1) "మొదటి సెకను సెకనులను పెంచనారంభించింది, ఎలాంటి కుంచింపు లేని ౦ గా, ఇంకా లోపలి వైపు 100 ను కలిగి ఉండి, 60 అనే ఒక పెరుగుదలను చూపడానికి, అది నిలిచింది. ౦ గా ఏర్పడిన ౹ 100 గా తయారయే క్రమంలో స్థిరంగా ఉంచుకుని 100 అనే/ యొక్క సామర్థ్యాన్ని చూపడానికి ౦ ను ప్రయత్నించింది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680, 681, 682, 683, 684 లకు) కొనసాగింపు అని తెలియనగును. ఈ ప్రశ్న విషయాలు అన్నీ కాల సంబంధమే -అంటే ప్రస్తుత సృష్టి విధానంలో పనిచేస్తున్న కాల సంబంధమే- అయినప్పటికీ, సృష్టి లోని కాల గణనకు సంబంధించిన మూల లేదా శూన్య స్థాయిల లోతులు గుంభనంగా, నిగూఢంగా వివరించబడుతున్నాయి అని, వీటిలో సృష్టి లక్ష్య సంబంధమైన విషయాలు అర్థం అయీ కానట్లుగా తొణికిసలాడుతున్నాయి అని తెలియనగును.
3) మొదటి సెకను సెకనులను పెంచనారంభించింది. మొదటి సెకను. శూన్య స్థాయిలలో ఉనికి రహిత కాలంగా ఉండి, మూల ప్రాణం ఉనికి లోనికి వచ్చిన అనంతరం ఉనికి సహిత కాలంగా వచ్చినదే మొదటి సెకను. దీని సంబంధంగా ఉనికి రహిత, ఉనికి సహిత స్థాయిల గురించిన విధాన పరమైన విషయం ఏమిటి అంటే మూల ప్రాణం ఉనికి లోనికి వచ్చిన అనంతరం బయటపడిన కాలం గానీ, సృష్టి చేయబడడానికి అవసరమైన మూల వనరులు గానీ, సృష్టి చేసిన శక్తి/ ఆదిశక్తి గానీ, మూల ప్రాణ ఉనికి లోనే అంతర్నిహితంగా ఉండి బయటపడడం/ విడిపడడం జరిగింది. దీని దృష్ట్యా చెప్పుకోనయిన విషయం ఏమిటి అంటే చేయబడిన సృష్టి సంబంధంగా అది (కాలం) సూక్ష్మాన్ని మించినదిగా శూన్య/ మూల స్థాయిలలో ఉన్నటువంటిదే అని, కాల సంబంధంగా భూతం వర్తమానం భవిష్యత్తు సమస్తం మూల స్థాయిలలో జరిగిపోయి ఉన్నటువంటివే అని, 9వ శూన్య స్థితి అయిన సృష్టి అనంతరపు నన్, వేకెంట్, వాయిడ్, నిహిల్ అనే శూన్య స్థితులు మూల ప్రాణ సంబంధంగా మరియు సృష్టి మానవుల సంబంధంగా అప్పటి భవిష్యత్తుకు సంబంధించి ఉన్నాయి అని. సృష్టి విధానంలో మరియు ప్రస్తుత సృష్టి విధానంలో భాగంగా కర్తృత్వ భావనకు గురి అయిన మనిషికి ఈ విషయం మింగుడు పడడం సాధ్యం కానిదే. సెకనులను అని అన్నపుడు, అది ఉనికి లోనికి వచ్చిన కాలంగా సెకను, నిముషం, వగైరాకు సంబంధించిన సెకనుల గ్రేడే అని తెలియనగును. పెంచనారంభించింది. స్పష్టమే.
4) ఎలాంటి కుంచింపు లేని ౦ గా, ఇంకా లోపలి వైపు 100 ను కలిగి ఉండి 60 అనే ఒక పెరుగుదలను చూపడానికి, అది నిలిచింది. ఎలాంటి కుంచింపు లేని. కాలం ఉనికి లోనికి రావడం, సెకనులతో ఆరంభమై 60 సంవత్సరాల స్పీడుకు పెరగడం అనేవి విస్తరణలో భాగం అని చెప్పుకున్న మీదట, ఇంకా ఆగని, ఆపుకోలేని వేగం కాలం యొక్క లక్షణం అయి ఉన్నందున, ఎలాంటి కుంచింపు -అంటే కుంచించుకుపోవడం- లేని అనేది ఇక్కడి విషయం. ౦ గా. ఇది నిల్ కాదు అని, మూల ప్రాణం నుండి ఉనికి లోనికి వచ్చిన బిందు రూపం లేదా కాల రూపం లేదా కాల చక్రం అని తెలియనగును. లోపలి వైపు 100 ను కలిగి ఉండి. లోపలి వైపు అని అన్నపుడు, కాలం దేని నుంచి బయటపడిందో, అదే కాలానికి లోపలి వైపు అవుతుంది అని, ఆ లోపలి వైపు అది 100 ను -అంటే పూర్తి స్థాయిని- కలిగి ఉంది అనేది విషయం. 100 అంటే పూర్తి స్థాయి అని ఎలా చెప్పనవుతుంది అని ప్రశ్న వేసుకుంటే, ప్రపంచం అంతటా 100 ని పూర్తి స్థాయిగా, 50 అంటే సగంగా, 25 అంటే పావుగా పరిగణిస్తున్న విషయాన్ని గమనించడం మాత్రమే జరుగుతుంది తప్ప, ఎందుకు అనే దానికి శూన్య స్థాయిల ప్రక్రియలలో తెలియబడకుండా ఉన్నది సృష్టికి ఏనాటికీ తెలియబడదు అని మాత్రమే చెప్పుకోనవుతుంది. శూన్య స్థితుల, స్థాయిల ప్రక్రియల లోతులు వివరంగా తెలియనయితే, దీనికి సమాధానం తెలియనవుతుంది, కానీ సాధ్యమేనా అని ప్రశ్నించుకుంటే, ప్రస్తుతానికి అసాధ్యం అనేది సమాధానం. 60 అనే ఒక పెరుగుదలను చూపడానికి అది నిలిచింది. దీని కంటె ముందు చెప్పుకున్న కాల సంబంధ వివరణ లోనే దీనికి వివరం తెలియనవుతుంది.
5) ౦ గా ఏర్పడిన ౹ 100 గా తయారయే క్రమంలో స్థిరంగా ఉంచుకుని 100 అనే సామర్థ్యాన్ని చూపడానికి ౦ ను ప్రయత్నించింది. ఈ వాక్యం కాల సంబంధంగా చెప్పుకోబడినప్పటికీ, దీనిలో సృష్టి లక్ష్య పరంగా, యోగ లక్ష్య పరంగా చాలానే విషయాలు ఉన్నాయి అని, వాటిని చెప్పుకోవడం ఎంతయినా అవసరం అని తెలియనగును. ౦ గా ఏర్పడిన ౹. ౹ అంటే ఏకం లేదా మూల ప్రాణం అని తెలిసిన విషయమే. ౦ గా ఏర్పడింది అనే దానికి ఇప్పటి వరకు జరిగిన యోగ ప్రక్రియలను -అందులో ముఖ్యంగా అంతిమ దశలలో జరిగిన వాటిని- ఆధారం చేసుకుని చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే సృష్టి వెనుక ఉన్న సంకల్పంలో భాగంగా మూల ప్రాణం నిష్క్రియాత్మకత నుండి క్రియాత్మకతకు రావడం కోసమే యోగం ఆరంభం అయ్యింది అని, యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు జరిపించబడ్డాయి అని, అంతిమ దశల ప్రక్రియలలో మూల స్థాయి స్థూలం తయారయినప్పటికీ, ఆంతరికం నుండి బాహ్యానికి వికీర్ణం చెందడానికి అనుగుణంగా కాల సంబంధమైన ప్రక్రియల అన్వయంతో విషయం వెల్లడించబడుతోంది అని. 100 గా తయారయే క్రమంలో. 100 గా తయారయే క్రమంలో అని అన్నపుడు, దీని ముందరి ప్రశ్న విషయాలు అయిన "మొదటి 100 గా ఆరంభమయే రెండవది" (ప్రశ్న, సమాధానం నెం.684), "కనుక ఈ రెండవది 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరింపచేయబడింది" (ప్రశ్న, సమాధానం నెం.685) అనే వాటి లోని వివరణలను గుర్తు చేసుకుని, ప్రస్తుత సందర్భానికి అన్వయించుకోనవుతుంది. స్థిరంగా ఉంచుకుని. ఎలాంటి తగ్గుదల లేకుండా ఉంచుకుని. 100 అనే/ యొక్క సామర్థ్యాన్ని. "మొదటి 100 లేదా మొదటి 100 గా ఆరంభమయే రెండవది" కానటువంటి 100 లేదా "౦ నుండి ౹ కి అది ఎంత స్పీడుకు అయినా పనిచేయవచ్చును" అనే దాని లోని పూర్తి స్థాయి 100 లేదా మూల ప్రాణం ఉనికి లోనికి రాక ముందు ఉన్నటువంటి పూర్తి స్థాయి. సామర్థ్యాన్ని చూపడానికి. సామర్థ్యాన్ని చూపడానికి అని అన్నపుడు, సామర్థ్యాన్ని పొందడానికి కాదు అని, అంతిమ దశల ప్రక్రియల పరంగా పొందబడిన సామర్థ్యాన్ని చూపడం మాత్రమే అని, సామర్థ్యాన్ని పొందడం మరియు సామర్థ్యాన్ని చూపడం అనేవి ఒక దానికి మరొకటి కొనసాగింపే అయినప్పటికీ, అవి రెండూ భిన్నమైన సూక్ష్మాతిసూక్ష్మ ప్రక్రియలు అని, రెండవ ప్రక్రియ అయిన సామర్థ్యాన్ని చూపడం అనేది విడిగా జరగవలసిందే అని తెలియనగును. అలా సామర్థ్యాన్ని చూపడానికి. ౦ ను ప్రయత్నించింది. ఇక్కడ ౦ అనేది నిల్ కాక, పై వాక్య భాగంలో చెప్పుకున్న "౦ గా ఏర్పడిన ౹" గా లేదా ౦ సామర్థ్యాన్ని పొందడంగా తెలియనగును. అలా పొందిన ౦ సామర్థ్యాన్ని చూపే నిమిత్తం ప్రయత్నించింది అనేది విషయం.
6) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
7) విషయంగా అర్థం కావడం అసాధ్యమే అయినా, అర్థం కాని, అందని లోతులలో విషయం నిక్షిప్తం అవుతుంది అని తెలియనగును.
సమాధానం నెం.686 - ప్రశ్న నెం.686 (29-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 100 అనే సామర్థ్యం కోసం ౦ ను ప్రయత్నించడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm