1) "యస్.యస్. ను నీతోనే ఉంచే లాంటి స్థితిలో నేను నిన్ను ఉంచి ఉండలేదు. అతనిలో వర్తించిన లెవెలు వృథా అయిపోదు" - మాస్టరు గారి డైరీలలో 1-4-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని కంటె ముందు వ్రాయబడిన విషయాలకు కొనసాగింపు కాదు అని చెప్పుకోనయినప్పటికీ, ఈ విషయం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చి ఉంటుంది అని ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క సూక్ష్మ సంబంధ లోతులకు -అంటే సూక్ష్మంగా ఏం జరిగింది లేదా ఏం జరిగి ఉంటుంది అనే లోతులకు- వెళ్తే తెలియరాని విషయం ఏమీ కాదు.
3) ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క సూక్ష్మ సంబంధ లోతులకు వెళ్ళడం కంటె ముందు చెప్పుకోవలసిన అవసరం ఉన్న విధాన పరమైన విషయం ఏమిటి అంటే మాస్టరు గారి డైరీలు గానీ, ఇతర యోగా రికార్డులు గానీ ఎక్కడ చూసినా, ఎంత జాగ్రత్తగా గమనించినా, జరిగిన విషయాన్ని జరిగిన విధంగా చెప్పడం -అది కూడ అవసరమైన చోట పారిభాషిక పదాలలో అందని, అందరాని, అందకూడని భావాలతో/ లోతుల అర్థాలతో, భావనలతో నిండిన యోగ పరమైన పదజాలాన్ని ఉపయోగించి చెప్పడం- మాత్రమే తప్ప, వాటికి సంబంధించిన లోతులు వివరించబడకపోవడం స్పష్టంగానే తెలియనవుతుంది. మాస్టరు యోగా రికార్డులు అక్కడక్కడ అప్పుడప్పుడు అర్థం అయినట్లు అనిపించినా, అర్థమయినట్లు అనిపించినవి గుర్తుండకపోవడం, వాటిని గుర్తు చేసుకోవాలనే ప్రయత్నంలో అవి వాస్తవానికి అర్థం కాలేదని అనిపించడం సహజంగా జరుగుతుంటుంది. ఇది మనిషికి వస్తుతః ప్రస్తుతం ఉన్న పరిమిత జ్ఞాపక శక్తికి సంబంధించి ఉంది అని, ఒకవేళ జ్ఞాపకం బాగా ఉన్నా, ఆ విషయాలు వస్తుతః మనిషికి ఆంతరిక డెవలప్మెంటుకు ఉపయోగపడని అంశాలు మాత్రమే అయి ఉంటాయి అని నిక్కచ్చిగా చెప్పుకోనవుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పరమైన లోతులు కేవలం విధాన పరమైనవి మాత్రమే అని చెప్పుకోనగును. ఇపుడిక ప్రస్తుత ప్రశ్న విషయం లోకి.
4) ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి లిఖిత భాగానికి కొనసాగింపు కాదని చెప్పుకోవడం జరిగింది. దీని ముందరి ప్రశ్న విషయం (నెం.645) లోని "ఇది ముగింపు కాలం గనుక అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది. స్వయంగా నీవు, సీ.వీ. దీనికి ఉదాహరణ" అనే లిఖిత భాగానికి ప్రస్తుత ప్రశ్న విషయం సంబంధించి ఉంది అని తెలియనగును. ఎలా అనేదే చెప్పుకోబోయే విషయం.
5) యస్.యస్. ను నీతోనే ఉంచే లాంటి స్థితిలో నేను నిన్ను ఉంచి ఉండలేదు. ఈ సూచన ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని లోతుల లోనే దీనికి సమాధానం ఉంది. మాస్టరు గారికి తెలిసి గానీ, తెలియని లోతులలో గానీ యస్.యస్. (అంటే సుందరం లేదా యస్. సుందరేశ శర్మ) -అంటే యోగ సంబంధంగా రెండు రథ చక్రాల లాంటి వాళ్ళు అని మాస్టరు గారిని, సుందరంను పేర్కొంటూ పైనుంచి వచ్చిన సమాచారంలో ఒకడయిన సుందరం) ప్రస్తుతం తనతో లేడు లేదా ఉంటే బాగుండేది అనే భావన కలిగింది అని, దానికి సమాధానమే ఈ వాక్యం అని సమంజసంగా చెప్పుకోనవుతుంది. ఆ భావనకు కారణం కూడ తెలియని లోతులలో టచ్ అయి ఉండవచ్చు. ఏమిటి అంటే సుందరం యోగా రికార్డులు పైనుంచి స్వీకరించి వ్రాయడమే తప్ప, యోగా ప్రాక్టీసుకు హాజరయిన మీడియములలో యస్.యస్. పేరు ఎక్కడా కనుపించదు, ఒకే ఒక్క సందర్భాన్ని మినహాయించి. దీనికి కారణం యస్.యస్. కె. కోర్సులో "ఆంటీ గురించి" అనే శీర్షిక క్రింద సీ.వీ. యొక్క మూలానికి సంబంధించిన లోతులను గుంభనంగానే అయినా బయటపెట్టడమే. అందుకు సీ.వీ. యొక్క మూలం ఆగ్రహించి, సీ.వీ. ద్వారా సుందరంను ప్రాక్టీసు సంబంధ యోగ క్రియలకి దూరంగా ఉంచడం జరిగింది అని మాస్టరు గారి డైరీలను నిశితంగా గమనించగలిగితే తెలియనయే విషయం. అది మాస్టరు గారికి స్థూలంగా కాకపోయినా, సూక్ష్మంగా అందని లోతులలో తెలిసిన విషయమే. దీని ముందరి ప్రశ్న విషయం లోని "అత్యంత నీచమైన స్వభావం బయటపడుతుంది" అనే మాటలకు సీ.వీ. సంబంధంగా (ఖచ్చితంగా చెప్పుకుంటే, సీ.వీ. యొక్క మూలం సంబంధంగా) జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి, మాస్టరు గారికి తెలిసి గానీ, తెలియని లోతులలో గానీ సుందరంకు సంబంధించి పైన చెప్పుకున్న భావన కలిగింది అని, దానికి సమాధానంగానే ప్రస్తుత ప్రశ్న విషయం సూచనగా వచ్చింది అని చెప్పుకోనవుతుంది.
6) దీనికి సంబంధించి ఇంకొక కోణంలో యోగ పరమైన అవసరం గురించి కూడ చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. పైనుంచి రికార్డులు స్వీకరించడానికి, వాటిని లిఖించడానికి సంబంధించి సుందరంది అసాధారణ పాత్రయే అయినప్పటికీ, యోగా ప్రాక్టీసుకు సంబంధించిన వ్యవహారాలలో సీ.వీ. పాత్ర ప్రధానమైనది గనుక, సీ.వీ. సహకారం తప్పనిది గనుక , సీ.వీ. యొక్క మూలం వెంకమ్మగా జన్మ తీసుకోవడం లేదా జన్మించడం లోని ఉద్దేశ్యం కేవలం యోగానికి సహకరించడమే గనుక, యోగ ప్రక్రియలకు ఆటంకం కలిగించే సీ.వీ. మూలం మరియు సుందరం సంబంధిత అననుకూల పరిస్థితిని తప్పించడమే "యస్.యస్. ను నీతోనే ఉంచే లాంటి స్థితిలో నేను నిన్ను (మాస్టరు గారిని) ఉంచి ఉండలేదు" అని సూచనగా చెప్పడం లోని ఆంతర్యం అని తెలియనగును.
7) అతనిలో వర్తించిన లెవెలు వృథా అయిపోదు. అతనిలో. యస్.యస్. లో. వర్తించిన లెవెలు. యోగ పరంగా పనిచేసిన లెవెలు. వృథా అయిపోదు. వ్యర్థం కాదు. ఎందుకు వ్యర్థం కాదు అనేది ప్రశ్నించుకుని, సమాధానం చెప్పుకోవలసిన అంశమే. వ్యర్థం కాదు అని అన్నపుడు, అది -అంటే ఆ లెవెలు- మరు జన్మకు సంబంధించింది అని, మరు జన్మలో కూడ అతనిలో వర్తించిన ఆ లెవెలు వృథా కాదు, పనిచేస్తుంది అని చెప్పుకోనవుతుంది. ఎందుకు అంటే అతనిలో పనిచేసిన లెవెలు -అంటే వస్తుతః దివ్య దృష్టి, దివ్య శ్రవణం, పైనుంచి సమాచారాలను స్వీకరించడం అనే అనన్య సామాన్య లక్షణం- సుందరానికి గత జన్మల గొప్ప స్థాయిలకు సంబంధించింది కాదు అని, అది అతని మూలానికి సహజ సిద్ధంగానే సంక్రమించి ఉంది అని, కాకపోతే, యోగ పరమైన డెవలప్మెంటుకు అడ్డుపడని విధంగా మాత్రమే అతనిలో అవసరం మేరకు మార్పులు జరగాలి అని చెప్పుకోనగును. ఇది కాకతాళీయం కాదు అని, విషయం పరంగా ఉన్న, జరుగుతున్న వాస్తవం అని తెలియనగును.
8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
9) ఒక రకంగా అర్థం కాదగిన స్థాయిలో ఉన్న ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క వివరణ అర్థం కావడమే తెలియదగిన విషయం అని తెలియనగును.
సమాధానం నెం.646 - ప్రశ్న నెం.646 (10-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - యస్.యస్. లో పనిచేసిన లెవెలు".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm