సమాధానం నెం.688 - ప్రశ్న నెం.688 (2-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౹ కి 100 ను మించిన సామర్థ్యం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.688 - ప్రశ్న నెం.688 (2-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౹ కి 100 ను మించిన సామర్థ్యం".

Post by Katakam »

1) "అలా ఈ ౹ కి 100 ని మించిన సామర్థ్యం ఉంది, దానికి పరిమాణం తెలుసు, గుణం తెలుసు. కనుక ఈ ౹ ౦ యొక్క గుణాన్ని తెలుసుకుని, 15 సెకన్ల తదుపరి వేరే దానిని గుణంలో (గడియారంలో 0 నుండి 15 వరకు కనుపించే) క్వార్టరుగా గుర్తుపెట్టి, మరియొక క్వార్టరును పరిమాణంలో గుర్తుపెడుతుంది. పిమ్మట 15 సెకన్ల కొరతను తెలుసుకోవడం ద్వారా 45 క్వార్టరును బరువుగా" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం 15-12-1921 న కాల సంబంధంగా చెప్పబడిన దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680-687 లకు) కొనసాగింపు అని తెలియనగును.

3) అలా. దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.687 విషయం "యోగా రికార్డుల విషయాలు - గుణాన్ని చూపడానికి పరిమాణం అవసరం") లోని "100 గా తన లక్షణాన్ని చూపడానికి అంతే పరిమాణం అవసరం అని దానికి తెలియవచ్చింది. కనుక ౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని, ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న అదే ౦ కోసమే అని అది నిశ్చయించుకుంటుంది" అనేది జరిగి ఉన్నందున.

4) ఈ ౹ కి 100 ను మించిన సామర్థ్యం ఉంది, దానికి పరిమాణం తెలుసు, గుణం తెలుసు. ఈ ౹ కి. యోగ లక్ష్య సంబంధంగా జరిగిన యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల లోని అంతిమ దశల ప్రక్రియల అనంతరం, అప్పటి ౹ లేదా మూల ప్రాణం -అంటే 1 నుండి 5 శూన్య స్థితులలో జరిగిన శూన్య స్థాయిల ప్రక్రియల ఫలితంగా కేవలం ప్రాణం ఉనికి లోనికి వచ్చి, దాని నుండి సంకల్పం బయటపడిన అనంతరం, నిష్క్రియాత్మక స్థితి లోనే ఉండిపోయిన ౹ లేదా మూల ప్రాణం- యోగ ఆరంభానికి మూలమై, యోగ ఆరంభం అనంతరం జరిపించబడిన యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలకు గురి అయి, అంతిమ దశల ప్రక్రియలలో క్రియాత్మక స్థితికి వచ్చి, తన నైజంతో పనిచేయగలిగిన స్థాయికి వచ్చిన వైనం. 100 ను మించిన సామర్థ్యం ఉంది. 100 ను మించిన సామర్థ్యం ఉంది అని అన్నపుడు, 100 అంటే పూర్తి స్థాయియే కదా, దానిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. ప్రక్రియగా 100 కి లేదా పూర్తి స్థాయికి చేరుకోవడం అంటే పూర్తి స్థాయిగా కావడం వేరు, ఆ పూర్తి స్థాయిగా లేదా 100 గా పనిచేయగలగడం వేరు. పూర్తి స్థాయికి రావడానికి సంబంధించిన లోతులు తెలియడమే పూర్తి స్థాయితో పనిచేయడానికి కారణం అవుతుంది. అంటే పూర్తి స్థాయిని మించి ఉండడం. అదే ఇక్కడి విషయం ఈ ౹ కి 100 ను మించిన సామర్థ్యం ఉంది అని. ఇవి అర్థం అయ్యేలా లేదా అర్థం కావడానికి చెప్పబడినవే తదుపరి వాక్యాలు.

5) దానికి పరిమాణం తెలుసు, గుణం తెలుసు. మొదటిది గుణం, రెండవది పరిమాణం. కానీ, ఇక్కడ పరిమాణం తెలుసు, గుణం తెలుసు అని అనడంలో -అంటే రెండవది ముందు, మొదటిది దాని తరువాత చెప్పడంలో- ఉన్న విషయానికి కారణం తెలియవలసిందే. దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.687) లోని "100 గా తన గుణాన్ని చూపడానికి అంతే పరిమాణం అవసరం అని దానికి తెలియవచ్చింది" అనే దానినే సమాధానంగా తీసుకోనగును. అంటే పరిమాణం కలిగిన తరువాతనే గుణాన్ని చూపనవుతుంది అనేది.

6) కనుక ఈ ౹ ౦ యొక్క గుణాన్ని తెలుసుకుని, 15 సెకన్ల తదుపరి వేరే దానిని గుణంలో (గడియారంలో 0 నుండి 15 వరకు కనుపించే) క్వార్టరుగా గుర్తుపెట్టి. ఈ ౹. దీని గురించి పైన చెప్పుకోవడం జరిగింది. ౦ యొక్క గుణాన్ని. ౦ యొక్క గుణాన్ని అని అన్నపుడు, దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.687) లోని "కనుక ౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని అది నిశ్చయించుకుంటుంది" అనే దానిని విషయంగా తీసుకోనగును. అంటే క్వార్టర్స్ సూత్రాలతో పనిచేయడం ౦ యొక్క గుణం/ లక్షణం అని. తెలుసుకుని. స్పష్టమే. 15 సెకన్ల తదుపరి వేరే దానిని. 15 సెకన్ల తదుపరి వేరే దానిని అని అన్నపుడు, దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.682 విషయం "యోగా రికార్డుల విషయాలు - 60 సంవత్సరాల స్పీడు") లోని "మొదటి 100 గా ఆరంభమయే రెండవది" అనే దానికి ఇవ్వబడిన వివరణను తీసుకుని, అన్వయించుకోనవుతుంది. అంటే క్లుప్తంగా, ౦ అనే మొత్తం ఉనికికి తదుపరిదిగా మొదటి 15 సెకన్లు లేదా ౦ తదుపరి నుంచి 15 సెకన్లు లేదా గడియారం లోని 0 తదుపరి నుంచి 15 నిముషాలు. గుణంలో (గడియారంలో 0 నుంచి 15 వరకు) క్వార్టరుగా గుర్తుపెట్టి. గుణానికి సంబంధించిన క్వార్టరుగా గుర్తుపెట్టి. ౦ తరువాత నుంచి 15 వరకు ఉన్న మొదటి పావును గుణానికి సంబంధించినదిగా గుర్తుపెట్టి.

7) మరియొక క్వార్టరును పరిమాణంలో గుర్తుపెడుతుంది. మరియొక క్వార్టరును. 15 సెకనుల తరువాత 30 వరకు ఉన్న రెండవ క్వార్టరును లేదా గడియారం సంబంధంగా 15 నుంచి 30 వరకు నిముషాలను. పరిమాణంలో గుర్తుపెడుతుంది. స్పష్టమే. అయినప్పటికీ, కొంత వివరణ. కొంత వివరణ కంటె ముందు, ఈ ప్రక్రియలు మూల స్థాయిలకు మాత్రమే సంబంధించినవి, స్థూల స్థాయిలకు కాదు అని గుర్తు చేసుకోనగును. ఎందుకు అంటే గుణం అనే దానికి సంబంధించి కాకపోయినా, పరిమాణం, దాని తదుపరి బరువు గురించి స్థూల సంబంధమైన భావన కలిగే అవకాశం గనుక.

8) పిమ్మట 15 సెకన్ల కొరతను తెలుసుకోవడం ద్వారా 45 క్వార్టరును బరువుగా. పిమ్మట. మొదటి 15 సెకన్ల క్వార్టరును గుణానికి సంబంధించినదిగా, ఆపైన రెండవ 15 సెకన్ల క్వార్టరును పరిమాణానికి సంబంధించినదిగా గుర్తుపెట్టిన పిమ్మట. 15 సెకన్ల కొరతను తెలుసుకోవడం ద్వారా. 15 సెకన్ల కొరతను అని అన్నపుడు, ఆ కొరత ఏదో ఒక్క క్వార్టరుకు సంబంధించింది కాదు అని ముందుగా తెలియనగును. అంటే మొదటి 15 సెకన్ల కొరతతో రెండవ 15 సెకన్లు, రెండవ 15 సెకన్ల కొరతతో మూడవ 15 సెకన్లు, మూడవ 15 సెకన్ల కొరతతో నాలుగవ 15 సెకన్లు. కాకపోతే, దీనిని వేరే మితిలో చెప్పుకోవాలి అంటే, గుణం లేదా గుణం క్వార్టరు లేనిది పరిమాణం క్వార్టరు, పరిమాణం లేదా పరిమాణం క్వార్టరు లేనిది బరువు/ భారం క్వార్టరు, బరువు లేదా బరువు క్వార్టరు లేనిది నాలుగవ క్వార్టరు. పేరుకు నాలుగవ క్వార్టరు అని చెప్పుకున్నప్పటికీ, అది మూడు క్వార్టర్ల సమాహారంగా కావడం అనే దానికి లేదా ౦ ౹ కావడానికి సంబంధించింది. ౦ ౹ కావడం అనేది ప్రాణం ఉనికి లోనికి రావడానికి సంబంధించింది, ఒక మితి. అయిన లేదా తయారయిన ౹ సృష్టి లక్ష్యంలో భాగంగా తన పూర్తి స్థాయితో లేదా తన పూర్తి స్థూల స్థాయితో పనిచేయగలగడానికి సంబంధించింది రెండవ మితి. కాకపోతే, ఈ రెండవ మితి అప్పటికి కేవలం మూల స్థాయి విషయంగా మాత్రమే చెప్పుకోనవుతుంది. అప్పటి శూన్య/ మూల స్థితుల/ స్థాయిల విషయాన్ని ప్రస్తుత కాలానికి అన్వయించుకుని -అంటే మూల ప్రాణం స్థూలం తీసుకుని యోగానికి, యోగ ప్రక్రియలకు లోనవుతోంది అనే విషయాన్ని ఆధారం చేసుకుని- ప్రస్తుతానికి చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే నన్ స్థాయిల ప్రక్రియలతో మూల ప్రాణం స్వయంగా తయారయి (తయారు చేసుకుని కాదు అని తెలియనగును), 11, 12, 13 శూన్య స్థితులు అయిన వేకెంట్, వాయిడ్, నిహిల్ సంబంధమైన ప్రక్రియలతో పంపకపు మూల సూత్రాలతో సృష్టి మానవులు అందరికీ పంపకం ద్వారా సృష్టి స్థాయి సృష్టి లక్ష్య సిద్ధిని మరియు యోగ లక్ష్య సిద్ధిని సాకారం చేస్తుంది అని.

9) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

10) కాల సంబంధమైన మూల స్థాయిల విషయాలు అర్థం కావడం అనే దానిని ప్రక్కన పెట్టి, వాటిని చదవడం కూడ దుస్సాధ్యమే అని తెలియనగును.
Post Reply