1) "ఇది ముగింపు కాలం గనుక అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది. ఈ పరీక్షలో చాలామందే ఉంటారు. స్వయంగా నీవు, సీ.వీ. దీనికి ఉదాహరణ. అత్యంత కార్యవర్తన వేగానికి ఇది ఒక చిహ్నం" - మాస్టరు గారి డైరీలలో 1-4-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం ప్రత్యేకించి దేనికీ కొనసాగింపు కాకపోయినప్పటికీ, 1-4-1921 న ప్రస్తుత ప్రశ్న విషయం కంటె ముందు వ్రాయబడిన వాటిలో కొన్నిటిని ఎత్తి వ్రాసుకుని, అవసరం మేరకు కొంత వివరంగా చెప్పుకోవలసిన అవసరం అని అనిపిస్తున్న విషయం. ఆ విషయాలు - "తోకచుక్క వెనుదిరుగుతున్నపుడు ఈ లైను ఆరంభమయింది. ఇది పూర్తయే లోపు ఏ తోకచుక్క రాదు. ఈ మధ్య కాలంలో దానికి అవకాశం కూడ ఉండదు. భూమి మీద ఆకస్మిక ఘటన, పరిణామం వలన రీచింగు దినం అందరికీ తెలియనవుతుంది. ప్రస్తుత స్థితి వలన ఆ సమయాన్ని ఫలానా అని నిర్ణయించనవదు. దీనికి కనీసం 14 నెలలు పట్టవచ్చు." ఇందులో వివరించుకోదగిన విషయం ఏమిటి అంటే "దీనికి కనీసం 14 నెలలు పట్టవచ్చు" అనేది. మాస్టరు గారు స్థూలం వదిలింది మే 1922 లో. ప్రస్తుత విషయం చెప్పబడింది ఏప్రిల్ 1921 లో. దానికి, దీనికి మధ్య ఉన్నది 14 నెలల కాలం. మరి కనీసం 14 నెలలు పట్టవచ్చు అని అన్నపుడు, పైకి ఏమాత్రం తెలియని విధంగా భవిష్య ఘటనని -అంటే మాస్టరు గారు స్థూలాన్ని వదిలివేయడం అనే దానిని- గుంభనంగా సూచించడం జరిగిందా అనే అనుమానం సమంజసమే. ఎందుకు అంటే వాస్తవంగా జరిగింది అదే కదా. కాబట్టి ఆ మాటలలో గుంభనమైన ఈ సూచన కూడ ఇమిడి ఉంది అని చెప్పుకోవడం వాస్తవానికి భిన్నం కాని విషయమే. కాకపోతే, అలా అని తెలియడం లేదా కనీసం లీలా మాత్రంగా అయినా తెలియడం కేవలం అసంభవం. భవిష్యత్తు అనేది ఊహకు, కల్పనకు మాత్రమే సంబంధించిన అంశం తప్ప, వాటికి సంబంధించిన ఆధార రహితమైన నమ్మకానికి తప్ప, వాస్తవానికి పూర్తిగా సంబంధించిన అంశం కానే కాదు.
3) ఇంతకీ ప్రస్తుత ప్రశ్న విషయంలో ఈ పై విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామో తెలియవలసిన అవసరమే. కాకపోతే, అర్థం కావలసినంత గుంభనంగా సూచన రావడానికి లేదా ఇవ్వబడడానికి సంబంధించి ప్రశ్న, సమాధానం నెం.643 విషయం "యోగా రికార్డుల విషయాలు - రీచింగు గురించిన సూచన" లో "సూచన" అనే శీర్షిక క్రింద "ఈ మొత్తం వర్కింగులో ఏదో రహస్యం ఉంది. కనుక సూచన నీకు పూర్తిగా ఇవ్వబడదు" అని వ్రాయబడి ఉన్నదే దీనికి విధాన పరమైన కారణం అని చెప్పుకున్న తరువాత.
4) ఇది ముగింపు కాలం గనుక. దీనికి గుంభనంగా, నిగూఢంగా పై పేరా లోని విషయం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సంబంధించి ఉంది అనేది ఒక రకంగా తేలికగా తెలియనవుతున్న విషయమే. ఇది ముగింపు కాలం గనుక అని అన్నపుడు, చెప్పుకోదగిన భిన్నమైన విషయాలు ఏమిటి అంటే. ఒకటి - మూల స్థాయిల ప్రక్రియలు మూల స్థాయిలలో జరగడానికి ముగింపు కాలం. రెండు - యోగా ప్రాక్టీసు సంబంధంగా చేయబడుతున్న మూల స్థాయిల ప్రయోగాలకు ముగింపు కాలం. మూడు - మాస్టరు గారి జీవిత కాలానికి ముగింపు కాలం. కాకపోతే, మూడిటిలో ఏ ఒక్కటి కూడ అలా అని తెలియబడడానికి ఈషణ్మాత్రం అవకాశం లేని అసంభవమైన పరిస్థితి. ఇది మూల స్థాయిల సృష్టి విధానానికి, నడుస్తున్న ప్రస్తుత సృష్టి విధానానికి రెండిటికీ సంబంధించిన విషయమే.
5) అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది. ఇది ముగింపు కాలం గనుక అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది అని అన్నపుడు, విధాన పరంగా మాత్రమే కాక వాస్తవంగా ప్రస్తుత సృష్టిలో జరుగుతున్న మానవ సంబంధ వ్యవహారంగా కూడ చెప్పుకోనవుతుంది. లోతులు ఎప్పుడూ అందనివే, అందకుండానే ఉంటాయి అనేది విధానం. ఇది మానవ సంబంధ వ్యవహారాలలో స్పష్టంగా తెలియనయే, తెలియబడుతున్న అంశం. ఇవి సాన్నిహిత్యం లేని చోట తక్కువగానూ, సాన్నిహిత్యం ఉన్న చోట ఎక్కువగానూ బయటికి తెలియబడే అంశం, బయటపడే అంశం. సృష్టి సమస్తం లేదా సృష్టి మానవాళి సమస్తం లోపలి లోతులు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న సందర్భమే, సర్వ సహజ మేథో లక్షణమే, స్వభావమే, ఎలాంటి ఉదాహరణలు చెప్పుకోవలసిన అవసరం లేనంత స్పష్టమే, నిశితంగా గమనించగలిగితే. లోతులు ఎప్పుడూ అసలైన అర్థం లోని ఆధ్యాత్మికతకు పూర్తిగా వ్యతిరేకమే, ప్రతికూలమే. అవి పూర్తిగా తొలగించబడడం సృష్టి/ యోగ లక్ష్య సంబంధంగా యోగ పరమైన అవసరం. దానికి సంబంధించి చెప్పబడిందే అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది అనేది.
6) ఈ పరీక్షలో చాలామందే ఉంటారు. మీడియములకు మాత్రమే పరిమితం చేయబడిన విషయం గనుక చాలామంది, సృష్టి మొత్తానికి సంబంధించిన విధాన పరమైన విషయం అయినప్పటికీ.
7) స్వయంగా నీవు, సీ.వీ. దీనికి ఉదాహరణ. ఎలా ఉదాహరణ అనేది రికార్డుల పరంగా తెలియనవదు అని సమంజసంగా చెప్పుకోనయినప్పటికీ, వ్యక్తులకు అతీతంగా విధాన పరంగా వెళ్ళగలిగితే (అది అంత తేలిక కాదు) జాడలు, రహస్య సూచనలు అందీ అందనట్లుగా తెలియనవుతాయి. "స్వయంగా నీవు" అనేది మాస్టరు గారికి, సీ.వీ. అనేది వెంకమ్మ యొక్క సూక్ష్మానికి సంబంధించినవి.
8) అత్యంత కార్యవర్తన వేగానికి ఇది ఒక చిహ్నం. లోతుల వ్యతిరేకతలు లేదా ప్రతికూలతలు బయటపడడం అనేది ప్రస్తుత సృష్టి విధానంలో జరగడానికి వీల్లేని విషయం. ఎందుకు అంటే కర్మ విధానపు ప్రస్తుత సృష్టి మొత్తం సృష్టి లక్ష్య సంబంధంగా నెగెటివ్‌గానే ఉంది, నెగెటివ్ లోనే ఉంది గనుక. అంటే సృష్టి లక్ష్యం లోని ప్రథమ అంకంగా సృష్టి దిగజారిపోవడానికి మాత్రమే సంబంధించి ఉంది అని. ఆ లోతులు బయటపడడం అనేది సృష్టి లక్ష్యం లోని రెండవ అంకం అయిన ప్రస్తుత సృష్టి, ప్రస్తుత సృష్టి విధానం బాగుచేయబడడం, నూతన సృష్టి, నూతన సృష్టి విధానం ఆవిష్కరించబడడంగా యోగ ఆరంభం తరువాత యోగ పరంగా మాత్రమే జరగవలసిన అవసరం. అలా జరగడం కూడ అత్యంత వేగంగా మాత్రమే. అలా లోతులు బయటపడడం అత్యంత కార్యవర్తన లేదా వర్కింగు వేగానికి చిహ్నం అనేది విషయం.
9) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
10) ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క వివరణ అర్ధం కావడమే విశేషం అని తెలియనగును.
సమాధానం నెం.645 - ప్రశ్న నెం.645 (8-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - అత్యంత కార్యవర్తన వేగం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm