1) "నీది పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకా మంచి ఫలితాలను ఆశించనవుతుంది. నేను చెప్పేది ఇంకా ఏదీ లేదు (లేదా నేను ఇంకా చెప్పడానికి నథింగు మాత్రమే ఉంది). ప్రశాంతంగా ఉండి, నీ స్వంత ప్రగతిని మాత్రమే పట్టించుకో. లేకపోతే పట్టించుకోవడానికి నా స్వంత కార్యక్రమం నాకు ఉంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం మాస్టరు గారికి సంబంధించినదిగా దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్న, సమాధానం నెం.670 విషయం "యోగా రికార్డుల విషయాలు - ముందస్తు ఆలోచనతో ఈ లైనును పనిచేయించడం" కు మరియు ప్రశ్న, సమాధానం నెం.671 విషయం "యోగా రికార్డుల విషయాలు - చక్కదిద్దబడగలిగింది. వేగం" కు) కొనసాగింపు అని, మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి సంబంధించిన విషయంగా దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.671 కి) కొనసాగింపు అని తెలియనగును. ఎలా అనేది వివరణలో తెలియనవుతుంది.
3) నీది పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకా మంచి ఫలితాలను ఆశించనవుతుంది. ఈ వాక్యం మామూలు విషయంగా -అంటే కుటుంబ సంబంధమైన విషయంగా- మాస్టరు గారికి మరియు యోగ సంబంధమైన లేదా యోగ లక్ష్య సిద్ధి దిశకు సంబంధించిన విషయంగా మూల ప్రాణానికి అన్వయించనవుతుంది అని తెలియనగును. మాస్టరు గారికి సంబంధించిన కుటుంబ విషయంగా తెలియవలసింది ఏమిటి అంటే మనసుకు ఏ రకమైన బయటి ఆకర్షణ, వ్యాకులత లేకుండా ఉండి, మాస్టరు గారి ప్రగతికి ఏ ఆటంకాలు లేకుండా ఆయనది పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకా మంచి ఫలితాలను -అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రగతిని- ఆశించనవుతుంది అని. దీనిలో చూచాయగా కూడ చెప్పబడని, తెలియనివ్వబడని విషయం, తదుపరి కాలంలో జరిగిన విషయాన్ని -అంటే మాస్టరు గారు స్థూలం వదలడాన్ని- ఆధారం చేసుకుని ఖచ్చితంగా చెప్పుకోనయే విషయం ఏమిటి అంటే మాస్టరు గారిది పూర్తి కాదు అని, ఇంకా మంచి ఫలితాలను ఆశించనవదు అని. మాస్టరు గారిది పూర్తి కావడం అనే దానిని అప్పటికి జరుగుతుంది అని ఆశించిన ప్రభావమే ఒక రకంగా మాస్టరు గారు మరల స్థూలంగా వచ్చిన తరువాత మాత్రమే యోగం పూర్తవుతుంది (యోగ సాధక సమ్మేళనాలలో అది చేస్తే లేదా ఇది చేస్తే మాస్టరు గారు మరల వస్తారు అని చెప్పుకుంటున్నదే దీనికి నిర్ధారణ) అని ప్రస్తుతం ప్రచారం చేయబడుతున్న భావనకు లేదా అపోహకు కారణం/ మూలం అని సమంజసంగా చెప్పుకోనవుతుంది. ఈ వాక్యాన్ని మూల ప్రాణానికి అన్వయించి చెప్పుకుంటే, బయటికి అలా అని చెప్పబడని భవిష్య సూచకంగా, మూల ప్రాణానిది అప్పటికి పూర్తి కాదు అని (ఎందుకు అంటే మాస్టరు గారి స్థూలం నిలవకుండా పోబోతోంది గనుక, మూల ప్రాణం తన స్వంత స్థూలం తీసుకుని, జరగవలసింది పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకా మంచి ఫలితాలను -అంటే మూల ప్రాణం యొక్క స్వంత స్థూలంలో జరిగే ప్రక్రియలు యోగ సాధక సమాజ సభ్యులకు ఉత్తరోత్తరా పనిచేయవలసిన అవసరానికి అనుగుణంగా పంపకం చేయబడడం అనే ఇంకా మంచి ఫలితాలను- ఆశించనవుతుందని చెప్పబడింది అని తెలియనగును.
4) నేను చెప్పేది ఇంకా ఏదీ లేదు. సాధారణ అర్థంగా, ఇది మాస్టరు గారికి సంబంధించింది అని, వివరణ అవసరం లేనంతగా స్పష్టమే అని తెలియనగును. కాకపోతే, దీని లోతుల గుంభనమైన అర్థం ప్రస్తుత ప్రశ్న విషయం లోని తదుపరి వాక్యంలో ధ్వనించడం గమనించనవుతుంది.
5) (లేదా నేను ఇంకా చెప్పడానికి నథింగు మాత్రమే ఉంది). దీనిని "నేను చెప్పేది ఇంకా ఏదీ లేదు" అనే దాని లోతులలో ఉన్న అర్థంగా తీసుకోనవుతుంది. మాటల అర్థంగా చెప్పుకుంటే, నేను ఇంకా చెప్పాలి అంటే అందుకు నథింగు మాత్రమే ఉంది అని చెప్పుకోనవుతుంది. అప్పటికి కొద్ది కాలంలో జరగబోయే ఘటనను -అంటే మాస్టరు గారు స్థూలాన్ని వదిలివేయడం అనే ఘటనను- ఆధారం చేసుకుని, మాటలలో కనీసం రహస్య సూచకంగా కూడ ఏమాత్రం అప్పటికి చెప్పబడని భవిష్యత్తును ఇది సూచిస్తుంది అని, అది మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి మాత్రమే సంబంధించి ఉంది అని తెలియనగును. అంటే ఈ మాటలలో ఉన్నది మాస్టరు గారి స్థూల శరీరంలో ఉండి అప్పటి యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలకు గురి అవుతున్న మూల ప్రాణానికి కాక, అప్పటి భవిష్యత్తులో (లేదా ఇప్పటి వర్తమానంలో) మూల ప్రాణం తీసుకోబోయే (తీసుకున్న) దాని స్వంత స్థూలానికి సంబంధించి ఉంది అని తెలియనగును. అంటే అప్పటి భవిష్యత్తు అయిన ఇప్పటి వర్తమానంలో మూల ప్రాణం తీసుకున్న స్థూలానికి మాస్టరు నుండి యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు జరిపించబడడం మాత్రమే కాక, వాటికి సంబంధించి, అప్పటి "చెప్పడానికి ఏదీ లేదు" అనే దానికి భిన్నంగా, అతీతంగా ఏదో చెప్పబడుతూ ఉండి ఉండవచ్చు అని అనుకోనగును. అంతేకాదు, చెప్పబడుతూ -అంటే సంప్రదింపు ప్రక్రియలో మాదిరిగా చెప్పబడుతూ- ఉంది అని కేవలం విషయంగా/ సమాచారంగా అందుతున్న విషయం.
6) ప్రశాంతంగా ఉండి, నీ స్వంత ప్రగతిని మాత్రమే పట్టించుకో. ఈ మాటలు మాస్టరు గారిని ఉద్దేశించి చెప్పబడ్డాయి అనేది స్పష్టంగానే తెలియనవుతుంది. ప్రశాంతంగా ఉండి. స్పష్టమే. అంటే ఇతరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ప్రశాంతంగా అని. నీ. పైన చెప్పుకున్నట్లుగా, నీ అనేది మాస్టరు గారికి మాత్రమే సంబంధించింది. స్వంత ప్రగతిని మాత్రమే పట్టించుకో. కేవలం తన యొక్క ప్రగతిని మాత్రమే. మాటలుగా అర్థం అయినట్లే అని అనిపిస్తున్నప్పటికీ, వాస్తవికంగా ఏం చేస్తే తన యొక్క ప్రగతిని పట్టించుకోవడం అవుతుంది అని ప్రశ్న వేసుకుంటే, సమాధానం కొంత కష్టమే. అయినా చెప్పుకోవలసిందే. ఇది స్థూల స్థాయికి సంబంధించిన సూచన కాదు అని, మాస్టరు గారి మూలానికి ఇవ్వబడిన సూచన అని సమంజసంగా చెప్పుకోనవుతుంది. అర్థం కావడానికి సాధ్యం కాని లోతుల విషయంగా చెప్పుకోవాలి అంటే సూక్ష్మం ద్వారా జరిగే శక్తి సంబంధ క్రియలను వివేకంతో విచక్షణతో గమనించడం, గమనికకు అందిన దానిని బట్టి వర్తించడమే తన స్వంత ప్రగతిని పట్టించుకోవడం అవుతుంది అని తెలియనగును.
7) లేకపోతే పట్టించుకోవడానికి నా స్వంత కార్యక్రమం నాకు ఉంది. లేకపోతే. మాస్టరు గారికి సంబంధించి, తన స్వంత ప్రగతిని తాను పట్టించుకోకపోతే. పట్టించుకోవడానికి. స్పష్టమే. నా. నా అనేది మాస్టరుకు లేదా అసలు మాస్టరుకు సంబంధించింది. స్వంత కార్యక్రమం. మాస్టరుకు ఉన్న స్వంత కార్యక్రమం. కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల ప్రస్తుత సృష్టి విధానం తరువాత ఆరంభం అయిన యోగాన్ని జరిపించిన మాస్టరు నుండి వచ్చిన "స్వంత కార్యక్రమం" ఏమిటి అనేది తెలియనవుతుందా అని ప్రశ్నించుకుంటే, యథాతథంగా తెలిసే అవకాశం లేదు అనేది సమాధానం. కాకపోతే, దానికి సంబంధించి (అంటే అది యథాతథంగా కాక) ఎంతో కొంత మాత్రమే చెప్పుకోనవుతుంది అనేది ఇవ్వబడుతున్న అవకాశం. విషయం ఏమిటి అంటే సృష్టి సంబంధంగా మాస్టరు అనే మాట ఉన్నప్పటికీ, ఎన్నో రకాల అర్థాలలో వాడబడుతున్నప్పటికీ, కేవలం ఈ యోగం నిమిత్తం బయటపెట్టబడిన మాస్టరు అనే స్థాయి మూల ప్రాణం కంటె పై స్థాయిది, వన్ పాయింటు కంటె క్రింది స్థాయిది అని, మాస్టరు అనే యోగ సంబంధ స్థాయి గురించి ఏ కొంచెం అయినా తెలియడానికి ఎవరి మూలం గురించి వారికి తెలియడం కనీస అవసరం అని మాత్రమే చెప్పుకోనవుతుంది.
8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
9) తెలియగలిగింది ఏమీ లేదు అని తెలియడమే తెలియదగిన విషయం అని తెలియనగును.
సమాధానం నెం.672 - ప్రశ్న నెం.672 (1-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీది పూర్తి కావడం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm