్న అంటూ పడింది గనుక, సమాధానం అవశ్యం రావలసిందే, కాకపోతే అవసరం మేరకు మాత్రమే అనేది సమాధానం. ఏమిటి అంటే. అప్పటి రహస్యం నేడు కనుపిస్తున్న వాస్తవం. అది క్లుప్తంగా మాత్రమే చెప్పుకోనవుతుంది, రీచింగు నెరవేరడం అనేది మాస్టరు గారికి, మాస్టరు గారి కాలానికి సంబంధించింది కాదు అని. అందించబడిన క్లుప్తమైన ఈ సమాధానానికి చిన్న వివరణ. ఈ క్లుప్తమైన సమాధానానికి సంబంధించి మాస్టరు గారి చేత వ్రాయబడిన లేదా మాస్టరు గారి ద్వారా వ్రాయించబడిన "యమ్. ప్రాక్టీస్ ఫస్ట్ ఆరిజిన్" లేదా "మాస్టరు యొక్క ప్రాక్టీసు మొదటి ఆది" అనే పుస్తకం యొక్క శీర్షికయే తిరుగులేని సంకేతం, నిర్ధారణ అయినప్పటికీ, అలా అని అర్థం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి.

8) కనుక సూచన పూర్తిగా ఇవ్వబడదు. అప్పటి రహస్యం ఏమిటో చెప్పుకున్న మీదట, ఈ పదజాలానికి అర్థం అనుమానానికి తావు లేకుండా సుస్పష్టంగా తెలియనయే అవకాశం.

9) ఆలస్యం గురించి ఏ విధమైన క్రుంగుబాటు చెందకు. ఇంతకు ముందు చెప్పుకున్న మాదిరిగానే, ఆలస్యం గురించి మాస్టరు గారికి తెలియని లోతులలో కలిగిన భావనకు ఇది సమాధానం అని తెలియనగును. కాకపోతే, చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే రీచింగుకు సంబంధించిన ఆలస్యం గురించి మాస్టరు గారిలో ఉన్న భావన కొంత బలీయంగానే ఉంది అని.

10) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

11) మాస్టరు గారి కాలంలో జరుగుతున్న యోగా ప్రాక్టీసు సంబంధంగా ఎన్నెన్నో విషయాలు వెల్లడించబడినా, రహస్యాలు గుంభనంగానే ఉంచబడ్డాయి. లిఖిత రూపంలో మాస్టరు యోగా రికార్డులు ఉన్నప్పటికీ, మాస్టరు గారి కాలంలో యోగా ప్రాక్టీసు సంబంధంగా ఏం జరిగింది అనేది నేటికీ అర్థం కాని రహస్యంగానే ఉంటోంది అని తెలియనగును.
Post Reply