సమాధానం నెం.115 - ప్రశ్న నెం.115 (14-12-2021) విషయం "ఒలిడియరు 3 నామం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.115 - ప్రశ్న నెం.115 (14-12-2021) విషయం "ఒలిడియరు 3 నామం".

Post by Katakam »

1) ఒలిడియరు 3 నామం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

2) సాధారణంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే మాస్టరు గారి కాలంలో 10-4-1921 న మొదలుపెట్టి ఒలిడియరు రెగ్యులేషనును ప్రత్యేక నామం లేకుండా మాస్టరు నామం తోనే 7-8-1921 వరకు ప్రాక్టీసు చేయడం, దానినే న్యూ రెగ్యులేషను అనే పేరుతో చేస్తుండగా, 10-8-1921 న ఒలిడియరు పిట్యూటరీ 1వ నామం రావడం, ఆ క్రమంలో 17-8-1921 న 3వ నామం వచ్చినపుడు దానిని ఒలిడియరు అండ్ పిట్యూటరీ రెగ్యులేషను నామంగా ఉదహరించడం, ఆ తరువాత ఆ 3వ నామాన్ని ఉదయం సాయంత్రం రోజువారీ ప్రాక్టీసుగా మాస్టరు గారి డైరీల చివరి రోజు అయిన 30-4-1922 వరకు రోజూ చేస్తూ ఉండడం, ఈ మధ్యలో 5-1-1922 న "ఊరి లోని మీడియములకు సూచన" గా "రేపు ఉదయం 6 గంటల ప్రాక్టీసుతో మొదలుపెట్టి, మళ్ళీ చెప్పే వరకు ఒలిడియరు 3వ నామాన్ని చేయాలి" అని ఒక సూచన రావడం, సహజంగానే అప్పటి మీడియముల ద్వారా ఆ విషయం ప్రచారం కావడం జరిగింది. అలా ఉదయం సాయంత్రం చేసే రోజువారీ ప్రాక్టీసు (దీనినే ప్రస్తుతం వాడుకలో జనరల్ ప్రేయరు అనీ, సరయిన మాటగా జనరల్ ప్రాక్టీసు అనీ పేర్కొనడం జరుగుతోంది) సంబంధంగా ఒలిడియరు 3 నామం ప్రాముఖ్యత సంతరించుకుంది.

3) ఒలిడియరు 3 నామం జనరల్ ప్రాక్టీసులో భాగమా?

4) జనరల్ ప్రాక్టీసు అంటే ఉదయం, సాయంత్రం 6 గంటలకు చేసే రోజువారీ ప్రాక్టీసు అనే కదా.

5) 30-11-1920 న మాస్టరు గారి డైరీలలో "ఇకమీదట మీడియములకు పంచే ప్రాక్టీసు ఏమీ లేదు. కానీ, ట్రూత్ మోషను (= వాస్తవం యొక్క చలనం) బాహ్యంలో ప్రకటితం అయ్యేవరకు వాళ్ళు రోజూ మాస్టరు నామాన్ని ఉదయం సాయంత్రం ప్రాక్టీసు చేయాలి" అని చెప్పబడింది.

6) 10-4-1921 న ఒలిడియరు రెగ్యులేషను మాస్టరు నామంతో చేయడం ఆరంభమై, 8-8-1921 న న్యూ రెగ్యులేషనుగా పేర్కొనబడి, 10-8-1921 న ఒలిడియరు రెగ్యులేషను 1వ నామం రావడం, 17-8-1921 న ఒలిడియరు అండ్ పిట్యూటరీ రెగ్యులేషను 3వ నామం (దీనినే ఒలిడియరు 3 నామంగా వ్యవహరించడం జరుగుతోంది) రావడం, 17-8-1921 నుండి 30-4-1922 వరకు ఉదయం సాయంత్రం రోజూ ప్రాక్టీసు చేయబడిన ఒలిడియరు 3 నామం గురించి మాస్టరు గారి డైరీల రికార్డును చూస్తే, పరిశీలించితే, తెలియవస్తున్న విషయం ఏమిటి అంటే ఒలిడియరు 3 నామం మాస్టరు నామానికి అదనంగా -అంటే జనరల్ ప్రాక్టీసుగా చేసే మాస్టరు నామానికి జోడించబడి- కాక, మాస్టరు నామానికి బదులుగా -అంటే ఒలిడియరు 3 నామమే జనరల్ ప్రాక్టీసు నామంగా- చేయబడింది అని, 5-1-1922 న ఒలిడియరు 3 నామం ప్రాక్టీసు గురించి ఇవ్వబడిన సూచన 30-11-1920 న మాస్టరు నామం ప్రాక్టీసు గురించి ఇవ్వబడిన సూచనకు ప్రత్యామ్నాయంగా ఇవ్వబడింది అని.

7) దీని ప్రకారం, ఒలిడియరు 3 నామం జనరల్ ప్రాక్టీసులో భాగం కాదనీ, ఒలిడియరు 3 నామాన్ని ప్రాక్టీసు చేయడమే రోజూ ఉదయం సాయంత్రం చేసే జనరల్ ప్రాక్టీసు అనీ తెలియవస్తోంది. కానీ, ఇది యోగంలో క్రొత్తగా చేరే వారికి వర్తించదు అని తెలియనగును. ఎందుకు అంటే ఇకమీదట పంచే ప్రాక్టీసు ఏమీ లేదు, ఉదయం సాయంత్రం రోజూ మాస్టరు నామం చేయాలి అని 30-11-1920 న వచ్చిన సూచనకు కొనసాగింపుగా అత్యంత శక్తివంతమైన ప్రాక్టీసు నామంగా ఒలిడియరు 3 నామం వచ్చిందనీ, అందుచేతనే 17-8-1921 నుండి డైరీల రికార్డు చివరి 30-4-1922 వరకు ఒలిడియరు 3 నామమే రోజూ ఉదయం, సాయంత్రం జనరల్ ప్రాక్టీసు నామంగా చేయబడిందనీ, 5-1-1922 న వచ్చిన సూచన పరోక్షంగా దీనినే నిర్ధారిస్తుందనీ తెలియవస్తున్న విషయం.

8) కాదు అనడానికి ఆధారం ఏమిటి?

9) మాస్టరు గారి డైరీలలో "ఉ.6- ఒలిడియరు & పిట్యూటరీ రెగ్యులేషను 3వ నామం, సా.6- అదే" అని17-8-1921 నుండి 30-4-1922 వరకు చేసిన ప్రాక్టీసు గురించి ఉన్న రికార్డే దీనికి ఆధారం.

10) ఒలిడియరు 3 నామానికి జనరల్ ప్రాక్టీసుగా చేయబడేటంత ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలియాలి అంటే ఒలిడియరు 3 నామం లోని పదాలకు యోగ పరమైన మూల స్థాయి అర్థాలు, స్థూల దేహ వ్యవస్థలో సూక్ష్మంగా సూక్ష్మాతిసూక్ష్మంగా జరిగే మూల స్థాయి ప్రక్రియలు అవగాహనకు రావడం తప్పనిసరి అవసరం.
Post Reply