1) "సూర్యుణ్ణి భేదించడం, భూమిని ఆపడం, అగ్నిని చల్లార్చడం ఇంకా ఇలాంటి తరహాల లెవెల్సును నీవు చూపుతావు, ఇతరుల మాదిరిగా శక్తి వ్యర్థం అవుతూ పనిచేయడం కాదు" - మాస్టరు గారి డైరీలలో 1-4-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.647 విషయం "యోగా రికార్డుల విషయాలు - రీచింగు, శరీరం అస్వస్థత లేకుండా" అనే దానికి కొనసాగింపు అని తెలియనగును. కాకపోతే, ఎలా కొనసాగింపు అనే విషయం గురించి కూడ చెప్పుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. దీని ముందరి ప్రశ్న విషయంలో రీచింగు క్షణానికి సంబంధించి మూల స్థాయిలకు, స్థూల స్థాయికి రెండిటికీ అన్వయం అయ్యే విధంగా ఎలా ఉంటుంది అనేది చెప్పబడగా, ప్రస్తుత ప్రశ్న విషయంలో మూల స్థాయిల ప్రక్రియ సంబంధంగా సృష్టి స్థాయిలకు అన్వయం అన్నట్లుగా వివరించబడుతోంది అని తెలియనగును.
3) సూర్యుణ్ణి భేదించడం. అంటే సూర్యుణ్ణి పగలగొట్టడం. వినగానే ఒళ్ళు జలదరించే విషయం, సూర్యుడు పగిలిపోతే మరి సృష్టి ఎలా అనే అస్పష్టమైన సందిగ్ధావస్థతో కూడిన తెలియని లోతుల భావనకు/ ఆలోచనకు స్పందనగా. కానీ, అది సూర్యుడు స్థూల స్థాయిలో -అంటే స్థూలంగా కనుపించే సూర్యుడిగా- పగిలిపోవడం కాదు అని, మూల స్థాయిల ప్రక్రియలు యథాతథంగా కాకుండా స్థాయిలు దిగి వచ్చిన కారణంగా ప్రస్తుత సృష్టి నడవడానికి అనుగుణంగా సూర్యునిలో ఏ తత్త్వాలు, మూల ధాతువులు ఏర్పడి ఉన్నాయో, అవి నూతన సృష్టికి, నూతన సృష్టి విధానానికి -అంటే మూల స్థాయిల ప్రక్రియలు జరిగిన అనంతరం ఏర్పడవలసిన నూతన సృష్టికి, నూతన సృష్టి విధానానికి- అనుగుణంగా పనిచేసే నిమిత్తం రావలసిన మార్పులు చేర్పుల కోసం ప్రస్తుతం ఉన్న స్థితిని మార్పు చేయడమే సూర్యుణ్ణి భేదించడం అని తెలియనగును. ఇది స్థూలమైన లేదా స్థూల స్థాయికి సంబంధించిన ప్రక్రియ కాదు అని నిర్ద్వంద్వంగా తెలియనగును.
4) భూమిని ఆపడం. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న భూమిని ఆపడం అంటే తన చుట్టూ తాను తిరగకుండా, సూర్యుని చుట్టూ తిరగకుండా/ పరిభ్రమించకుండా భూమిని ఆపడం కాదు అని ముందుగా నిశ్చయంగా తెలియనగును. ప్రస్తుతం కర్మ విధానానికి అనుగుణంగా నడుస్తున్న ప్రస్తుత సృష్టి విధానంలో గ్రహాలు, రాశులు, నక్షత్రాల ప్రభావానికి లోబడి ఉంటున్న (ఇక్కడ నిక్కచ్చిగా తెలియవలసిన విషయం ఏమిటి అంటే గ్రహాలు, రాశులు, నక్షత్రాలు భూమిని, భూమి మీది జీవనాన్ని శాసించడం కాదు అని, మానవ జీవులు ఎవరి కర్మను వారు తుచ తప్పక అనుభవించేలా చేయడం మాత్రమే గ్రహాలు, రాశులు, నక్షత్రాల విధ్యుక్త ధర్మం అని తెలియనగును) ఆ విశ్వ స్థాయి వస్తువుల ప్రభావానికి లోబడని స్థితికి తీసుకురావడమే భూమిని ఆపడం అని తెలియనగును. అంటే భూమి కార్యక్రమాన్ని ప్రస్తుత సృష్టి విధానపు ప్రభావం నుంచి తప్పించి, నూతన సృష్టి విధానానికి అనుగుణంగా చేయడం అని.
