1) "స్వయంకు, సీ.వీ. కి 6 రోజుల పాటు రెగ్యులేషను ఉంది. సీ.వీ. ప్రజ్ఞా రహిత స్థితిలో ఉంటుంది. మౌల్డింగులో ఆమెకు భంగం కలిగించవద్దు. ఇది పంచడానికి కాదు, డైరెక్టుగా నీ స్వయంకు మాత్రమే. అనుభూతిని గమనించు. ఆ తరువాత నీకు వివరణ ఇవ్వబడుతుంది" - మాస్టరు గారి డైరీలలో 18-3-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం 2-2-1921 నాటి ప్రశ్న, సమాధానం నెం.634 విషయం "యోగా రికార్డుల విషయాలు - మెమొరాండం యొక్క రెండు రకాలు" లో వ్రాయబడిన "దీని వలన మెమొరాండం యొక్క రెండు రకాలు స్థూల శరీరంలో పనిచేయబోతున్నాయి మరియు రెండు రకాల వివరణలు, ఒకటి విశ్వ సంబంధ స్థాయిల గురించి, రెండవది దాని ప్యూర్ మెమొరీ స్థాయిల ఉన్నతతర అనుభవాల గురించి, ఇవ్వబడతాయి" అనే దానికి కొనసాగింపుగా వ్రాయబడిన "ఈ మౌల్డింగు వర్కు కారణంగా ఇప్పటి వరకు సూచన ఇవ్వనవలేదు" అనే దానికి కొనసాగింపు అని, ఆ మౌల్డింగుకు సంబంధించిన రెగ్యులేషను గురించే ప్రస్తుత ప్రశ్న విషయంలో చెప్పబడుతోంది అని తెలియనగును, 2-2-1921 తరువాత ఎన్నెన్నో విషయాలు చెప్పబడి ఉన్నప్పటికీ. పైన ఎత్తి వ్రాయబడిన 2-2-1921 నాటి విషయానికి వివరణ ఇవ్వబడలేదు అని తెలియనగును.
3) స్వయంకు, సీ.వీ. కి 6 రోజుల పాటు రెగ్యులేషను ఉంది. స్వయంకు. మాస్టరు గారి స్థూల శరీరంలో లేదా అద్దె శరీరంలో ఉండి యోగ క్రియలకు, ప్రక్రియలకు, ప్రయోగాలకు గురి అవుతున్న మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి. అంటే మాస్టరు గారి లోని స్వయంకు అని. దీనికి సంబంధించిన లోతులు ఇంకా ఉన్నప్పటికీ, అది ప్రస్తుత వివరణ విషయం కాదు అని, ఎవరికయినా వ్యక్తిగత స్వయం/ మూలం/ ప్రాణం గురించిన విషయం అందించబడే స్థాయి వచ్చిన తరువాత మాత్రమే ఆ లోతులు తెలియబడే కేవలం అవకాశం మాత్రమే ఉంటుంది అని తెలియనగును. సీ.వీ. కి. సీ.వీ. కి అని అన్నపుడు, ఆ మౌల్డింగు యథాతథమైన వర్కింగుగా/ వర్కుగా సీ.వీ. కి సంబంధించింది కాదు అని, కేవలం స్వయంలో జరిగే మౌల్డింగుకు సంబంధించిన సమాచారం గ్రహించడానికి మాత్రమే సీ.వీ. కి మౌల్డింగు అని తెలియనగును. 6 రోజుల పాటు. స్పష్టమే. కాకపోతే, దీనిలో బయటపడడానికి కాక, బయటపెట్టడానికి వీల్లేని లోతుల శూన్య స్థితుల విషయాలు ఉన్నాయి అని మాత్రమే కేవలంగా చెప్పుకోనవుతుంది. రెగ్యులేషను ఉంది. నియంత్రణ ఉంది. నియంత్రణ అంటే ఉన్న దానిలో మెరుగుపడవలసిన అవసరానికి అనుగుణంగా మార్పు చోటు చేసుకోవడానికి జరిగే ప్రక్రియ లేదా క్రియానుక్రమణిక అని చెప్పుకోనవుతుంది. సీ.వీ. ప్రజ్ఞా రహిత స్థితిలో ఉంటుంది. విషయంగా స్పష్టమే. ఒక ట్రాన్సు మీడియంగా ప్రజ్ఞా రహిత స్థితిలో ఉండడం అనేది యోగ సంబంధమైన విధి నిర్వహణ అయినప్పటికీ, 6 రోజుల పాటు ఉండడం అనేది విశిష్టంగానే పరిగణించనవుతుంది.
4) మౌల్డింగులో ఆమెకు భంగం కలిగించవద్దు. సీ.వీ. కి జరిగే మౌల్డింగులో (పైన చెప్పుకున్న అర్థంలో) భంగం కలగడం అంటే యోగానికి, యోగ ప్రక్రియకి అంతరాయం క్రిందికే వస్తుంది అని, అది కూడదు గనుకనే "మౌల్డింగులో ఆమెకు భంగం కలిగించవద్దు" అని చెప్పబడింది అని గ్రహించనగును.
5) ఇది పంచడానికి కాదు. ఇది. ప్రస్తుత మౌల్డింగుకు/ మలచడంకు సంబంధించిన రెగ్యులేషను/ నియంత్రణ. పంచడానికి కాదు. పంచడానికి కాదు అని అన్నపుడు, మాస్టరు గారి కాలంలో జరిగిన విధాన పరమైన విషయం ఏమిటి అంటే యోగా ప్రాక్టీసు అనేది పంచడం (అప్పటికి ఇది కేవలం మాస్టరు గారికి మాత్రమే సంబంధించింది) లేదా పంపకం/ పంచబడడం అనే సూత్రం మీదనే ఆధారపడి ఉంది అనేది. ప్రస్తుత కాలంలో పంచడం అనేది ఏ ఒక్కరికీ సంబంధించింది కాదు అని, పంపకం జరగడానికి కూడ ప్రస్తుత పరిస్థితులలో అవకాశం లేకుండా ఉంది అని, అందుకు కారణం మాస్టరు యోగా ప్రాక్టీసు మాస్టరు యోగా ప్రాక్టీసుగా కాక, మాస్టరు గారి యోగంగా లేదా వేరే ఇతర పేర్లతో కూడిన యోగంగా మాత్రమే ప్రాక్టీసు చేయడమే అని నిశ్చయంగా తెలియనగును.
6) డైరెక్టుగా నీ స్వయంకు మాత్రమే. డైరెక్టుగా. స్పష్టమే. మధ్యంతరంగా ఏదీ/ ఎవరూ లేకుండా. ఇక్కడ యోగ సంబంధంగా ఒక విషయం చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే యోగా ప్రాక్టీసు నిమిత్తం కూర్చుని, కళ్ళు మూసుకుని, నమస్కారం చేసుకునే ప్రతి ఒక్కరిలో ప్లెంటీ ఆఫ్ ప్రాణా ప్రవేశించడం అనేది మధ్యస్థంగా దేని/ ఎవరి/ ఏ స్థాయి అవసరం లేకుండా డైరెక్టుగానే జరుగుతుంది అని, డైరెక్టు లైను అనే మాటలకు ఒక మితిలో ఇదే అర్థం అని. నీ. నీ అనేది మాస్టరు గారికి సంబంధించింది. స్వయంకు. పైన చెప్పుకున్న అర్థమే. మాత్రమే. స్పష్టమే.
7) అనుభూతిని గమనించు. జరిగే ప్రక్రియకు సంబంధించిన ప్రభావాన్ని అనుభూతిగా గమనించు. గమనిక అనేది జరిగే ప్రక్రియ మాత్రమే గనుక, అనుభూతి అనేది గమనిక వలన లేదా గమనికలో తెలియడం మాత్రమే. ఇక్కడ అవశ్యంగా ఒక విషయం చెప్పుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. ప్రశ్న, సమాధానం నెం.638 విషయం "యోగా రికార్డుల విషయాలు - సమీప భవిష్యత్తు లోనే రీచింగు" లోని "రీచింగు సమీప భవిష్యత్తు లోనే ఉంటుంది. ఖచ్చితమైన తేదీ ఇపుడు వెల్లడించబడదు. ముందుగా సీ.వీ. ఈథరిక్ రీచింగు ఆమె స్థూల స్ఫురణకు రావాలి" అనే దానికి సంబంధించి 5వ పేరాలో చెప్పబడిన అర్థాన్ని అన్వయించుకుని చెప్పుకోనయే విషయం ఏమిటి అంటే అప్పటి సమాచారం రావడానికి సీ.వీ. ఈథరిక్ రీచింగు మాత్రమే అవసరం కాగా, ప్రస్తుత మౌల్డింగుకు సంబంధించి వివరణ రావడానికి, దానిని మించి మాస్టరు గారు అనుభూతిని గమనించడం కూడ అవసరం అయ్యింది అని తెలియనవుతుంది. దీని లోని మర్మం కేవలం అనుభవైకవేద్యం అని మాత్రమే చెప్పుకోనవుతుంది అని తెలియవస్తున్న విషయం.
8) ఆ తరువాత నీకు వివరణ ఇవ్వబడుతుంది. ఆ తరువాత. అనుభూతి గమనించబడిన తరువాత. నీకు. మాస్టరు గారికి. వివరణ ఇవ్వబడుతుంది. స్పష్టమే.
9) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
10) ప్రస్తుత ప్రశ్న విషయంలో వివరించబడిన విషయాలు అర్థం కావడం మాత్రమే తెలియవలసిన విషయం అని తెలియనగును.
సమాధానం నెం.644 - ప్రశ్న నెం.644 (6-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - స్వయంకు రెగ్యులేషను".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm