1) ఈ ఏడు ప్రశ్నల ఆంతర్యం ఏమిటి?
2) మాస్టరు గారి డైరీలలో 14-11-1912 న "మీడియముల గురించి" చెపుతూ, కొన్ని అంశాలను వివరిస్తూ, వాటిలో భాగంగా "తంజావూరు జిల్లా మీడియములు అందరూ ఈ యోగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి" అని చెప్పి, "ముఖ్యంగా దృష్టి పెట్టవలసినవి" గా మీడియములకు ఏడు ప్రశ్నలను వేయడం జరిగింది. వాటిని పరికిస్తే, ఈ యోగం గురించి, ఈ యోగం యొక్క గొప్పతనం గురించి -అంటే గత జన్మల గొప్ప సాధనల ఫలితమైన జ్ఞానానికి, అనుభవానికి భిన్నంగా యోగం గురించి, యోగం యొక్క గొప్పతనం గురించి- తగినంత అవగాహన కలుగుతుంది అనేది ఈ ప్రశ్నల ఆంతర్యంగా తెలియనగును.
3) అలాగే, 9-12-1912 న ఒక కోర్సు నామం చేయబోయినపుడు, కొంత చర్చ జరిగి, కోర్సు ఆపివేయబడి, "14-11-1912 న వాళ్ళకు ఇవ్వబడిన 7 ప్రశ్నలను పరికించమని మీడియములకు చెప్పబడింది" అనే విషయం కూడ దీనినే బలపరుస్తుంది.
4) "ఈ యోగా ప్రాక్టీసు దేని కోసం ఉద్దేశించబడిందో మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి" అనే 1వ ప్రశ్నకు వివరణ ఏమిటి?
5) ఈ ప్రశ్న అర్థం కానంత క్లిష్టం కాదు. కానీ, దానిలో 'నిశ్చయంగా' అనే మాటకు సంబంధించిన లోతులు తెలియడం ఎంతయినా అవసరం. నిశ్చయం అనేది నిర్ణయం అనే స్థాయి కంటె లోతయినది, నిశ్చయం జరిగితేనే అది నిర్ణయంగా వచ్చే అవకాశం. అంటే ఆ ఉద్దేశ్యం ఏదయితే ఉందో, అది కేవలం విషయంగా తెలియడం మాత్రమే కాక, దాని లోతులు కూడ ఎలాంటి అనుమానానికి తావు ఇవ్వనంత ఖచ్చితంగా అర్థం కావలసిన అవసరం.
6) అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి వెనుక ఉన్న కారణాలు కూడ విశ్లేషణ చేయబడవలసిన అవసరం. ఏమిటి అంటే ఏదయినా ఒక విషయం మొట్టమొదట సూత్రప్రాయంగా బయటపడినపుడు, అదేదో గొప్పగా ఉంది అని మాత్రమే తోచడం జరుగుతుంది తప్ప, దాని గురించిన లోతులు తెలియడం కేవలం అసంభవం. అది ఎలా ప్రాక్టీసు చెయ్యాలి అని తెలియడం కూడ క్రొత్తగా ఉండడం సహజమే కదా. తెలిసిన విషయాన్ని లోతులకు వెళ్లి తెలుసుకోవడం, చేస్తున్న ప్రాక్టీసుకు సంబంధించి సున్నితమైన, సునిశితమైన విషయాలు బయటపడడం ప్రక్రియ పరమైన క్రమం. దాని దృష్ట్యా, అప్పటి వరకు తెలిసిన వాటికి భిన్నంగా ఉన్న ఈ యోగ ప్రాక్టీసు ఉద్దేశ్యం తెలియడం కూడ కష్టమైన విషయమే. ఎందుకు అంటే ఉన్న జ్ఞానానికి, అనుభవానికి భిన్నమైనది, అతీతమైనది లోపలికి చొరబడడానికి ఆ ఉన్న జ్ఞాన అనుభవాలే అడ్డుపడతాయి గనుక.
7) ఈ నేపథ్యంలో, మీడియముల ఆలోచనలు యోగ విధానానికి భిన్నమైన రీతిలో వెళుతున్నాయి గనుక, వాళ్ళు యోగా ప్రాక్టీసును తమ స్థూల అవసరాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు గనుక, ఈ యోగా ప్రాక్టీసు దేని కోసం ఉద్దేశించబడిందో వాళ్ళు నిశ్చయంగా తెలుసుకోవాలి అని చెప్పబడింది, అదే ప్రశ్నగా వేయబడింది.
8) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ ప్రశ్న యొక్క ప్రాధాన్యత ఏమిటి?
9) ఏదయినా ఒక పని చేస్తున్నపుడు, అది ఎందుకు చేస్తున్నదీ తెలియకుండా ఆ పని చేయడం వలన జరిగినది, జరిగేది ఏదీ తెలిసే అవకాశం లేదు, దాని వలన ప్రయోజనం పొందడం కూడ ఏమీ ఉండదు. ప్రస్తుత సృష్టి విధానపు తీరుకు పూర్తిగా భిన్నమైన ఈ యోగం గురించి, ఈ యోగ విధానం గురించి ఏ కొంచెం తెలియాలి అన్నా, ఈ యోగా ప్రాక్టీసు దేని కోసం ఉద్దేశించబడిందో తెలియడం ప్రాథమిక అవసరం. అది ఈ ప్రశ్నలో ఇమిడి ఉన్న అర్థం, దాని ప్రాధాన్యత కూడ.
10) ఈ ప్రశ్న అప్పటి మీడియములకు వేయబడి ఉన్నప్పటికీ, యోగ సాధక సమాజం లోని ప్రతి ఒక్కరికీ ఇది సంబంధించి ఉంది.
సమాధానం నెం.118 - ప్రశ్న నెం118 (20-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 1వ ప్రశ్న".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm