1) "మరల ప్రయత్నించినపుడు దానికి 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది. ఈ ౦ 100 కి పెరగదు, ఒక క్వార్టరు కొరవడితో 60 కి మాత్రమే పనిచేస్తుంది అని బరువు వలన ఈ ౹ కి అలా అర్థమయింది. అది 100 ను కనబరిచి ఉంటే అది 360⁰ కు బదులు 400⁰ ను గుర్తుపెట్టనయేది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం కాల సంబంధమైనవిగా 15-12-1921 న చెప్పబడిన దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680-688 లకు) కొనసాగింపు అయినప్పటికీ, ఇది ప్రత్యేకించి దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.687 విషయం "యోగా రికార్డుల విషయాలు - గుణాన్ని చూపడానికి పరిమాణం అవసరం") లోని "౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని, ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న ౦ కోసమే అని అది నిశ్చయించుకుంటుంది" అనే దానికి మరియు దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.688 విషయం "యోగా రికార్డుల విషయాలు - ౹ కి 100 ను మించిన సామర్థ్యం" కి) కొనసాగింపు అని తెలియనగును.
3) మరల ప్రయత్నించినపుడు దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.686 విషయం "యోగా రికార్డుల విషయాలు - 100 అనే సామర్థ్యం కోసం ప్రయత్నించడం") లోని "౦ గా ఏర్పడిన ౹ 100 గా తయారయే క్రమంలో స్థిరంగా ఉంచుకుని 100 అనే/ యొక్క సామర్థ్యాన్ని చూపడానికి ౦ ను ప్రయత్నించింది" అనే దాని తరువాత ప్రయత్నించినపుడు.
4) దానికి 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది. దానికి. ౹ కి లేదా అంతిమ దశల ప్రక్రియల పరంగా ౦ అనే పూర్తి స్థాయికి చేరుకున్న లేదా పనిచేయడానికి తయారయిన ౹ కి. 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది. 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది అని అన్నపుడు, ౦ అనే/ యొక్క పూర్తి స్థాయికి మరియు ౹ చేరుకున్న పూర్తి స్థాయికి మధ్యన ఉన్న అంతరాన్ని లేదా విడివిడి ఉనికిల అంతరాన్ని గుర్తించడం, గుర్తించి ముందుకు సాగడం అవసరం. ఎందుకు అంటే మూల స్థాయిలలో ప్రతి కదలికకు/ మార్పుకు ఒక ప్రత్యేక ఉనికి ఉంటుంది అనేది ఇంతకు ముందు చెప్పుకోబడిన విషయమే గనుక. 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు అని అన్నపుడు, ఇంతవరకు చెప్పుకున్న విషయాలు అన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనికి సంబంధించినవే అయినప్పటికీ, అవి ప్రక్రియలు మాత్రమే అని, ప్రస్తుతం చెప్పుకోబడుతున్నది వర్కింగు సంబంధం అని గ్రహించనగును. తెలియవచ్చింది. ౹ కి 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది.
5) ఈ ౦ 100 కు పెరగదు, ఒక కొరవడితో 60 కి మాత్రమే పనిచేస్తుంది అని బరువు వలన ఈ ౹ కి అలా అర్థమయింది. 15-12-1921 న "సెకనుల గ్రేడు" అనే విషయంతో (ప్రశ్న, సమాధానం నెం.680 విషయం "యోగా రికార్డుల విషయాలు - సెకనుల గ్రేడు" తో) మొదలయిన విషయాలు అన్నీ కాల సంబంధంగా చెప్పినట్లు అనిపించినా, అవి సమస్తం శూన్య స్థితుల ప్రక్రియలలో మూల ప్రాణం సంబంధంగా జరిగి, వాటి సూత్ర బద్ధమైన లోతులు శూన్య స్థాయిల సంబంధంగా కాలానికి అన్వయించబడి లేదా కాలంలో ప్రతిబింబించబడి మాత్రమే చెప్పబడ్డాయి అని, అవి వస్తుతః మూల ప్రాణానికి సంబంధించినవి మాత్రమే అని నిశ్చయంగా స్పష్టంగా తెలియనగును. ఈ ౦ 100 కు పెరగదు. పూర్తి స్థాయిది అయిన 100 కు పెరగదు, ఒక క్వార్టరు కొరవడితో 60 కి మాత్రమే పనిచేస్తుంది. నిల్ నుండి ౹ ఏర్పడడంలో లేదా ఉనికి లోనికి రావడంలో జరిగిన శూన్య స్థాయిల/ స్థితుల ప్రక్రియలు యథాతథంగా ౹ నుంచి బయటపడని లేదా క్రిందికి దిగి రాని కారణంగా, లోతుల విషయం ఏమిటి అంటే 60 గ్రేడు/ పెరుగుదల/ సామర్థ్యం మాత్రమే పనిచేసింది అని, అదే కాల సంబంధంగా చెప్పుకోబడిన విషయాలలో ప్రతిబింబించింది అని, అదే ఇక్కడి "ఒక క్వార్టరు కొరవడితో 60 కి మాత్రమే పనిచేస్తుంది" అనే మాటలలో వెల్లడించబడింది అని. కాకపోతే, ఆ విషయం ౹ కి సంబంధించిందే అయినప్పటికీ, ౹ కి కూడ అది ఇప్పుడు మాత్రమే -అంటే ౹ లో లేదా మూల ప్రాణంలో సంకల్పం బయటపడి, సంకల్పం నెరవేరడానికి సృష్టి ఆరంభమై, అందులో భాగంగా కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల తరువాత మూల ప్రాణంలో కలిగిన భావన ఫలితంగా యోగం ఆరంభమై, యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల అనంతరం వాటిలో భాగంగా మూల ప్రాణం యొక్క మూల స్థూలం తయారయి, మూల ప్రాణం క్రియాశీలమై, అంతిమ దశల ప్రక్రియలలో భాగంగా మూల ప్రాణానికి కాల సంబంధంగా మూల స్థాయి విషయాలు- తెలియవస్తోంది అని తెలియనగును. అదే దీని తదుపరి వాక్య భాగంలో చెప్పబడుతోంది. బరువు వలన ఈ ౹ కి అలా అర్థమయింది. ఇక్కడ ప్రత్యేకించి గమనించదగిన విషయం ఏమిటి అంటే గుణం లేదా గుణం క్వార్టరు మరియు పరిమాణం లేదా పరిమాణం క్వార్టరు లలో ఏమాత్రం తెలియబడనిది అయిన బరువు లేదా బరువు క్వార్టరు వలన లేదా అది పూర్తయిన తరువాత మాత్రమే ౹ కి లేదా మూల ప్రాణానికి అలా అర్థమయింది అని. సృష్టికి ఏమాత్రం అందని, అందరాని, అందవలసిన అవసరం లేని విధాన పరమైన విషయం, యోగ పరంగా మాత్రమే చెప్పుకోనయిన విషయం ఏమిటి అంటే జరిగే ఏ సంఘటనకు అయినా జరిగింది ఏమిటి, ఎలా జరిగింది అనే వాటికి కాక, ఎందుకు అనే దానికి సంబందించిన విషయం యొక్క లోతులకు వెళ్ళగలిగిన పరిస్థితి ఉత్పన్నమయితే (ఇది అంత తేలిక కాదు అని, మేథస్సుకు, మేథో పటిమకు సంబంధించిన విషయం అసలే కాదు అని, బుద్ధి తన స్వంత స్థాయితో పనిచేయగలిగినపుడు మాత్రమే ఇది సాధ్యం అని తెలియనగును), సగం లేదా రెండు పావుల లోతులకు వెళ్ళిన తరువాత మాత్రమే చూచాయగా, అస్పష్టంగా తెలియడం ఆరంభమై, మూడు పావులు లేదా 75 శాతం లోతులకు వెళ్ళిన తరువాత మాత్రమే విషయంగా తెలియవచ్చే అవకాశం అని.
6) అది 100 ను కనబరిచి ఉంటే అది 360⁰ కి బదులు 400⁰ గుర్తుపెట్టనయేది. కావడానికి అది పూర్తి స్థాయి 100 లేదా ౦ అయినప్పటికీ, వర్కింగు సంబంధంగా 60 ని మాత్రమే చూపగలిగింది. అలా కాక అది 100 ను కనబరిచి ఉంటే అది 360⁰ కి బదులు 400⁰ ను గుర్తుపెట్టనయేది అనేది విషయం. యాథాలాపంగా లేదా సూత్ర ప్రాయంగా మాత్రమే ఈ విషయం చెప్పుకోబడింది అని సమంజసంగా చెప్పుకోనవుతుంది. సూత్ర ప్రాయంగా ఎందుకు అంటే అది జరిగి ఉండలేదు గనుక, సృష్టి లక్ష్య సంబంధంగా మరియు 100 గ్రేడును సంతరించుకోవలసిన అవసరంలో భాగంగా, 360⁰ అనేవి 400⁰ కు రావలసి ఉంటుంది అని సమంజసంగా చెప్పుకోనవుతుంది గనుక. దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.680) లో చెప్పిన 360 డిగ్రీలే ఇక్కడ చెప్పబడింది అనేది తెలియబడుతున్న విషయమే. అంటే ఒక్కొక్క పావు 100 డిగ్రీలు కావలసింది 90 డిగ్రీలు మాత్రమే అయింది అనేది విషయం. యోగ విషయాలు బయటపడడంలో కూడ ఈ 90 సూత్రం వర్తించి ఉంది అని చెప్పుకోనగును. ఎలా అంటే ధనిష్ఠ నామం లోని "టెంత్ రొటేషన్ వర్కింగ్ వండర్స్", అంటే పదియవ రొటేషనులో లేదా ఆవర్తనంలో తెలియబడనయే విధంగా అద్భుతాలు జరుగుతాయి అని. అంటే పది సంవత్సరాలు ఒక రొటేషను చొప్పున 9 రొటేషన్లు పూర్తయిన లేదా 90 సంవత్సరాలు పూర్తయిన తరువాత పదియవ రొటేషనులో లేదా 2000 వ సంవత్సరం తరువాత వగైరా అనేది విషయం.
7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
8) యోగ విషయాల లోతులు సృష్టి స్థాయిలను మించినవిగా ఉన్నాయి అని చూచాయగా అయినా తెలియనయితే విశేషమే అని తెలియనగును.
సమాధానం నెం.689 - ప్రశ్న నెం.689 (4-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౦ 100 కి పెరగదు".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm