1) 7 ప్రశ్నల లోని 5వ ప్రశ్నకు, " 'మనం' ను నిశితంగా పరిశీలిస్తే, మనకూ సృష్టికర్తకూ మధ్య ఉన్న తేడా స్థిరపడుతుంది. ఆ 'మనం' లో ఉన్నది ఒకటే. 'మనం' పైన ఉన్నది ఒకటే. రెండిటి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియబడాలి" అనే 6వ ప్రశ్నకు సంబంధం ఏమిటి?
2) ప్రశ్ధల వరవడి -అంటే ప్రస్తుత ప్రశ్న దాని ముందరి ప్రశ్నకు సమాధానం కావడం అనే వరవడి- ఇక్కడ కూడ చూడనవుతుంది. కాకపోతే, ఆ వరవడి పరంగా సమాధానం ఎలా అవుతుంది అనే కొనసాగింపుకు సంబంధించిన విషయంలో మాత్రం తేడా ఉంటుంది, తేడా గురించి కాదు, తేడాగా ఉండే సంబంధం గురించి. అంటే "భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్య ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి" అనే 5వ ప్రశ్నకు ఈ 6వ ప్రశ్న సమాధానం కావడం గురించి. అంటే భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ తేడా తెలియాలి అంటే 6వ ప్రశ్నలో ఉన్న విషయం లేదా ప్రశ్నించబడిన విషయం తెలియాలి అని.
3) స్థూల జీవనం లోతులలో విడదీయ రానంతగా కలిసి పోయిన భౌతిక రంగాన్ని, ఆధ్యాత్మిక రంగాన్ని విడదీసి విడివిడిగా చూడగలగడం జరగాలి అంటే మనం ను నిశితంగా పరిశీలించి, మనకూ సృష్టికర్తకూ మధ్య తేడా స్థిరంగా తెలిసిన దృష్ట్యా, 'మనం' లో ఉన్న ఒకటికి, 'మనం' పైన ఒకటికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియబడాలి. ఇదీ విషయం.
4) ఈ 6వ ప్రశ్నకు వివరణ ఏమిటి?
5) నేను, నీవు, మేము, మీరు, మనం అనే క్రమాన్ని పాటించి వ్యక్తి సమూహంగా
తీసుకున్న పిమ్మట, దానిని ఇంకా విస్తృతం చేసి, సృష్టి మానవులను అందరినీ భాగంగా తీసుకుంటేనే, ఈ సందర్భానికి చెప్పుకున్న 'మనం' అవుతుంది. అంటే సృష్టి చేయబడిన సమస్త మానవులను 'మనం' గా తీసుకోగలిగితే, సృష్టి మానవులుగా మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఆ 'మనం' కు భిన్నంగా గుర్తించనవుతుంది. ఆ గుర్తింపు దృఢతరం అయిన పిమ్మట మాత్రమే తెలియదగిన విషయం ఏమిటి అంటే సృష్టించబడిన 'మనం' లో ఉన్నది ఒకటి -అంటే ఎవరికి వారికి వ్యక్తిగత ఉనికిగా, వ్యక్తిగత ఏకంగా ఉన్నది ఒకటి- అని, ఆ 'మనం' లోని ఒకటికి భిన్నంగా ఆ 'మనం' కు పైన ఉన్నది -అంటే సృష్టి చేసిన సృష్టికర్తగా, సృష్టికి కర్తగా, సృష్టికర్తయే- ఒకటి అని చూచాయగా మాత్రమే తెలియనయే అవకాశం.
6) 'మనం' లోపల ఉన్న ఒకటి, 'మనం' కు పైన ఉన్న ఒకటి గురించి మరింత లోతులకు వెళితే, వెళ్ళగలిగితే, వెళ్ళగలిగిన స్థాయి డెవలప్ అయితే, 'మనం' లోపల ఉన్న ఒకటికి, 'మనం' పైన ఉన్న ఒకటికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియనవుతుంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే అందుకు సాధనం ఈ విషయాలు బయటపడడానికి పనిచేసిన గమనికయే, యోగా ప్రాక్టీసును యోగా ప్రాక్టీసుగా మాత్రమే -అంటే గత జన్మల గొప్ప సాధనల ఫలితంగా అనుభూతులుగా అందుబాటులోకి వచ్చి, అద్భుతాలుగా అనిపించే కర్మ సంబంధ ప్రభావాలకు లోబడకుండా- చేయడం వలన స్థాయిల వారీగా డెవలప్ అవుతూ పోయే గమనికయే.
7) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ 6వ ప్రశ్న యొక్క ప్రాధాన్యత ఏమిటి?
8) ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాను అని జబ్బలు చరుచుకుని విర్రవీగే వైజ్ఞానిక, ఆధ్యాత్మిక జ్ఞానం, అనుభవం యొక్క ప్రభావానికి పూర్తిగా దాసోహమై మేథో మత్తులో మునిగిపోయిన మనిషికి, మానవతకి ఈ 6వ ప్రశ్న యొక్క లోతులు చెంప ఛెళ్ళుమనిపించి, మత్తు వదిలించి నిద్ర నుండి మేల్కొలిపే రక్షక మార్గదర్శకాలు, మార్గనిర్దేశకాలు.
సమాధానం నెం.123 - ప్రశ్న నెం.123 (30-12-2021) విషయం °ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 6వ ప్రశ్న".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm