సమాధానం నెం.110 - ప్రశ్న నెం.110 (4-12-2021) విషయం "నమస్కారం చేసుకోవడం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.110 - ప్రశ్న నెం.110 (4-12-2021) విషయం "నమస్కారం చేసుకోవడం".

Post by Katakam »

1) ఇది శ్రీ వేలమూరి లక్ష్మీనరసింహ మూర్తి గారు, నరసరావుపేట అనే ఒక యోగ మిత్రుడు తెలుగులో వేసిన ప్రశ్నకు సమాధానం.

2) ప్రశ్న భాగం - ప్రాక్టీస్ కు ముందు నమస్కారం చేసుకుని అని చెబుతూ ఉంటారు.

3) 'నమస్కారం చేసుకోవడం' అనేది సాధారణ జీవన స్రవంతి లోని పూజలు, వ్రతాలు, క్రతువుల‌లో అనాదిగా వస్తూ ఉన్నటువంటిదే. కానీ, దాని లోతుల అర్థం ఏమిటి అనేది ఎన్నడూ ఎవరి చేత కూడ పరిగణనలోకి తీసుకోబడలేదు. దానిని సృష్టి లక్ష్య సంబంధమైన ఆధ్యాత్మిక (ఆది, ఆత్మ ఏకతకు సంబంధించిన) సాధనలో అర్థవంతమైన లోతుల ఒక ప్రక్రియగా ఇమిడ్చింది మాత్రం ఈ యోగా ప్రాక్టీసులో మాత్రమే.

4) ఈ నమస్కారం చేసుకోవడం ఎవరికి? సెల్ఫ్ మాస్టరుకేనా?

5) ఈ నమస్కారం చేసుకోవడం ఎవరికి అనే దాని కంటె ముందుగా తెలియవలసిన విషయం ఏమిటి అంటే మాస్టరు యోగ సాహిత్యం మొత్తంలో ఎక్కడా 'సెల్ఫ్ మాస్టరు' అనే పదజాలం కనుపించదు. అంతేకాదు, మాస్టరు అనే మాట యోగా రికార్డులలో తరచుగా వాడబడినా, ఆ మాటకు అర్థం ఎక్కడా ఇవ్వబడలేదు/ చెప్పబడలేదు. ఈ నేపథ్యంలో, యోగ సాహిత్యంలో లేని ఒక పదజాలానికి అర్థం ఆ పదజాలాన్ని ఉపయోగించేవారు ఆ పదజాలాన్ని సృష్టించిన వారి నుండియే కదా తెలుసుకోవలసింది.

6) ఈ సందర్భంగా, మాస్టరు గారి డైరీలలో 10-12-1912 న వ్రాయబడి ఉన్న."ఈ లైను గురించిన పూర్తి జ్ఞానం మీకు లేనపుడు, దీని లోని మాటలకు యోచనలకు అర్థాలు, ప్రకటిత భావాలు తెలియకుండా కేవలం కొన్ని కొన్ని మాటలకు అర్థాలు తెలిసినంత మాత్రం చేత నిరర్థకంగా మీరు వాదించకూడదు. నేను చెప్పింది తప్ప వాటికి వేరే అర్థం ఏమీ ఉండదు. ఈ లైనులో నాకు నా అభిప్రాయం మాత్రమే కావాలి. మీ అభిప్రాయం నాకు అక్కర్లేదు" అనే విషయం పరిగణనార్హం. ఎలా అంటే, యోగ సాహిత్యంలో లేని ఒక మాటను కల్పించడంలో ఆ కల్పించిన వారి అభిప్రాయం మాత్రమే ఉంటుంది తప్ప, అది యోగ సంబంధం అయ్యే అవకాశం ఉండదు.

7) ఇపుడిక ఆ నమస్కారం ఎవరికి అనే దాని గురించి. నమస్కారం చేసుకోవడం అంటే వేరే ఎవరికో కాక ఎవరికి వారు చేసుకోవడం అనే కదా. అంటే తన నేనుకు తాను చేసుకునేది అనే కదా. అంటే ఒకరి నేను తన నేనుకు చేసుకునేది అని. ఆ రెండు నేనులు ఒకటి కాదు అనేది ఎంతయినా స్పష్టం. చేసే నేనుకు, చేయబడే నేనుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుస్పష్టంగా తెలియగలగడం ప్రాథమిక అవసరం. మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న వ్రాయబడిన యోగ లక్ష్యపు ఒక మితి అయిన " 'ఏకం' ఆ 'ఏకం' ను చూడాలి" అనేది పరోక్షంగా, అర్థమయితే ప్రత్యక్షంగా, 'నమస్కారం చేసుకోవడం' అనే దాని లోతుల గుంభనమైన ఈ యోగా ప్రాక్టీసు సంబంధిత అర్థానికి అనుబంధమై ఉంది అని తెలుస్తుంది.

8) అదే CVV గారికి అయితే, నమస్కారము చేసి అని ఉండేవారు కదా?

9) కూర్చుని, కళ్ళు మూసుకుని, నమస్కారం చేసుకుని, మాస్టరు నామం తలుచుకుని, వగైరా అని యోగా ప్రాక్టీసు సంబంధంగా పాటించే క్రమంలో 'నమస్కారం చేసుకుని' అనే దానికి వివరణ చెప్పుకున్న మీదట, C.V.V. గారికి అయితే నమస్కారం చేసి అని ఉండేవారు కదా' అనే విషయానికి చోటే లేదు. 'మాస్టరు నామం తలుచుకుని' అనే దానిలో భాగంగా ప్రస్తుతం చేయబడుతున్న మాస్టరు నామం అయిన 'మాస్టరు సీవీవీ నమస్కారం' లో మాస్టరు గారికి నమస్కారం లేదని, మాస్టరు/ ప్రాక్టీసు నామం అయిన 'మాస్టర్ సీవీవీ' లేదా 'సీవీవీ' లేదా 'మాస్టర్ సీవీవీ నమస్కారం' లో మాస్టరు గారికి సంబంధించని విధంగా ఒక గొప్ప సూత్రం ఇమిడి ఉందని, అది ఏకంగా యోగ లక్ష్యాన్ని ప్రతిబింబించే యోగా ప్రాక్టీసు ప్రక్రియకు సంబంధించి ఉందని తెలియనగును.
Post Reply