1) "ఇంకా ఏ తదుపరి సూచన అవసరం లేదు. నీవు ఒకప్పుడు ఆరంభంలో ఉండిన మాదిరిగా అది దాని ఇచ్చానుసారం పనిచేసేటంత వరకు కొంత కాలం ప్రశాంతంగా, ఓపికగా ఉండు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.663) "యోగా రికార్డుల విషయాలు - అన్ని వైపులకు వికీర్ణం చెందడం" అనే దానికి కొనసాగింపు అని, ఆ కొనసాగింపు దీని ముందరి ప్రశ్న విషయంలో "ఆ వ్యూ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. 'ఏకం ఆ 'ఏకం' ను చూడాలి" అని చెప్పిన దానికి స్పందనగా మాస్టరు గారిలో కలిగిన భావనలకు సమాధానం అని తెలియనగును.
3) ఇంకా ఏ తదుపరి సూచన అవసరం లేదు. కేంద్రం నుండి అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి ఎలా వర్తించాలి అని ఆ వ్యూ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది, తన స్వంత క్రియ ద్వారా ఆ వ్యూయే బయటపెట్టాలి అని చెప్పుకున్న మీదట, ఇక ఏ తదుపరి సూచన అవసరం లేదు అనేది విషయం. అంటే క్రియా రూపంగానే బయటపడుతుంది గనుక, సూచన అంటూ ఏదీ అవసరం లేదు అని. ఇక్కడ ఒక ప్రశ్న అవశ్యం వేసుకోదగినదే. ఏమిటి అంటే క్రియా రూపంగా బయటపడడం సరే, కానీ ఆ బయటపడిన దాని గురించి విషయం తెలియాలి, అర్థం కావాలి కదా అని. ఇక్కడ మాస్టరు గారి కాలంలో 12 సంవత్సరాల పాటు జరిగి మాస్టరు గారి డైరీల రూపంలో రికార్డు చేయబడిన దానిని ఆధారంగా తీసుకుని, ప్రస్తుత విషయాన్ని పోల్చి, విశ్లేషించుకోవలసి ఉంటుంది. ఏమిటి అంటే. మాస్టరు గారి కాలంలో జరిపించబడిన యోగా ప్రాక్టీసు సంబంధంగా ఏం జరిగింది అనేది నాటికీ, నేటికీ కూడ తెలియనిదిగానే ఉంది, జరిగిన వాటికి సంబంధించి, గుంభనంగానే అయినా, సూత్ర ప్రాయంగానే అయినా, విషయాలు లిఖిత పూర్వకంగా ఉన్నప్పటికీ. లిఖిత పూర్వకంగా ఉన్న వాటి గురించే దాదాపుగా ఏమీ అర్ధం కాని పరిస్థితి, వేరుగా మాట్లాడుకున్న యోగ విషయాలను పరిగణన లోకి తీసుకుని, రికార్డులలో ఉన్న విషయాలకు సంబంధించి సంబంధం లేని విధంగా పూర్తి స్థాయి అపోహలకు గురి అవుతున్న పరిస్థితి. గుంభనంగానే అయినా, జరిగిన వాటికి సంబంధించి సూచనలు, సమాచారాలు ఉన్నవే అర్థం కాని నేపథ్యంలో, ఎలాంటి సూచన ఇవ్వబడని ముగింపు ప్రక్రియల గురించి తెలియడం, అర్థం కావడం సాధ్యమా అనేది వేసుకున్న ప్రశ్నకు ఆధారం. కాకపోతే, ఇక్కడి విషయం ఏ తదుపరి సూచన అవసరం లేదు అని మాత్రమే, క్రియా రూపంగా బయటపడేవి తెలియనవుతాయా, అర్థం అవుతాయా అనే దానితో సంబంధం లేకుండా. లీలా మాత్రంగా తెలియనయినా, అర్థం కావు, అర్థం కావడం అసంభవం అనేది నిశ్చయంగా చెప్పుకోనయిన విషయమే. అయినా, ప్రస్తుత విషయం సంబంధంగా చెప్పుకోదగిన విధాన పరమైన విషయం ఏమిటి అంటే అసంభవం అయిన దానిని సంభవం చేయగలిగింది రోజువారీ యోగా ప్రాక్టీసును యోగా ప్రాక్టీసుగా చేస్తూ, ఉన్నతతరమైన 2వ తరహా ప్రాక్టీసును -అంటే సింహావలోకనంను- చేయడం వలన గణనీయంగా డెవలప్ అయిన గమనిక స్థాయి మాత్రమే అని.
4) నీవు ఒకప్పుడు ఆరంభంలో ఉండిన మాదిరిగా. నీవు. నీవు అనేది స్థూల స్థాయిగా మాస్టరు గారికి, మూల స్థాయిగా మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి కూడ అన్వయించనవుతుంది అని తెలియనగును, అపోహ పడిన '10 సంవత్సరాల వాగ్దానం' యొక్క ప్రభావం చేత మాస్టరు గారికి "ప్రయత్నిస్తూనే ఉంది" అనే దాని వలన కలిగిన భావనకు సమాధానంగానూ, మాస్టరు గారి స్థూలంలో ఉన్న కారణంగా ఒకలాంటి భావన కలిగే అవకాశం ఉంది అని మూల ప్రాణానికి విధాన పరంగానూ. ఒకప్పుడు ఆరంభంలో. యోగం ఆరంభమైన క్రొత్తలో. ఉండిన మాదిరిగా. ఇక్కడ విధాన పరంగా జరిగే ఒక విషయం గురించి చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. ఏమీ తెలియని ఆరంభంలో -అంటే ఏదయినా క్రొత్తగా ఆరంభమైన కార్యక్రమాలలో- ఉత్సాహం, వగైరాలు ఏమీ తగ్గకుండా పూర్తి స్థాయిలో ఉంటాయి. అలాంటి ఆరంభంలో ఎలాంటి నిరాశా నిస్పృహలు గానీ ఉండవు, సాధించగలం అనే నమ్మకంలో/ విశ్వాసంలో ఎలాంటి తరుగుదల ఉండదు. కానీ, కార్యక్రమం ముందుకు సాగుతున్న కొద్దీ, అవాంతరాలు, అడ్డంకులు రావడం, వాటిని ఎదుర్కొంటూ, అధిగమిస్తూ పోవడంలో ఎంత కాదన్నా వాటి ప్రభావానికి లోనుగాక తప్పదు, ఆరంభంలో ఉండిన మాదిరిగా ఉండలేకపోవడం కూడ తప్పదు. అలాగే, ఆరంభంలో ఉండిన మాదిరిగా ప్రశాంతంగా, ఓపికగా ఉండడం కూడ సాధ్యపడదు.
5) అది దాని ఇచ్చానుసారం పనిచేసేటంత వరకు. అది. ఆ వ్యూ లేదా సంకల్పం. దాని ఇచ్చానుసారం. ఆ వ్యూ లేదా సంకల్పం కేంద్రం నుండి అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి ఎలా వర్తించాలి అని అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది అని చెప్పబడింది గనుక, అదే దాని ఇచ్చ అని, ఆ ఇచ్చకు అనుగుణంగా/ అనుసారంగా అనేది విషయం. పనిచేసేటంత వరకు. ప్రయత్నించడం అనే దాని ఫలితంగా ఇచ్చానుసారం -అంటే అన్ని వైపులకు వికీర్ణం చెందేలా- పనిచేసేటంత వరకు.
6) కొంత కాలం ప్రశాంతంగా, ఓపికగా ఉండు. పైన చెప్పుకున్నది అంతా -అంటే ఆరంభంలో ఉండిన మాదిరిగా ముందుకు సాగి, అలా ముందుకు సాగడంలో ఎన్నెన్నో అడ్డంకులు, ప్రతికూలతలను ఎదుర్కొని అధిగమించిన అనంతరం, వాటి ప్రభావం చేత ముగింపు దశలలో ఉండడం సాధ్యం కానిది అనేది- సృష్టి విధాన సంబంధమైనదే అయినప్పటికీ, ప్రస్తుత సృష్టి విధానాన్ని నూతన సృష్టి విధానంగా ఆవిష్కరింపచేయ సమకట్టిన ఈ యోగంలో ప్రస్తుత సృష్టి విధానం లోని అంశాలకు అతీతంగా మూల స్థాయిల కార్యక్రమం జరుగుతుంది గనుకనే, కొంత కాలం ప్రశాంతంగా, ఓపికగా ఉండు అని చెప్పబడింది అని తెలియనగును. కొంత కాలం. ఎంత కాలమో చెప్పడానికి వీల్లేని పరిస్థితి గనుక, కొంత కాలం అని చెప్పబడింది అని, ఆ కొంత కాలం మాస్టరు గారి కాలంలో ముగియలేదు అని, అంతేకాదు ఈ నాటికీ ముగియలేదు అనేది ఉన్నటువంటి వాస్తవ స్థితి అని తెలియనగును. ప్రశాంతంగా, ఓపికగా ఉండు. ఉన్న విధానానికి విరుద్ధంగా ప్రశాంతంగా, ఓపికగా ఉండు అని చెప్పడంలో లేదా సూచించడంలో ఆ మాటల ద్వారా కూడ ప్రశాంతంగా, ఓపికగా ఉండడానికి సంబంధించిన వర్కు జరిగే అవకాశం మాత్రమే కాదు, జరుగుతుంది అని చెప్పుకోనవుతుంది. ఇది యోగ విధాన పరమైన ఒక సూత్రం అని కూడ తెలియనగును.
7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
8) మాస్టరు గారి కాలంలో చేయబడిన ప్రాక్టీసు నామాలు, కోర్సులు, రెగ్యులేషన్లు, ఎడ్జస్టుమెంట్లు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోతూ, మాస్టరు యోగా రికార్డుల లోని యోగా ప్రాక్టీసు సంబంధ మరియు యోగ సంబంధ విషయాల పట్ల ఆసక్తి అంతగా లేని ప్రస్తుత పరిస్థితులలో పైన 6వ పేరా చివరలో చెప్పబడిన విధాన పరమైన సూత్రం గురించిన అవగాహన కలగడం కేవలం అసాధ్యం అని తెలియనగును.
సమాధానం నెం.664 - ప్రశ్న నెం.664 (16-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆరంభంలో మాదిరిగా".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm