సమాధానం నెం.667 - ప్రశ్న నెం.667 (22-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.667 - ప్రశ్న నెం.667 (22-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం".

Post by Katakam »

1) "స్వయం యొక్క దేహ వ్యవస్థ బయటి వత్తిడిని తట్టుకోలేకపోయినందున మరియు తన అసమర్థతను కనుగొన్నందున, వర్కింగు నెమ్మదిగా జరుగుతోంది. అందుచేతనే ప్రతి దాని లోను ఆలస్యం. ప్రస్తుతం అనుసరించబడుతున్న దానిని మించి ఏ పద్ధతి బాగా వర్తించకుంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.666 విషయం "యోగా రికార్డుల విషయాలు - ఒప్పందం నెరవేరడం") లోని "ఒప్పందం నెరవేర్చబడుతుంది" అనే దానికి సంబంధించిన విషయాలను వెల్లడించేదిగా కొనసాగింపు అని తెలియనగును. ఆ విషయం ఏమిటి అనేది ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క వివరణలో తెలియనవుతుంది. అంతేకాదు, ఆ విషయాలు అప్పటికి ఏమాత్రం బయటపడనివిగానే ఉన్నాయి అని కూడ తెలియనగును.

3) స్వయం యొక్క దేహ వ్యవస్థ. స్వయం యొక్క. మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది యొక్క. దేహ వ్యవస్థ. దేహ వ్యవస్థ అని అన్నపుడు, స్థూల దేహ వ్యవస్థ మాస్టరు గారిది కదా, ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, మాస్టరు గారిలో ఉండి ఆ మూల ప్రాణం యోగ క్రియలకు, ప్రక్రియలకు, ప్రయోగాలకు లోనవడం జరుగుతోంది కదా, మూల ప్రాణం యొక్క దేహ వ్యవస్థ అని అనడం ఏమిటి అనే ప్రశ్న సమంజసమే, పైపై విషయంగా. కానీ, లోతులకు వెళ్ళగలిగితేనే, విషయానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం. మూల ప్రాణం మూల స్థాయి. మాస్టరు గారు స్థూల స్థాయి. మూల స్థాయి మూల ప్రాణం యొక్క స్థూల స్థాయి దేహ వ్యవస్థ -అంటే మాస్టరు గారి స్థూల దేహాన్ని అద్దె శరీరంగా చేసుకోవడం జరిగింది గనుక- అని చెప్పుకోనగును. అద్దె శరీరం ద్వారా మూల ప్రాణం యోగ క్రియలకు, ప్రక్రియలకు, ప్రయోగాలకు లోను కావడం అనే దాని పర్యవసానాలే తదుపరి మాటలలో స్పష్టం చేయబడుతున్నాయి.

4) బయటి వత్తిడిని తట్టుకోలేకపోయినందున.‌ యోగ ప్రక్రియల ముగింపు దశలలో ఆంతరికం బయటి వత్తిడిని తట్టుకోవలసిన -అంటే మూల స్థాయి దేహ వ్యవస్థలో వ్యూ నింపబడి (ప్రశ్న, సమాధానం నెం.650 విషయం "యోగా రికార్డుల విషయాలు - నింపబడిన వ్యూ"), ఆంతరికం బయటికి వికీర్ణం చెందడం ఒక్కటే వేచి ఉంచబడిన విషయం (ప్రశ్న, సమాధానం నెం.651 విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటికి వికీర్ణం చెందడం") అని చెప్పబడి, అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి కేంద్రం నుండి ఎలా వర్తించాలి అని అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది (ప్రశ్న, సమాధానం నెం‌.663 విషయం "యోగా రికార్డుల విషయాలు - అన్ని వైపులకు వికీర్ణం చెందడం") అనే దానికి కొనసాగింపుగా బయటి నుంచి వత్తిడి కలగవలసిన అవసరం ఏర్పడింది, అది చోటు చేసుకున్నపుడు, దేహ వ్యవస్థ బయటి వత్తిడిని తట్టుకోలేకపోయింది అనేది ప్రస్తుత వాక్యంలో తెలియనవుతున్న విషయం. అలా తట్టుకోలేకపోయినందున. ఎందుకు తట్టుకోలేకపోయింది అనేది తరువాత తెలియనవుతుంది.

5) మరియు తన అసమర్థతను కనుగొన్నందున. తన అసమర్థతను అని అన్నపుడు, దేహ వ్యవస్థ సంబంధమైన అసమర్థతను అని తీసుకోనగును. కనుగొన్నందున. బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం అనేది ఎందుకు జరిగింది అని తెలుసుకోవడానికి/ కనుగొనడానికి ప్రయత్నించినపుడు, తెలియవచ్చిన/ కనుగొనబడిన విషయం దేహ వ్యవస్థ యొక్క అసమర్థత అని. దాని పర్యవసానం ఏమిటి అనేది తదుపరి వాక్య భాగం.

6) వర్కింగు నెమ్మదిగా జరుగుతోంది. జరగవలసిన వర్కింగు జరగవలసిన వేగంతో కాకుండా నెమ్మదిగా జరుగుతోంది అనేది తెలియవచ్చిన విషయం. దాని ఫలితం ఏమిటి అనేది తదుపరి వాక్యం.

7) అందుచేతనే ప్రతి దాని లోను ఆలస్యం. అందుచేతనే. పై కారణాల వలన. ప్రతి దాని లోను ఆలస్యం. ప్రతి దాని లోను ఆలస్యం అని అన్నపుడు, ఆ ప్రతిదీ అంటే ఏమిటో తెలియవలసిన అవసరం. ప్రతిదీ అని అన్నపుడు, యోగం ఆరంభం అయిన నాటి నుండి జరుగుతున్న యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు అన్నిటి లోని ప్రతిదీ అని చెప్పుకోనవుతుంది. ఆలస్యం. స్పష్టమే. ప్రతి దాని లోను అని అన్నపుడు, వేసుకోదగిన ప్రశ్న ఏమిటి అంటే మధ్యలో ఏదో ఒక దశలో కాక, ముగింపు దశలలో మాత్రమే ఎందుకు తెలియవచ్చింది, ముందుగా తెలిస్తే, దానిని సరిదిద్దుకుని ఉండే పరిస్థితి కదా అని. మాస్టరు గారి డైరీలలో యోగా ప్రాక్టీసు సంబంధంగా జరిగిన వాటిని అన్నిటిని లోతుగా అధ్యయనం చేయగలిగితే, తెలియనయే విషయం ఏమిటి అంటే జరిగిన వర్కింగులు, ప్రక్రియలు, ప్రయోగాలు సమస్తం మూల స్థాయిలకు సంబంధించినవిగా స్థూల స్థాయిల ద్వారా సృష్టి స్థాయిలు సరిదిద్దబడి, డెవలప్ చేయబడడానికి సంబంధించి జరిగినవి/ జరిపించబడినవి అన్నీ ఆంతరికంగానే అని, ఆంతరికంగా జరిగిన/ జరిపించబడిన వాటికి సంప్రదింపులు, సమాచారాలు, సూచనలు జరిగి ఉన్నాయి అని, ముగింపు దశలలో ప్రస్తుత అవసరం బయటి వత్తిడిని తట్టుకోవడం అనేది బాహ్యం నుండి ప్రక్రియ గనుక, ఇంతకంటె ముందుగా తెలిసే అవకాశం ఉండి ఉండలేదు అని. దీని కారణంగానే ప్రతి దాని లోను ఆలస్యం జరిగింది అని తెలియనగును. ఇంకా లోతులకు వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఆలస్యానికి సంబంధించి చెప్పుకున్న పైపై కారణాలను మించి చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే మాస్టరు గారి స్థూలాన్ని అద్దె శరీరంగా ఉపయోగించుకుని యోగ క్రియలకు, ప్రక్రియలకు, ప్రయోగాలకు లోనవుతున్న మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది తాను తన స్వంత స్థూలాన్ని తీసుకోవలసిన అవసరమే ఆ అసలైన కారణం అని.

8) ప్రస్తుతం అనుసరించబడుతున్న దానిని మించి ఏ పద్ధతి బాగా వర్తించకుంది. పైన చెప్పుకున్న విషయం -అంటే బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం అనే విషయం- దృష్ట్యా, కలగనయిన ఆంతరిక అనుమానానికి -అంటే మాస్టరు గారి ఆంతరికంలో కలగనయిన అనుమానానికి లేదా యోగం సిద్ధిస్తుందా లేక ప్రస్తుతం చేపట్టబడిన ప్రక్రియను మించి ఇంకొక విధంగా ప్రయత్నించవచ్చు కదా అని యాథాలాపంగా మాస్టరు గారిలో కలగనయిన అనుమానానికి- నివృత్తిగా ఈ వాక్యం చెప్పబడింది అని చెప్పుకోనవుతుంది. దీనిని బట్టి తెలియనయే విషయం ఏమిటి అంటే ప్రస్తుతం అనుసరించబడుతున్నదే అత్యుత్తమమైనది అని. చెప్పబడని లోతుల విషయం ఏమిటి అంటే సదరు ప్రక్రియ జరగడానికి మూల ప్రాణం భవిష్యత్తులో తన స్వంత స్థూలాన్ని తీసుకోవడమే అవసరం అని, అదే తదుపరి కాలంలో 6-12-1920 న "ఆది సంకల్పం ప్రకారం వేరొక ఇంటిని సిద్ధం చేయడం జరుగుతోంది, అది ఇంకా పూర్తి కాలేదు. అందుకనే ఆలస్యం" అని గుంభనమైన భవిష్య సూచకంగా చెప్పబడింది అని తెలియనగును.

9) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

10) లోతులకు వెళుతున్న కొద్దీ యోగ పరంగా తెలియవలసిన, తెలియబడుతున్న విషయాల సంక్లిష్టత పెరుగుతూ ఉంటుంది అని, అది యోగ పరమైన డెవలప్‌మెంటు సంబంధంగా ఒకలాంటి తప్పని అవసరం అని నిశ్చయంగా తెలియనగును.
Post Reply