1) "స్వయం యొక్క ఆకృతికి అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి కేంద్రం నుండి ఎలా వర్తించాలి అని అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. 'ఏకం ఆ ఏకంను చూడాలి' " - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.662) అయిన "భవిష్య కార్యవర్తన సరళి యొక్క జాడను నేను సైతం కనుగొనలేకపోయాను" అనే దానికి ఆ వ్యూ యొక్క కార్యక్రమానికి సంబంధించిన విషయంగా కొనసాగింపు అని తెలియనగును.
3) స్వయం యొక్క ఆకృతికి. స్వయం యొక్క మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది యొక్క. ఆకృతికి. మూల స్థాయి మూల ఆకృతికి లేదా సందర్భాన్ని బట్టి మూల స్థాయి స్థూల ఆకృతికి అని కూడ చెప్పుకోనవుతుంది. ఎందుకు అంటే యోగం ఆరంభం కాక ముందు వరకు ఉన్నది కేవలం మూల స్థాయి మూల ఆకృతి మాత్రమే గనుక, యోగం ఆరంభం అయిన పిమ్మట సృష్టి లక్ష్యానికి అనుగుణమైన యోగ లక్ష్యానికి సంబంధించిన విధంగా, సృష్టి సంకల్పం -అంటే సృష్టి ఆరంభం కావడానికి కారణంగా, సృష్టి ఆరంభం కాక ముందే మూల ప్రాణంలో బయలుదేరిన సంకల్పం- అయిన 'నేను ఎవరిని? నేను అది కావాలి' అనే దాని అనుసరణగా మూల స్థాయి మూలానికి ప్రక్రియలు జరిపించబడిన దృష్ట్యా, మూల స్థాయి స్థూలం తయారు చేయబడుతున్న/ చేయబడిన ప్రక్రియల ఫలితంగా, దానిని మూల స్థాయి స్థూలంగా పరిగణించనవుతుంది గనుక. మాస్టరు యోగా రికార్డుల లోని "యమ్. కోర్సు నోట్సు" అనే పుస్తకంలో మూల స్థాయి మూలానికి సంబంధించి జరిపించబడిన విషయాలు, "మాస్టర్స్ కోర్సు" అనే పేరుతో వ్రాయబడిన "యమ్. కోర్సు నోట్సు" వాల్యూం 12 లో మూల స్థాయి మూల ఆకృతిని మూల స్థాయి స్థూల ఆకృతిగా రూపొందించడానికి సంబంధించిన ప్రక్రియలు వివరించబడ్డాయి.
4) అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి. అన్ని వైపులకు అని అన్నపుడు, మామూలుగా చెప్పుకునే అర్థం యొక్క లోతులకు వెళ్ళవలసిన అవసరం. గణిత శాస్త్రంలో చెప్పిన 1వ మితి, 2వ మితి, 3వ మితి, 4వ మితి అనే వాటికి, ఆధ్యాత్మికంగా చెప్పిన లోహ, వృక్ష, జంతు, మనిషి దశలకు కొనసాగింపుగా మనిషి దైవత్వాన్ని పొందాలి అనే దానికి లోతుల అన్వయంతో యోగ పరంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే 4వ మితి అనంతరం లేదా మనిషికి కేంద్రం ఏర్పడడం జరిగి, 6 మితుల ప్రక్రియగా లేదా బాహ్యానికి వికీర్ణం చెందడం జరిగిన అనంతరం, అన్ని మితుల పరమైన వ్యాపకం లేదా అన్ని వైపులకు వికీర్ణం చెందడం. ఈ చివరి ప్రక్రియ కేంద్రం నుండి మాత్రమే జరగవలసిన అవసరం, వ్యాపకం అని అన్నా, అన్ని వైపులకు వికీర్ణం చెందడం అని అన్నా. ఇది బాహ్య ప్రక్రియ -వ్యక్తి సంబంధం గానీ, సృష్టి సంబంధం గానీ- కాదు అని, మూల స్థాయిల సంబంధంగా మూల ప్రాణం యొక్క మూల స్థాయి ఆకృతికి సంబంధించింది అని తెలియనగును.
5) కేంద్రం నుండి ఎలా వర్తించాలి అని. ఏ ప్రక్రియ జరగవలసి ఉన్నప్పటికీ, అది చివరి దశలలో లేదా పూర్తయే సమయంలో మూలం నుండి మాత్రమే చోటు చేసుకోవలసిన అవసరం. మూలం అంటే కేంద్రం లేదా కేంద్రిత కేంద్రం లేదా ఉన్న అన్ని కేంద్రాల యొక్క కేంద్రం అని నిశ్చయంగా తెలియనగును. ఇది మూల విధానం. యోగా రికార్డులను నిశితంగా, సునిశితంగా గమనించగలిగితే, తెలియనయే విషయం ఏమిటి అంటే సృష్టికి ఆరంభం అనేది సృష్టికి మూలం అయిన ప్రాణంతో లేదా మూల ప్రాణంతో లేదా ప్రాణ ఉనికితో కాగా, యోగ ఆరంభం మూల ప్రాణం నుండి వచ్చిన ప్లెంటీ ఆఫ్ ప్రాణా మాస్టరు గారిలో ప్రవేశించడంతో కాగా, యోగ పరంగా జరిగిన సమస్త క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు మాస్టరు గారి స్థూల శరీరంలో ఉండి ఉన్న మూల ప్రాణానికే లేదా ఆరిజినుకే కాగా, మూల స్థాయి ప్రక్రియల ముగింపు సమయంలో స్వయం యొక్క లేదా మూల ప్రాణం యొక్క ఆకృతికి అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి కేంద్రం నుండి ఎలా వర్తించాలి అనేది ప్రస్తుతం చెప్పుకోబడుతున్న విషయం.
6) అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. భవిష్య కార్యవర్తన సరళి యొక్క జాడను తన స్వంత క్రియ ద్వారా ఆ వ్యూయే బయటపెట్టాలి అని దీని ముందరి ప్రశ్న విషయంలో వ్రాయబడి ఉన్న దానిని ఇక్కడ అన్వయించుకోనవుతుంది. అది. అది అంటే వ్యూ లేదా సంకల్పం అని. ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. స్పష్టమే అని అనిపిస్తున్నా, చెప్పుకోవలసిన విషయం ఉంది. ఏమిటి అంటే. మూల స్థాయిల ప్రక్రియ కదా, ఇంతకు ముందు ప్రయోగం అనే మాటకు అర్థం జరగవలసి ఉన్న దానిని జరిపించడం లేదా జరగవలసి ఉన్నదిగా నిర్ణయించబడిన దానిని జరిపించడం అని చెప్పుకోబడింది కదా, మరి ప్రయత్నిస్తూనే ఉంది అనే దానిని ఎలా తీసుకోవాలి అనేది ప్రశ్న. విషయంగా చెప్పబడింది అదే అయినప్పటికీ, చెప్పబడిన వాటి లోతులను, లోతుల లోతులను గుంభనంగానే అయినా చెప్పుకుని, అన్వయించుకోవలసిన అవసరం. ఈ సందర్భంగా 'తన తెలిసిఉండినతనాన్ని తనకు తెలిసి ఉన్నదిగా తానుగా తెలుసుకోవడమే తెలియడం' అనే సూత్రాన్ని అవసరం మేరకు వివరించుకుని అన్వయించుకోనవుతుంది. జరగవలసినదిగా నిర్ణయించబడినప్పటికీ, నిర్ణయం ప్రకారం ఒక్కసారిగా/ వెంటనే జరిగిపోదు అని, ప్రస్తుత సృష్టి విధానం లోని అడ్డుపడే అంశాలను తొలగించుకుంటూ, సరిదిద్దుకుంటూ జరగవలసిందే అని, దానికి పట్టవలసిన సమయం పడుతుంది అని తెలియనగును.
7) ఏకం ఆ ఏకంను చూడాలి. వివరణ లోకి వెళ్ళడం కంటె ముందు చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇది ఒక సూత్రంగా యోగ లక్ష్య సిద్ధి యొక్క ఒక మితి అని. మొదటి పదమైన ఏకం అంటే యాథాలాపంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే నేనుయే అని, ఈ నేనుయే వ్యక్తి యొక్క సూక్ష్మం అని, ఇప్పటి సృష్టి విధానం సమస్తం ప్రస్తుతం సూక్ష్మం యొక్క ఏలుబడిలో ఉంది అని, సూక్ష్మం యొక్క ప్రాబల్యం అడుగంటి, ప్రాణం యొక్క ప్రేరణకు అనుగుణంగా దాని కంటె పై స్థాయిల స్వతంత్ర కార్యక్రమాలకు అనుసరణగా సూక్ష్మం పనిచేయవలసిన అవసరానికే యోగం ఆరంభం అయ్యింది అని తెలియనగును. ఆ ఏకంను. ఇది ఆ ప్రాణమే అని వ్యక్తి సంబంధంగానూ, సృష్టి సంబంధంగానూ చెప్పుకోనవుతుంది. ఆ వ్యూయే తన స్వంత క్రియ ద్వారా బయటపెట్టాలి అనే దానికి విధాన పరమైన పరిష్కారమే ఈ మాటలలో చెప్పబడింది అని, యోగా రికార్డులు సమస్తం విభిన్న రీతులలో దీనికే సంబంధించి ఉన్నాయి అని, ఇది స్థూల స్థాయిలలో మాత్రమే జరగవలసిన మూల స్థాయి కార్యక్రమం అని తెలియనగును. చూడాలి. చూడడం అంటే ఒక సాంకేతిక అర్థాన్ని ఇముడ్చుకున్న పదంగా జరిగే యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల దృష్ట్యా, తన న్యూనత నుంచి బయటపడి, ప్రాణ ప్రేరణ ద్వారా జరిగే తన కంటె ఉన్నత స్థాయిల కార్యక్రమాలకు అనుగుణంగా పనిచేసే ఔన్నత్యమే అని చెప్పుకోనగును.
8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
9) ప్రత్యేకించి ఏమీ లేదు అనేదే తెలియవలసిన విషయం అని తెలియనగును.
సమాధానం నెం.663 - ప్రశ్న నెం.663 (14-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - అన్ని వైపులకు వికీర్ణం చెందడం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm