సమాధానం నెం.134 - ప్రశ్న నెం.134 (21-1-2022) విషయం "మానసిక తలం"

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.134 - ప్రశ్న నెం.134 (21-1-2022) విషయం "మానసిక తలం"

Post by Katakam »

1) మానసిక తలం అంటే ఏమిటి?

2) మనిషి యొక్క దేహ వ్యవస్థలో ఉన్న ఏడు తలాలలోని మూడు అథో తలాలలో మూడవది మానసిక తలం. ఆలోచన చేసేది లేదా ఆలోచనల ప్రవాహమే మనసు. మానసిక తలం అంటే ఆలోచనలు లేదా భావనలు లేదా తలపులు గ్రహించబడే ప్రాంతం. ఆలోచనలు మెదడుతో లేదా బుర్రతో చేస్తాం కదా, మరి నాభి స్థానంలో ఉన్న మానసిక తలం యొక్క కేంద్రం సంగతి ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే రూప మానసికం మరియు అరూప మానసికం అనేవి అందబడే ప్రాంతం మానసిక తలం అయితే, తెలియబడుతూ గానీ లేదా తెలియబడకుండా గానీ అవి బయటికి నెట్టబడే స్థానం మెదడు. అంటే ఒక రకంగా రూప భావనలు, అరూప భావనలు నిల్వ అయే స్థానం మానసిక తలం, వాటి క్రియా స్థానం మెదడు.

3) మానసిక తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

4) మనిషి యొక్క జీవన జీవిత కార్యకలాపాలలో మనిషికి అందుతూ పనిచేసే త్రికరణాలలో -అంటే ఆలోచన, మాట, చేత లలో- పై స్థాయిది మానసిక తలం. ఆ అందడం అనేది మానసిక తలానికి రూప, అరూప భావనల లోని రూప భావనలలో అతి పరిమిత పరిమాణం మాత్రమే. మాస్టరు యొక్క నోట్సులో 28-3-1921 న చెప్పబడిన "ఒక డిగ్రీలో నిముషానికి 70,800 భావనలు పుట్టించబడతాయి, ఇది ప్రజ్ఞకు అందదు, కేవలం ఆంతరిక వర్కింగు కోసం మాత్రమే ఇవ్వబడుతుంది. బయటికి ఒక డిగ్రీలో గంటకు 800 మాత్రమే చూపబడతాయి, ఈ రేటు చొప్పున 24 గంటల లోను మానవ రూపానికి భావనలు అందించబడతాయి" అనే మాటలలో నిముషానికి పుట్టించబడే 70,800 భావనలు అరూప మానసికం అని, బయటికి చూపబడే గంటకు 800 భావనలు రూప మానసికం అని తెలియనగును. అంటే పుట్టించబడే నిముషానికి 70,800 భావనలలో ప్రజ్ఞకు (మనసుకు తెలిసేలా) అందేవి గంటకు 800 భావనలు మాత్రమే అని (అందులో స్థూల స్థాయికి తెలిసేలా గుర్తించబడేవి ఇంకా తక్కువే అని) తెలియనగును. మానసిక స్థాయికి లేదా మనసుకు అందనిది అరూప మానసికం, మానసిక స్థాయికి లేదా మనసుకు అందేది రూప మానసికం. మానసిక తలం యొక్క నిరంతరాయ ప్రక్రియయే మనిషి జీవనానికి, జీవితానికి ఆధారం.

5) మానసిక తలానికి, మేథస్సుకు సంబంధం ఏమిటి?

6) మానసిక తలానికి డైరెక్టుగా సంబంధం లేనిది మేథస్సు. కానీ, మేథస్సుకు మానసిక తలం యొక్క కార్యక్రమమే ఆహారం. క్రమబద్ధంగా లేని/ ఉండని ఆలోచనా స్రవంతిలో అప్పటి సందర్భానికి సంబంధించిన విషయాల సారాన్ని సమీకరించి, వాటిని హేతుబద్ధంగా, తార్కికంగా పరిగణనలోకి తీసుకుని, వాటి ఆధారంగా ఒక నిర్ణయాత్మక స్థితికి తీసుకువచ్చేదే లేదా తీసుకురావడమే మేథస్సు. దీనినే సాధారణ పదజాలంలో తెలివితేటలు అని పేర్కొనడం జరుగుతోంది.

7) సృష్టి లక్ష్యంలో మానసిక తలం యొక్క పాత్ర ఏమిటి?

8) అర్థం పూర్తిగా లోతుల నుండి చెప్పుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ, సాంప్రదాయ ఆధ్యాత్మికతలో కేవలం సూత్రప్రాయంగా మాత్రమే చెప్పిన 'మన ఏవ మోక్ష బంధన కారణాత్' అనే దానిని ఇక్కడ అన్వయించనవుతుంది. అంటే కేవలం మాటల అర్థంగా 'మనసే మోక్షానికి, బంధనానికి కారణం అయి ఉంది' అని. యోగ పరంగా కె. కోర్సులో సృష్టి లక్ష్యానికి, యోగ లక్ష్యానికి ఒక మితిగా చెప్పిన "ఏకంకు చేరుకోవడానికి మనసు సంస్కరించబడడం" అనే దానిలో గుంభనంగా కారణాలు మాత్రమే కాక, పరిష్కార మార్గాలు కూడ యోగా ప్రాక్టీసుకు అనుసంధానంగా వివరించబడ్డాయి.
Post Reply