సమాధానం నెం.129 - ప్రశ్న నెం.129 (11-1-2022) విషయం "స్థూల తలం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.129 - ప్రశ్న నెం.129 (11-1-2022) విషయం "స్థూల తలం".

Post by Katakam »

1) స్థూల తలం అంటే ఏమిటి?

2) మానవ శరీరంలో సాంప్రదాయ ఆధ్యాత్మికత పరంగా 7 చక్రాలు మరియు యోగ పరంగా ఏడు తలాలు ఉన్నాయి అని దీని ముందరి సమాధానంలో చెప్పుకున్న మీదట, యోగ పరమైన స్థూల తలం గురించిన వివరణ. అక్షర మూలాల స్థాయి నుండి అర్థం చెప్పుకుంటే, స్థూలం అంటే నిలిచి ఉండడానికి (లేదా శాశ్వతంగా ఉండడానికి) అనువైన ఉనికిగా‌ ఆరంభమైనది అని. దానికి సంబంధించిన తలమే స్థూల తలం. అడ్డ విభజనగా పైనుంచి క్రిందికి వస్తే, సాంప్రదాయంలో చెప్పుకునే మూలాధారమే స్థూల తలం.

3) స్థూలం అనే మాటకు అర్థం చెప్పుకున్న మీదట, మూలాధారం అనే మాటకు అర్థం చెప్పుకోవడం అనేది విషయం ఇంకా స్పష్టం కావడానికి అవసరం. స్థూల తలం యొక్క కేంద్ర స్థానం అయిన మూలాధారం మర్మాంగానికి, గుద స్థానానికి మధ్య ఉంది.

4) మూలాధారం అంటే మూలం అనే ఆధారమా లేదా మూలం యొక్క/ మూలానికి ఆధారమా అనేది చెప్పకోవలసిన అవసరం. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మూలానికి లేదా మూలం యొక్క ఆధారం అనీ (ఇది మాస్టరు గారి డైరీలో చెప్పబడిన మూలాధారంలో స్థితమై ఉన్న కుండలిని యొక్క బాహ్య కార్యక్రమానికి సంబంధించి ఉంది), మూలమే ఆధారం అని అన్నపుడు అది కుండలిని యొక్క ఆంతరిక కార్యక్రమానికి సంబంధించి ఉంది అనీ తెలియనగును.

5) స్థూల తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

6) ఇది ఒక రకంగా మూలాధార స్థితమై ఉన్న కుండలిని యొక్క ప్రాముఖ్యత గానే చెప్పుకోనవుతుంది. ఎలా అంటే మూలానికి లేదా ప్రాణానికి ఆధారంగా ప్రస్తుత సృష్టి విధానం ప్రకారం తల్లి గర్భంలో శుక్ల శ్రోణిత సంగమమైన బీజానికి శిశు రూప నిర్మాణం చేయడం, స్థూల శరీరం జీవించి ఉన్నంత కాలం సెకనుకు 10/ 5 లక్షల భ్రమణాలతో తన దాకా వచ్చే ప్రాణ వాయువును చిలుకుతూ వెనక్కి నెట్టడం (మాస్టరు యొక్క నోట్సు 30-8-1919), అలా చిలకడం ద్వారా దానిని ప్రాణ శక్తిగా మార్చడం అనే తన బాహ్య కార్యక్రమానికి భిన్నంగా, మూలమే ఆధారం అనే అర్థానికి అనుగుణంగా తన ఆంతరిక సూత్రాల (మాస్టరు గారి డైరీ 21-9-1916) కార్యక్రమంలో "గుప్త బహిస్తత్య" (మాస్టరు గారి డైరీ 17-7-1913) అని తనకు ఇవ్వబడిన ఆదేశానికి కొనసాగింపుగా జరిగే యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ప్రకారం దేహ పంజరాన్ని కుండలిని మలుస్తుంది.

7) స్థూల తలానికి, స్థూల శరీరానికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

8) స్థూల శరీరంలో ఉన్న మొత్తం ఏడు తలాలలో ఒక తలం స్థూల తలం. స్థూల శరీరం జీవించి ఉన్నంత కాలం దానికి సంబంధించిన కార్యక్రమాల సమస్తాన్ని ఆ జన్మకు సంబంధించిన ప్రారబ్ద కర్మ ప్రకారం నడిపించేది స్థూల తలం లేదా మూలాధారం అనబడే కుండలినియే. స్థూల శరీరం సదరు సమస్త కార్యక్రమాలకు కేవలం సాధనం మాత్రమే.

9) సృష్టి లక్ష్యంలో స్థూల తలం యొక్క పాత్ర ఏమిటి?

10) సృష్టి లక్ష్యం స్థూల శరీరానికి సంబంధించి ఉంది అని సుస్పష్టంగా చెప్పుకోబడిన విషయమే. అలాగే స్థూల తలం అంటే మూలాధార స్థితమైన కుండలిని అని చెప్పుకున్న మీదట, స్థూల తలం నిర్మాణ క్రమంలో చిట్టచివరిది, స్థూల శరీరం తయారు కావడం లేదా ఫిజికల్ ఎస్టాబ్లిష్ అనే సృష్టి లక్ష్యంలో ప్రథమ స్థానం స్థూల తలానిదే. అంటే ఇప్పటి వరకు తన బాహ్య కార్యక్రమానికి మాత్రమే పరిమితమైన మూలాధార కుండలిని యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ఫలితంగా ఆంతరిక కార్యక్రమానికి మళ్ళి, సృష్టి లక్ష్య సంబంధంగా, సృష్టి లక్ష్య సిద్ధిలో భాగంగా స్థూల దేహ నిర్మాణపు లోతులను నూతన సృష్టి విధానానికి అనుగుణంగా పునర్నమూనీకరించడం.
Post Reply