సమాధానం నెం.108 - ప్రశ్న నెం.108 (30-11-2021) విషయం "విగ్రహారాధన, ఈ యోగం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.108 - ప్రశ్న నెం.108 (30-11-2021) విషయం "విగ్రహారాధన, ఈ యోగం".

Post by Katakam »

1) ఈ యోగంలో విగ్రహారాధన యొక్క పాత్ర ఏమిటి?

2) ముందుగా విగ్రహారాధనకు క్లుప్తంగా వివరణ. దేముళ్ళకు గుళ్ళలో మాదిరిగా కావచ్చు, మనిషి రూపంగా కావచ్చు, కాగితం మీద రంగుల కలయికతో వేసిన ఫోటో కావచ్చు, బాహ్యంలో ఉన్న పై వాటి మాదిరిగా కాక మానసికంలో ముద్రించుకున్న రూపం కావచ్చు, ఏవయినా విగ్రహారాధనకు ప్రతిరూపాలే, సూక్ష్మంగా మనసులో గానీ లేదా స్థూలంగా కనుపించేలా బాహ్యంలో గానీ.

3) సాధారణంగా జరిగే పూజలు పునస్కారాలకే చోటు లేని ఈ యోగంలో స్థూలంగా గానీ, సూక్ష్మంగా గానీ ఆరాధించబడే విగ్రహాలకు, విగ్రహారాధనకు ఎలాంటి స్థానం లేదు, పాత్ర లేదు.

4) ఈ యోగంలో విగ్రహారాధన లేకపోవడానికి కారణాలు ఏమిటి?

5) కారణాలు అని యాథాలాపంగా చెప్పుకున్నప్పటికీ, ఉన్న కారణం ఒక్కటే. తనలోనే దివ్యత్వం ఉంది అనే విషయాన్ని గుర్తించడానికి వీలు లేకుండా చేయబడిన మనిషికి తన మీద తనకు ఆధ్యాత్మికంగా నమ్మకం ఉండడం అనేది అసంభవం అయిన కారణంగా మరియు నమ్మకం అనేది మానవ జీవన జీవితాలకు అవసరమైన ఏకైక ప్రాతిపదిక అయిన కారణంగా, దానిని తనకు బయట వెతుక్కోవడానికి బాసటగా నిలిచిందే విగ్రహారాధన. విగ్రహారాధనలో నమ్మకమే ప్రాతిపదిక, ఏ విగ్రహం, ఎవరి విగ్రహం అనే దానితో సంబంధం లేకుండా.

6) తనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించడానికి, ఆ దివ్యత్వానికి అనుగుణంగా జీవన జీవితాలు గడవడానికి బాహ్యం నుండి, బాహ్యోన్ముఖత్వం నుండి ఆంతరికానికి‌, అంతర్ముఖత్వానికి మళ్ళడమే లేదా తెలియని దానిని, కనపడని దానిని నమ్మవలసిన అవసరాన్ని మించి తెలిసిన వాటిలో, తెలియబడుతున్న వాటిలో, కనుపించిన వాటిలో, కనపడుతున్న వాటిలో నమ్మకం అంతర్లీనం కావడమే యోగ క్రియలకు, యోగ ప్రక్రియలకు, యోగ ప్రయోగాలకు సంబంధించిన యోగ లక్ష్యం అనే మాటకు అర్థంగా ఒక మితి.

7) విగ్రహారాధన చేసేవారు యోగానికి అనర్హులా?

8) ఇక్కడ కొంచెం వివరంగా చెప్పుకోవలసిన అవసరం. సృష్టి లక్ష్య సిద్ధిలో పాలు పంచుకోవడానికి ప్రాథమిక అర్హత మానవ రూపం అనే విషయాన్ని ఇక్కడ మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. సృష్టి లక్ష్యమే యోగ లక్ష్యం కూడ. కాకపోతే, సృష్టి లక్ష్యం ఏమిటి అనేది విషయంగా మాత్రమే చెప్పుకోనవుతుంది. దానిలో భాగంగా సృష్టి లక్ష్యం అయిన మానవ స్థాయి పదం మోక్షం అనే దానికి చెప్పబడిన విరుద్ధ అర్థాన్ని సవ్యమైన రీతిలో తెలియబడేలా చేయడంతో పాటు, సృష్టి లక్ష్యాన్ని ఆచరణ సాధ్యం చేయడమే యోగ లక్ష్యం. యోగ లక్ష్య సిద్ధికి ప్రాథమిక అర్హత కూడ మానవ రూపమే. సృష్టి లక్ష్యానికి ప్రాథమిక అర్హత మానవ రూపమే అనే వాస్తవాన్ని తెలియచేయడం కూడ యోగ ప్రక్రియలలో భాగమే.

9) యోగ లక్ష్య సిద్ధికి ప్రాథమిక అర్హత మానవ రూపం. కానీ, యోగ క్రియలకు, యోగ ప్రక్రియలకు, యోగ ప్రయోగాలకు ఆలవాలమైన యోగా ప్రాక్టీసుకు అర్హత కలిగి ఉంది వస్తుతః సృష్టి లక్ష్యంతో -మోక్షం అనే మాటకు చెప్పబడిన అర్థంతో సంబంధం లేకుండా- (గత జన్మల పరంగా) సంబంధం కలిగి ఉన్నవారు (మాస్టరు గారి కాలం నాటి మీడియములు మరియు ప్రస్తుతపు ఈ యోగం లోని యోగ సాధకులు) మాత్రమే.

10) ఈ క్రమంలో విగ్రహారాధన అనేది ఆధ్యాత్మిక మార్గం లోని ఒక క్రింది స్థాయి పరిస్థితి మాత్రమే అనేది ఈ సందర్భంగా తెలియవలసిన అవసరం. మాస్టరు గారి డైరీలో ఈ యోగం యొక్క గొప్పతనం తెలియడానికి అన్నట్లుగా మీడియములకు 14-11-1912 న వేసిన ఏడు ప్రశ్నలో నాలుగవది "భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" మరియు అయిదవది "భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్య ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి" అనేవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ అంశానికి సంబంధించినవే.

11) గత జన్మలకు సంబంధించిన ప్రభావాల ఫలితమైన జీవనం -ఇదే భౌతిక జీవనం- యొక్క లోతులకు వెళ్ళగలిగితే మాత్రమే తెలియదగినది ఆ ప్రభావాల వెనుక ఉన్న గతం -ఇదే ఆధ్యాత్మిక జీవితం-. విగ్రహారాధన జీవనంలో భాగం మాత్రమే, దాని తదుపరి స్థాయిలకు దారి తీయగలిగిన ఒక క్రింది స్థాయి. భౌతిక జీవనంలో భాగమైన విగ్రహారాధన ఈ యోగానికి అనర్హత కానేకాదు.
Post Reply