5) అగ్నిని చల్లార్చడం. మండిపోతూ ఉండే లక్షణంతో కూడి ఉన్న అగ్నిని చల్లార్చడం అంటే నిప్పును ఆర్పినట్లుగా ఆర్పివేయడం కాదు అని, ప్రస్తుత సృష్టి విధానంలో లేదా అగ్నిమయ సృష్టిలో -అంటే ప్రతి జీవ కార్యక్రమంలో అగ్నిమయంగా వేడిమి జనియించి, వేడిమి తగ్గడానికి శీతల ప్రక్రియ జరిగి, వేడిమి శీతలం ఒక దాని తరువాత ఒకటి జరిగే ప్రక్రియ వలన క్షీణింపు చోటు చేసుకుని, అది క్రమేణా మరణానికి దారితీసే ప్రస్తుత సృష్టి విధానంలో లేదా అగ్నిమయ సృష్టిలో- క్షీణింపుకు, దాని తదుపరి మరణానికి దారితీయని విధంగా అగ్ని సంబంధంగా మూల స్థాయి మార్పులు చేర్పులు తీసుకురావడమే అగ్నిని చల్లార్చడం అని తెలియనగును.
6) ఇంకా ఇలాంటి తరహాల లెవెల్సును. పైన చెప్పుకున్నటువంటి మూడు ప్రక్రియలు మాత్రమే కాక, ఇలాంటివి లేదా ఇలాంటి తరహాలవి ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి అని, అవే ఇంకా ఇలాంటి తరహాల లెవెల్సు అని తెలియనగును. కాకపోతే, ఇదమిత్థంగా తెలియవలసిన అవసరం ఉన్న విషయం ఏమిటి అంటే ఈ ప్రక్రియలు సమస్తం మూల స్థాయిలకు మాత్రమే సంబంధించినవి అని, సృష్టి సంబంధంగా మాత్రమే వీటికి సంబంధించిన మార్పులు చేర్పులు ఫలితాల రూపంలో తెలియనయే అవకాశం అని, అది కూడ ముందుగా ఆ ఫలితాలు శాస్త్రజ్ఞులకు వాళ్ళ పరిశోధనలలో తెలిసి వెల్లడి అవుతాయి అని, అయినా ఫలితాలు మాత్రమే తప్ప, దాని ముందు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలిసే అవకాశం నాస్తి అని, అది తెలియని, తెలియరాని, తెలియకూడని సృష్టి రహస్యంగానే మిగిలిపోతుంది అని.
7) నీవు చూపుతావు. ఇక్కడి నీవు మాస్టరు గారికి సంబంధించింది కాదు అని, కేవలం మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి మాత్రమే సంబంధించింది అని తెలియనగును. సృష్టి సంబంధంగా జరిగే ఈ మూల స్థాయి ప్రక్రియలు స్థూల లేదా స్థూల స్థాయి మాధ్యమంగా -అంటే స్థూలం లేదా స్థూల స్థాయి కేవలం సాధనంగా జరగవలసిన సృష్టి లక్ష్య అవసరం గనుక, రీచింగు స్థూల స్థాయి స్థూలానికి లేదా మూల ప్రాణం యొక్క స్థూల స్థాయి స్థూలానికి చేరుకున్న అనంతరం, స్థూల స్థాయి స్థూలం మాధ్యమంగా/ సాధనంగా- మూల స్థాయి మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది చేతనే చేయించబడతాయి అని, అదే నీవు చూపుతావు అనే మాటలకు అర్థంగా తీసుకోనవుతుంది.
8) ఇతరుల మాదిరిగా శక్తి వ్యర్థం అవుతూ పనిచేయడం కాదు. ప్రస్తుత సృష్టి విధానంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ స్థాయి ఏ కార్యక్రమం చేపట్టినా శక్తి ఖర్చు కావడం లేదా వ్యర్థం కావడం అనేది సర్వత్రా ఉన్నటువంటి విషయం, విధానం కూడ. ఎందుకు అంటే ఇది శక్తిమయ సృష్టి గనుక, హెచ్చుతగ్గులు, ఉత్థాన పతనాలు, పెరుగుదల తరుగుదల శక్తి నైజం గనుక. రీచింగులో భాగంగా సృష్టి ప్రాణమయం -అంటే ప్రాణం మాత్రమే పనిచేయడం అని కాక, ప్రాణం మరియు శక్తి వాటి ప్రేరణతో మరియు క్రియతో రెండూ కలిసి సమాన ప్రతిపత్తితో, హోదాతో పనిచేయడం అనేదే ప్రాణమయం- కావలసిన అవసరం గనుక, ప్రాణం యొక్క ఎలాంటి తరుగుదల లేని ప్రాణం మరియు శక్తి యొక్క ఎలాంటి తరుగుదల లేని శక్తి పనిచేసే స్థితి, పరిస్థితి నెలకొంటుంది గనుక, "ఇతరుల మాదిరిగా శక్తి వ్యర్థం అవుతూ పనిచేయడం కాదు" అనేది విషయం.
9) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
10) గత జన్మల గొప్ప స్థాయిల సంబంధమైన గొప్ప అనుభూతులకు పరిమితం అవుతున్న యోగ సాధక సమాజ సభ్యులకు ఈ విషయాలు చూచాయగా తెలియడం కూడ వాళ్ళ యోగ పరమైన డెవలప్మెంటుకు దారితీస్తుంది అని తెలియనగును.
సమాధానం నెం.648 - ప్రశ్న నెం.648 (14-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - సూర్యుణ్ణి భేదించడం, వగైరా"
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm