సమాధానం నెం.117 - ప్రశ్న నెం.117 (18-12-2021) విషయం "ఇనిషియేషను నామం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.117 - ప్రశ్న నెం.117 (18-12-2021) విషయం "ఇనిషియేషను నామం".

Post by Katakam »

1) ఇనిషియేషను నామం అంటే ఏమిటి?

2) ఒక వ్యక్తి ఈ యోగంలో చేరే సమయంలో రోజువారీ ప్రాక్టీసు కోసం అతనికి ఇవ్వబడే నామమే ఇనిషియేషను నామం. మాస్టరు గారి కాలంలో ఇనిషియేషను ఇవ్వడం అనేది కేవలం మాస్టరు గారు మాత్రమే చేసేవారు గనుక, ఇనిషియేషను (యోగ ప్రవేశం) చేయబడే వ్యక్తికి మాస్టరు గారు ఆ వ్యక్తి రోజువారీ ప్రాక్టీసు కోసం ఇచ్చే నామమే ఇనిషియేషను నామం. అంటే ముక్తసరిగా ఇనిషియేషను (యోగ ప్రవేశం) కోసం ఇచ్చే నామమే ఇనిషియేషను నామం. దీనినే మాస్టరు నామం అనీ, ప్రాక్టీసు నామం అని మాస్టరు గారి డైరీలలో వ్యవహరించడం జరిగింది.

3)మాస్టరు గారి కాలంలో ఇవ్వబడిన ఇనిషియేషను నామం/ నామాలు ఏమిటి?

4) సర్వ సాధారణంగా మాస్టరు నామమే ఇనిషియేషను నామంగా తీసుకోవడం జరిగింది. కాకపోతే, ఆ మాస్టరు నామం ఏమిటి అనేది గుచ్చి గుచ్చి చూసి తెలుసుకోవలసిన అవసరం. ఇనిషియేషను ఇచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే మాస్టరు నామం వ్యక్తపరచబడింది తప్ప, ప్రాక్టీసు రికార్డులో ఎక్కడా 'మాస్టరు నామం' అని మాత్రమే వ్యవహరించబడింది.

5) అలా మాస్టరు గారి డైరీలలో మాస్టరు నామం వ్యక్తపరచబడిన కొన్ని సందర్భాలు : 'మాస్టర్స్ యం.టీ.ఏ. అండ్ సీ.వీ.వీ' - 11-1-191౩, 'సీ.వీ.వీ.' - 24-1-1913, 'మాస్టర్ సీ.వీ.వీ.' - 25-5-1913. సీ.ఆర్. కు ఇవ్వబడిన నామం: 'యం.టీ.ఏ.' (M.T.a ) - (కె. కోర్సు IV 24-4-1911).

6) వీటి పరంగా గమనించదగిన విషయం ఏమిటి అంటే వ్రాయబడిన ఇనిషియేషను నామాలలో చివర 'నమస్కారం' అనే మాట లేకపోవడం.

7) ప్రస్తుతం యోగ సాధక సమాజంలో 'మాస్టర్ సీ.వీ.వీ. నమస్కారం' అనేది వస్తుతః చేయబడుతున్న మాస్టరు/ ప్రాక్టీసు నామం, అంటే రోజువారీగా ఉదయం సాయంత్రం చేయబడే జనరల్ ప్రాక్టీసు నామం.

8) కారణాలు ఏవి అయినప్పటికీ, యోగా ప్రాక్టీసు చేసే యోగ కేంద్రాలలో మాస్టరు/ ప్రాక్టీసు నామం సంబంధంగా ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు చోటు చేసుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటి తీరు ఎలా ఉందీ అంటే ప్రస్తుతం చేయబడుతున్న ప్రాక్టీసు మాస్టరు యోగ సంబంధమా, మాస్టరు గారి యోగ సంబంధమా, ఆ తీరుకు కారణమైన ఆ వ్యక్తి సంబంధమా అని అనుమానం కలిగేటంత. ఇంకా లోతులకు వెళ్లి చెప్పుకోవాలి అంటే జరిగేది అసలు యోగ ప్రాక్టీసేనా అని పైకి చెప్పలేని/ చెప్పుకోలేని విధంగా అనుమానం కలిగేటంత.

9) ప్రస్తుతం వాటికి భిన్నంగా జరిగే వాటి వలన నష్టం ఏమయినా ఉంటుందా?

10) రాజ ప్రాసాదానికి వెళ్ళడానికి అందుబాటులో ఉన్న రాజ మార్గాన్ని తెలిసి గానీ, తెలియకుండా గానీ వదిలివేసి, వేరే మార్గాలను తెలిసి గానీ తెలియకుండా గానీ ఎంచుకోవడం లాంటిదే ఈ ప్రశ్నకు సమాధానం. యోగా ప్రాక్టీసు చేయడం వలన జరుగుతున్న వాటిని అవి యోగా ప్రాక్టీసు చేయడం వలన జరుగుతున్నవిగా గుర్తించడం మాత్రమే కాక, ఆ జరిగే వాటి లోతులను కూడ యోగ పరంగా తెలుసుకోగలిగినపుడు మాత్రమే భిన్నంగా చేయడం వలన కలిగే నష్టాన్ని గుర్తించడం సాధ్యపడుతుంది. కానీ, ఆ నష్టం అనేది ఎలాంటి గుర్తించబడదగిన డెవలప్మెంటు లేకపోవడమే అని గుర్తించవలసిన అవసరం.
Post Reply