సమాధానం నెం.683 - ప్రశ్న నెం.683 (23-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 60 సంవత్సరాల స్పీడు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.683 - ప్రశ్న నెం.683 (23-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 60 సంవత్సరాల స్పీడు".

Post by Katakam »

1) "మొదటి 100 గా ఆరంభమయే రెండవది ఒక సెకనులో నిముషం, గంట, రోజులు, వగైరాలను తీసుకోగలిగింది, 60 సంవత్సరాల స్పీడు వర్తించగలిగింది. సృష్టి లోని భూ మానవ రూపాలు వగైరా కోవలో ఇది ఒక రకం" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680 విషయం "యోగా రికార్డుల విషయాలు - సెకనుల గ్రేడు", నెం.681 విషయం "యోగా రికార్డుల విషయాలు - కాలం పెరుగుదల", నెం.682 విషయం "యోగా రికార్డుల విషయాలు - మొదటి వంద, రెండవ వంద" లకు) కొనసాగింపు అని తెలియనగును. అంతేకాదు, కాల చక్ర నిర్మాణానికి సంబంధించిన లోతులు -అంటే సృష్టికి అందని లోతులు- గుంభనంగా, నిగూఢంగా వెల్లడించబడుతున్నాయి అని తెలియనగును.

3) మొదటి 100 గా ఆరంభమయే రెండవది ఒక సెకనులో నిముషం, గంట, రోజులు, వగైరాలను తీసుకోగలిగింది. మొదటి 100 గా ఆరంభమయే రెండవది. మొదటి 100 గా అంటే కాల చక్రం లోని -లేదా నాలుగు పావుల కాల చక్రం లోని- మొదటి పావులో లేదా 15 డిగ్రీలలో (లేదా గడియారం లోని మొదటి 15 నిముషాలలో - ఇది కేవలం విషయ అవగాహన కోసం మాత్రమే) మొదటి 100 గా అని మాత్రమే తెలియనగును. ఆరంభమయే. స్పష్టమే. రెండవది. ఇక్కడ కొంత వివరణ అవసరం. ఏమిటి అంటే. రెండవది లేదా మొదటి 100 గా ఆరంభమయే రెండవది అని అన్నపుడు, ఆ రెండవ దానికి మొదటిది ఏది అనేది సహజంగా కలగవలసిన ప్రశ్నయే. కొంత సునిశితంగా యోచించగలిగితే, సమాధానం అంత కష్టమేమీ కాదు. కాలం పుట్టుక ముందు ఏదయితే ఉందో లేదా కాలం యొక్క ఉనికి దేని నుంచి ఏర్పడిందో, అదే మొదటిది లేదా రెండవది యొక్క మొదటి దానికి సంబంధించింది. అదే ప్రాణం. అంటే ప్రాణమే మొదటిది లేదా ఏకమే మొదటిది. (ఈ సందర్భంగా బయటపడుతున్న ఒక అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే ప్రాణం లేదా మూల ప్రాణం లేదా మరణం/ అంతం లేని ప్రాణం నుండి అంతం లేకపోవడం అనే అనితర సాధ్యమైన లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నది కాలం అని). అలా ప్రాణం లేదా ఏకం లేదా ఆది మొదటిది కాగా, మొదటి 100 గా ఆరంభమయేది రెండవది అనేది విషయం. ఒక సెకనులో నిముషం, గంట, రోజులు, వగైరాలను తీసుకోగలిగింది. ఇక్కడ ఆవిష్కృతం అవుతున్న రెండవ అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే కాల ఉనికి సంబంధంగా కాల గణనలో అత్యంత చిన్న ఏకాంశం అయిన సెకండు లేదా రెండవది అనే మాట లోనే ఈ మూల స్థాయి మర్మం ఇమిడి ఉంది అని, ఇది దేహ వ్యవస్థను పులకరింపచేసే అత్యద్భుత సన్నివేశం లేదా ఘటన అని. సెకండు లేదా రెండవది అయి ఉండి, మొదటి 100 ఆరంభమయేది ఒక సెకనులో నిముషం, గంట, రోజులు, వగైరాలను తీసుకోగలిగింది అనేది విషయం. వగైరాలను అంటే నెలలు, సంవత్సరం అని తెలియనగును. సెకను, నిముషం, గంట, రోజులు, నెలలు, సంవత్సరం అనే కాల విభజన గురించి దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.680 విషయం "యోగా రికార్డుల విషయాలు - సెకనుల గ్రేడు") లో వివరించబడింది.

4) 60 సంవత్సరాల స్పీడు వర్తించగలిగింది. 60 అనే సూత్రంలో సెకను 60 సెకనులు ఒక నిముషంగా నిముషానికి, నిముషం 60 నిముషాలు ఒక గంటగా గంటకు పెరిగింది అని ఇంతకు ముందు చెప్పుకున్న మీదట, ఆ 60 సూత్రం ఆధారంగా కాల గణనలో అతి పెద్దది అయిన సంవత్సరంతో అన్వయం అయి, 60 సంవత్సరాల స్పీడు వర్తించగలిగింది అనేది విషయం. 60 సూత్రమే సంవత్సరానికి ఎందుకు అన్వయం అయింది అనేది వేసుకోదగిన ప్రశ్నయే. అతి చిన్న మానం/ గ్రేడు/ పెరుగుదల నుండి అతి పెద్ద మానంకు/ గ్రేడుకు/ పెరుగుదలకు వెళ్ళిన తరువాత మరల లోతుల తేడాతో అదే మానం ఆరంభం అవుతుంది అనే సూత్రాన్ని గణిత శాస్త్రం లోని సంఖ్యా మానంలో ఒకటి నుండి పది అయిన తరువాత పదికి ఒకటి నుండి తొమ్మిది వరకు అదనంగా కలవడమే / కలపడమే జరగడం -అంతేకాదు, 20, 30, 40, 100, 500, 1000 తరువాత ఒకటి నుండి తొమ్మిది వరకు కలుస్తూ/ కలుపుకుంటూ పోవడం- అనే దానిలో స్పష్టంగానే తెలియనవుతుంది, మానవ జీవన జీవిత విధానాల లోను, సృష్టి స్థాయిల లోను కూడ, కాకపోతే, గుర్తించడానికి వీల్లేనంత గుంభనమైన లోతులలో. వర్తించగలిగింది అనే మాటకు కొంత వివరణ చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. వర్తించగలిగింది అనే మాట లోనే ఒకానొక పరిమితికి లోబడి వర్తించింది అని, పై వివరణను ఆధారం చేసుకుని, మొదటి 100 గా ఆరంభమయే రెండవది మొదటి దాని లోని లేదా రెండవ దాని ముందరి దాని లోని దానిని వర్తించలేకపోయింది అనేది గుంభనంగా ధ్వనించడం తెలియనవుతుంది. దీనికి సంబంధించిన మరింత లోతుల వివరణ ప్రస్తుత ప్రశ్న విషయం యొక్క తదుపరి వాక్యాలలో తెలియనవుతుంది.

5) 60 సంవత్సరాల స్పీడు వర్తించగలిగింది అనే దానికి సంబంధించి సృష్టి సంబంధంగా మరికొంత వివరణ చెప్పుకోనవుతుంది. సృష్టిలో పనిచేశాయని చెప్పుకుంటున్న 64 విద్యలకు, ఈ యోగం ఆరంభం కాక ముందు 64 యోగాలు సాధన చేయబడ్డాయి అని చెప్పుకుంటున్న వాటికి, తెలుగులో బయటపడిన సంవత్సరాల ప్రభవ, విభవ, మొదలైన 60 పేర్లకు, ఈ యోగంలో ప్రాక్టీసు చేయబడిన/ చేయబడుతున్న 60 (64) బ్రీతింగులకు ఈ 60 మానంతో లింకు ఉంది అని మాత్రమే చెప్పుకోనవుతుంది, వివరణల లోకి వెళ్ళకుండా.

6) సృష్టి లోని భూ మానవ రూపాలు వగైరా కోవలో ఇది ఒక రకం. సృష్టి లోని. ప్రస్తుత సృష్టి లోని. మూల స్థాయిలు యథాతథంగా దిగి రాని, నూతన సృష్టి విధానం పరంగా మూల స్థాయిలు యథాతథంగా దిగి రావలసిన అవసరం ఉన్న ప్రస్తుత సృష్టి లోని. భూ మానవ రూపాలు వగైరా. భూ మానవ రూపాలు వగైరా అని అన్నపుడు, భూమి మీద సృష్టించబడిన మానవ రూపాలు, వాటితో పాటు మిగతా మూడు ముందరి దశల రూపాలు -అంటే లోహ, వృక్ష, జంతు జీవ దశల రూపాలు- కూడ అని తెలియనగును. మానవ రూపాలు వగైరా అని కాక, మానవ రూపాలు అని మాత్రమే చెప్పుకున్నట్లయితే, మానవ రూపాలకు సంబంధించిన 60 కంటె ముందు 60 ని మించిన మానం వర్తించి ఉండిందా అనే ప్రశ్న ఉదయించే అవకాశం గనుక, దానికి అవకాశం లేకుండా సృష్టి లోని భూ మానవ రూపాలు అని చెప్పబడింది అని, మానవ రూపాలతో పాటు ముందరి జీవ జాతుల రూపాలు కూడ 60 మానానికి మాత్రమే వర్తించి ఉన్నాయి అని గ్రహించేలా చేయడమే ఇక్కడి ఉద్దేశ్యం అని తెలియనగును. కోవలో. సృష్టి లోని ఈ భూమి మీద సృష్టించబడిన మానవ రూపాలు, వాటితో పాటు ముందరి మూడు జీవ దశల రూపాలు అనే కోవలో. ఇది ఒక రకం. 60 మానంతో ఉండడం అనేది ఒక రకం. ఒక రకం అని అన్నపుడు, ఇంకా ఏవయినా రకాలు ఉన్నాయా అనేది లోతుల నుంచి బయటపడి, వేసుకోదగిన ప్రశ్నయే. వేరే రకాలు ఉన్నాయి అనేది ఒక రకం అనే మాటల లోనే ధ్వనిస్తున్న విషయం తెలియదగినదే. మానవ రూపాలకు భిన్నంగానా, మానవ రూపాలకు సంబంధం లేకుండానా అని ప్రశ్నించుకుంటే, మానవ రూపాలకు లేదా స్థూల రూపాలకు భిన్నంగానే అయినా, మానవ రూపాలకు సంబంధం లేకుండా కాదు అనేది సమాధానం. ఈ సమాధానంతో విషయం కొంత స్పష్టమైనట్లే. స్థూల రూపాలకు భిన్నంగా సూక్ష్మ రూపాలు, మూల/ ప్రాణ స్థాయిలు అనేది తెలియని విషయమేమీ కాదు, కాకపోతే, ఈ సందర్భానికి అన్వయించి చెప్పుకోవడం మాత్రమే. మానవ రూపాలకు సంబంధం లేకుండా కాదు అని అన్నపుడు, స్థూలాలకు లేదా స్థూల రూపాలకు, సూక్ష్మ రూపాలకు, మూల స్థాయిలకు అవినాభావ సంబంధం సృష్టి మర్మంగా ఉంది అని, అది తెలియడమే సృష్టి/ యోగ లక్ష్య సంబంధం అని తెలియనగును.

7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

8) వివరించబడిన దానిని చూచాయగా కనీసంగా తెలియగలగడమే విశేషం అని తెలియనగును.
Post Reply