1) ఈ త్రిమూర్తులకు, ఈ యోగానికి సంబంధం ఏమిటి?
2) ఈ త్రిమూర్తులకు, ఈ యోగానికి వస్తుతః సంబంధం లేదు. సృష్టికర్త చేత చేయబడిన సృష్టిలో జీవుల సృష్టిని బ్రహ్మ, జీవుల పోషణను విష్ణువు, జీవుల లయాన్ని శివుడు నిర్వహించే సృష్టి స్థాయి శక్తి పుంజాలుగా సృష్టి మాధ్యమంగానే తప్ప, ఈ త్రిమూర్తులకు, ఈ యోగానికి ఎలాంటి సంబంధం లేదు.
3) మాస్టరు గారి డైరీలలో యోగ పరంగా వీళ్ళ ప్రసక్తి కూడదని, వీళ్ళ గురించి చర్చించరాదని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి?
4) ముందుగా, ఈ త్రిమూర్తుల గురించి మాస్టరు గారి డైరీలలో 14-11-1912 న లిఖించబడి ఉన్న విషయం - "ఈ నూతన విధానంలో బ్రహ్మ, శివుడు, విష్ణువు లకు ఎలాంటి సంబంధాన్ని కలిగించకూడదు. ఈ త్రిమూర్తుల గురించి చర్చించడం గానీ లేదా వాళ్ళతో పోలిక తేవడం గానీ చేసే ఎవరయినా శాశ్వతంగా బహిష్కరించబడతారు". సృష్టికి సంబంధించిన స్థాయిలుగా ఈ త్రిమూర్తుల గురించి అంత నిర్మొహమాటంగా, కటువుగా నిబంధన ఎందుకు విధించబడింది అనేదే ప్రస్తుతం తెలియవలసిన విషయం.
5) సృష్టికి సంబంధించి సృష్టి, స్థితి, లయం లను నిర్వహించే అత్యున్నత స్థాయిలుగా సృష్టికి పరిచయం చేయబడి, దేముళ్ళుగా చెలామణి చేయించబడిన ఈ త్రిమూర్తులకు సంబంధించిన లోతుల విషయం ఏమిటి అంటే ఈ త్రిమూర్తులు నిర్వహణ వహించే సృష్టి, స్థితి, లయం అనేవి కేవలం జీవులకు సంబంధించినవి -అంటే జీవుల సృష్టి, జీవుల పోషణ, జీవుల లయం లకు సంబంధించినవి- మాత్రమే, సృష్టికర్త అయిన ఆదిశక్తి చేసిన సృష్టికి ఎకాయెకి సంబంధించినవి కావు, కానే కావు. సృష్టి నిర్వహణ బాధ్యత అప్పగించబడి, అసలు ఆదిశక్తి స్థానంలో నకిలీ ఆదిశక్తిగా తనను సృష్టికి చెలామణి చేయించుకున్న సృష్టి నిర్వహణ స్థాయికి క్రింది స్థాయిలు ఈ త్రిమూర్తులు.
6) ఈ యోగం అనేది ప్రస్తుత సృష్టి విధానాన్ని నూతన సృష్టి విధానంగా ఆవిష్కరింపచేయడానికి ఆరంభించబడింది. అంటే విధాన పరంగా సృష్టిని నూతనం చేయడానికి అని కదా. సృష్టిని చేసిన సృష్టికర్తకు కూడ విధానంతో సంబంధం లేదు. ఈ త్రిమూర్తులకు కూడ జీవుల సంబంధంగానే తప్ప, ఏకంగా సృష్టితో సంబంధం లేదు. ఏకంగా సృష్టి తోనే సంబంధం ఉన్నది ఈ యోగ విధానం. ఆరంభమైన సృష్టికి అంతం లేకుండా పోవడమే/ ఉండడమే సృష్టి జీవి మనిషికి అమృతత్వం సిద్ధించడం అనే దానికి సమాంతరంగా సృష్టి వెనుక ఉన్న లక్ష్యం.
7) ఈ నేపథ్యంలో, సృష్టి చేయబడిన మనిషి మరణించవలసిన అవసరం లేని అమృతత్వాన్ని పొందడం అంటే జీవుల సృష్టి అనేది క్రమేణా అవసరం లేని ప్రక్రియ అవుతుంది. అలాగే, జీవుల లయం కూడ ఉండకూడని ప్రక్రియయే అవుతుంది. ఉండడం లేదా శాశ్వతంగా ఉండడం అనే ఒక్కటి మాత్రమే అవసరమైన ప్రక్రియ అవుతుంది.
8) ఇంకొక మితిలో విషయం ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు సృష్టి స్థాయి శక్తి పుంజాలుగా కాక, కేవలం దేముళ్ళుగా మాత్రమే లేదా మానవ మేథస్సు చేత సృష్టించబడిన దేముళ్ళుగా, దేముళ్ళ అంశంలో భాగంగా మాత్రమే చిత్రీకరించబడ్డారు. వాళ్ళ గురించిన ప్రస్తావన గానీ, ఎలాంటి పోలిక గానీ యోగ సంబంధమైన విషయాల లోతులు తెలియడానికి కేవలం ఆటంకంగా మాత్రమే పరిణమిస్తుంది. అందుచేతనే, కటువైన నిర్మొహమాటపు నిబంధన.
9) యోగ లక్ష్యం అయిన నూతన సృష్టి విధానంలో ఈ ముగ్గురి పాత్ర ఏమిటి?
10) ఇది కేవలం విధాన పరంగా భవిష్య సంబంధమైన విషయం గనుక, దాని గురించి ప్రస్తుతం తెలుసుకోవలసిన అవసరం లేదు అనేది ప్రస్తుతానికి సమాధానం.
సమాధానం నెం.114 - ప్రశ్న నెం.114 (12-12-2021) విషయం "బ్రహ్మ, విష్ణువు, శివుడు".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm