1) 7 ప్రశ్నల లోని 3వ ప్రశ్నకు, °భౌతిక మార్గంలో మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" అనే 4వ ప్రశ్నకు సంబంధం ఏమిటి?
2) కొనసాగుతున్న ప్రశ్నల వరవడి -అంటే ముందరి ప్రశ్నకు తదుపరి ప్రశ్న సమాధానం కావడం అనే వరవడి- ఇక్కడ కూడ ఉంది అని ముందుగా చెప్పుకోవలసిన అవసరం. అంటే "ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీకు తెలియాలి" అనే 3వ ప్రశ్నకు "భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" అనే ఈ 4వ ప్రశ్నయే సమాధానం అని. అంటే ఈ భూమి మీద ఎందుకు జన్మించిందీ తెలియాలి అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎలా మెలగాలో నిశ్చయించుకోవాలి అని. 3వ ప్రశ్నకు 4వ ప్రశ్న సమాధానం అవుతుంది అని చెప్పుకున్న మీదట, అది ఎలా అవుతుంది అనేదే ఇప్పుడు చెప్పుకోబడ వలసిన, చెప్పుకోబడబోయే విషయం.
3) 4వ ప్రశ్నకు వివరణ ఏమిటి?
4) దీని ముందరి ప్రశ్నలో విషయంగా చెప్పుకున్న దాని ప్రకారం, ముందుగా ఈ ప్రశ్నకు సమాధానంగా వివరణ కాక, యథాతథంగా ప్రశ్నకే వివరణ, అంటే 'భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో నిశ్చయించుకోవాలి' అనే దానికి వివరణ.
5) ఇందులో గమనించదగిన మొదటి విషయం ఏమిటి అంటే మొదటి మూడు ప్రశ్నలలో 'తెలుసుకోవాలి/ తెలియాలి' అని ఉంటే, ఈ ప్రశ్నలో 'నిశ్చయించుకోవాలి' అని ఉండడం. భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో నిశ్చయించుకోవడం అంటే అలా మెలగడం కంటె ముందుగా జరగవలసిన ప్రక్రియ అనే కదా. ఇక్కడ ఒక విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవలసింది ఏమిటి అంటే వ్యక్తి యొక్క ఆరంభ జన్మకు సంక్రమించిన సృష్టి కర్మ భాగానికి అనుగుణంగా మాత్రమే ఆ వ్యక్తి చేసే క్రియలు, వాటి ఫలితంగా వ్యక్తిగత కర్మ సంపాదన ఉంటాయి అనేది. ఇపుడు 'నిశ్చయించుకోవాలి' అని తెలిసిన మీదట, నిశ్చయించుకోవాలి అని భావన చేసుకున్న దృష్ట్యా, తెలియని లోతులలో దానికి సంబంధించిన విధంగా ప్రక్రియ జరిగి, అలా మెలగడం క్రమేణా దేహ వ్యవస్థకు అలవాటు అవుతుంది.
6) అలా 'నిశ్చయించుకోవడం' అనే ప్రక్రియకు అనుగుణంగా భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మెలగడం జరుగుతుంది.
7) ఇపుడిక భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో అనే మాటలకు సంబంధించి. భౌతిక మార్గం అనేది జీవన క్రియాక్రమం నడవడానికి ఉండే తీరు, ఇది కేవలం జీవనానికి సంబంధించింది, జీవించి ఉండడానికి చేసే భౌతిక క్రియాకలాపాలకు మాత్రమే సంబంధించింది. 'మాత్రమే' అని అనడం ఎందుకు జరుగుతోంది అంటే జీవనం గడవడం అనే దానిలో విలువల ప్రాధాన్యత అనేది రెండవ ప్రాథమ్యం మాత్రమే గనుక. అదే ఆధ్యాత్మిక మార్గంలో మెలగడం అనే దానిలో జీవన క్రియాకలాపాలకు సంబంధించి విలువల ప్రాధాన్యత అనేది ప్రథమ ప్రాథమ్యం అవుతుంది.
8) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ 4వ ప్రశ్న యొక్క ప్రాధాన్యత ఏమిటి?
9) ఈ 4వ ప్రశ్నను యథాతథంగా మరొక్కసారి గుర్తు చేసుకోవాలి "భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" అని. నిశ్చయించుకోవడం అనేది స్థూల స్థాయి ప్రక్రియ కాదు, స్థూల స్థాయిలో భావన చేసుకున్న దృష్ట్యా ఆత్మిక స్థాయిలలో మొదటిది అయిన నిర్వాణిక్ స్థాయికి మాత్రమే సంబంధించింది. ఏ స్వతంత్రత యోగ లక్ష్యంగా చెప్పబడిందో, ఆ స్వతంత్రత వస్తుతః నిర్వాణిక్ స్థాయికి సంబంధించి ఉంది అని చెప్పుకోనయిన మీదట, ఇంతవరకు సృష్టిలో పనిచేయని, సృష్టికి తెలియని, యోగ పరంగా పని చేయవలసిన అవసరం ఉన్న నిర్వాణిక్ లెవెలు క్రియాశీలం కావడానికి సంబంధించి ఉండడమే భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి అనే ఈ 4వ ప్రశ్న. ఇదే సృష్టి లక్ష్యంలో, ముఖ్యంగా యోగా ప్రాక్టీసు చేస్తూ తెలుసుకోవాలి అనే కుతూహలం పనిచేసే ప్రతి యోగ సాధక సమాజ సభ్యులకు అందరికీ వర్తించే విధంగా, ఈ 4వ ప్రశ్న యొక్క ప్రాధాన్యత.
సమాధానం నెం.121 - ప్రశ్న నెం.121 (26-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 4వ ప్రశ్న".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm