సమాధానం నెం.133 - ప్రశ్న నెం.133 (19-1-2022) విషయం "యాస్ట్రలు తలం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.133 - ప్రశ్న నెం.133 (19-1-2022) విషయం "యాస్ట్రలు తలం".

Post by Katakam »

1) యాస్ట్రలు తలం అంటే ఏమిటి?

2) సాధారణ వాడుకలో యాస్ట్రల్సు అంటే దెయ్యాలు లేదా ప్రేతాత్మలు అని పరిగణించడం కద్దు. కానీ, అది అత్యంత పరిమితమైన పాక్షిక వాస్తవం మాత్రమే. రాబోయే వివరణలలో అది తేటతెల్లం అవుతుంది.

3) యాస్ట్రల్ అనే ఆంగ్ల పదానికి ఆధారం యాస్టర్, అంటే నక్షత్రం. కనుక, యాస్ట్రల్ అంటే నక్షత్ర సంబంధమైన అనీ, యాస్ట్రలు తలం అంటే నక్షత్రక తలం అనీ చెప్పనగును. అంటే మానవ రూపం లోని మూడు అథో తలాలలో రెండవది అయిన యాస్ట్రలు తలం నక్షత్ర సంబంధమైనది అని.

4) యాస్ట్రలు తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

5) యాస్ట్రలు తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియాలి అంటే నక్షత్రక తలంగా పేర్కొనబడిన దాని నైజం గురించి, స్వభావం గురించి, వాటి దృష్ట్యా దాని కార్యక్రమం గురించి తెలియాలి. నక్షత్రం అంటే కుదింపయిన కాంతి యొక్క సంఘటిత రూపం, అంటే కాంతి పుంజపు రూపం. అది కంటికి కనుపించే తీరు ఐదు ముక్కోణాలతో బయటికి విరజిమ్మడం. అలా కనుపించే రూపాన్ని బట్టి దానిని నక్షత్రం అని పిలవడం జరిగింది.

6) కాంతి పుట్టుక మూల/ శూన్య స్థాయిలకు సంబంధించింది. ప్రాణం నుండి శక్తి విడిపడక ముందు సృష్టి చేయబడవలసిన అవసరానికి అనుగుణంగా బయటపడిన మూల వనరులలో మొట్టమొదటిది కాంతి. దాని లక్షణం ప్రభావం. దాని కార్యక్రమం ప్రస్తుతానికి ప్రభావితం చేయడం. ఎక్కడ ఏ కదలిక, ఏ చలనం ఉన్నా, అక్కడ ఆరంభానికి, అంత్యానికి -అంటే కదలిక/ చలనం యొక్క ఆరంభానికి, అంత్యానికి- మధ్య ప్రభావం అనే దాని ఉనికి ఆరంభమై, ప్రభావితం చేయడం అనే దాని ప్రస్తుత కార్యక్రమం క్రియాశీలం అవుతుంది.

7) దాని మూల స్థాయి ఉనికి సంబంధిత నేపథ్యంలో -అంటే సృష్టికి ముందే ఉనికి ఏర్పడి, సృష్టి లోనికి కాంతిగా చొరబడి, మానవ దేహ వ్యవస్థ నిర్మాణంలో యాస్ట్రలు తలంగా రూపొందిన నేపథ్యంలో- యాస్ట్రలు తలం యొక్క ప్రాముఖ్యత -అంటే ప్రస్తుతం ప్రభావితం చేయడం అనే కార్యక్రమం దృష్ట్యా ఆ ప్రాముఖ్యత- ఎంత అంటే ఏ ఇతర తలానికి లేని, ఏ ఇతర తలం యొక్క కార్యక్రమం కాని నైజంతో దేహ వ్యవస్థ లోని మొత్తం అన్ని తలాలను తన అధీనంలోకి తీసుకుంది, అన్ని తలాలకు తానే అధిష్ఠానంగా చెలామణి చేయించుకుంది. యాస్ట్రలు తలం అనే దానికి సాంప్రదాయ బద్ధమైన ఆధ్యాత్మిక సమాంతర పదం స్వాధిష్ఠానం అనే మాటలో కొట్టొచ్చినట్లు ద్యోతకం అయే అర్థం ఇదే. అంటే అసలు నేనుగా చెలామణి అయ్యే మానవ మేథస్సులో వస్తుతః పనిచేసేది యాస్ట్రలు తలమే. అదే స్వ + అధిష్ఠానం = స్వాధిష్ఠానం. అంటే తానే అధిష్టానం లేదా అధికారిక స్థాయి లేదా చెలాయించే స్థాయి.

8) యాస్ట్రలు తలానికి, మానసిక తలానికి మధ్య ఉన్న సామ్యం ఏమిటి, తేడా ఏమిటి?

9) ఆలోచనలు చేయడం అనేది మానసిక తలం యొక్క కార్యక్రమం. వాటికి పదును పెట్టేది ప్రభావితం చేయడం అనే తన కార్యక్రమంతో యాస్ట్రలు తలమే. యోగ పరంగా చెప్పుకోవాలి అంటే మానసిక తలం యాస్ట్రలు తలానికి వనరు, ఆహారం. మనిషికి సంబంధించిన మానసిక తలం అత్యంత బలీయం. ఆ సూక్ష్మ మానసిక తలాన్ని ఒక రకంగా శాసించేది యాస్ట్రలు తలమే. రెండూ సూక్ష్మ అథో తలాలు అనేది వాటి మధ్య సామ్యం అయితే, మానసిక తలం ఆహారం మరియు యాస్ట్రలు తలం దాని భోక్త అనేది వాటి మధ్య తేడా.

10) సృష్టి లక్ష్యంలో యాస్ట్రలు తలం యొక్క పాత్ర ఏమిటి?

11) సృష్టి లక్ష్యంలో యాస్ట్రలు తలం యొక్క పాత్ర గురించి క్లుప్తంగా చెప్పుకోగలిగింది ఏమిటి అంటే ఈ యోగం ఆరంభమై జరిగిన, జరుగుతున్న యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ఫలితంగా ప్రభావితం చేయడం అనే తన ప్రస్తుత బాహ్య కార్యక్రమం నుండి సృష్టి లక్ష్య ద్వితీయాంకపు కార్యక్రమంలో భాగంగా ప్రభావితం కావడం అనే ఆంతరిక కార్యక్రమానికి యాస్ట్రలు తలం మళ్ళడం.
Post Reply