సమాధానం నెం.153 - ప్రశ్న నెం.153 (28-2-2022) విషయం "సుషుప్తి అవస్థ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.153 - ప్రశ్న నెం.153 (28-2-2022) విషయం "సుషుప్తి అవస్థ".

Post by Katakam »

1) సుషుప్తి అవస్థ అంటే ఏమిటి?

2) సుషుప్తి అవస్థ అంటే నిద్రా స్థితి లోనే ఒక గాఢతమ స్థితి. అంటే నిద్రించే సమయంలో మామూలుగా ఉండే తెలిసేలా జరిగే శారీరిక కదలికల‌, మానసిక ఆలోచనల ప్రతిరూపమైన కలలు కూడ లేని గాఢమైన నిద్రా స్థితి. దానినే వాడుక పదంగా గాఢ నిద్ర అని అనడం జరుగుతోంది. అంటే ఆ గాఢ నిద్రా సమయంలో ఏమీ తెలియకుంటుంది, నిద్ర నుండి మేల్కొన్న తరువాత ఏమీ తెలియకుండా హాయిగా నిద్ర పట్టింది అని తెలియడం తప్ప. అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకోవాలి అంటే సుషుప్తి అంటే నిద్రా సమయంలో నిశ్చలంగా -అంటే నిద్రా సమయంలో మామూలుగా ఉండే మానసిక, యాస్ట్రలు ప్రభావాలు లేని- ఒక ఉనికితో కూడి ఉండిన స్థితి అని అర్థం. క్లుప్తంగా చెప్పుకుంటే, ఏమీ తెలియదు -అంటే జీవన/ జీవిత కార్యకలాపాలకు సంబంధించినవి ఏమీ తెలియదు- అనే ఒక ఉనికితో కూడి ఉండిన స్థితి.

3) సుషుప్తి అవస్థ దేనికి, అంటే ఏ స్థాయికి, సంబంధించింది?

4) స్థూల శరీరం నిద్రించే సమయంలో మాత్రమే ఈ సుషుప్తి అవస్థ వస్తుతః సంభవిస్తుంది గనుక, సుషుప్తి అవస్థ స్థూలానికి సంబంధించింది అని చెప్పుకోవడం ఒక రకంగా సమంజసమే. ఈ సుషుప్తి అవస్థ ఘటించేది కేవలం నిద్రించే సమయంలో మాత్రమే గనుక, నిద్రావస్థలో భాగంగా అది నిద్రావస్థకు కూడ సంబంధించింది అని చెప్పుకోవడం కూడ సమంజసమే. కానీ, నిద్రావస్థలో ఉండే మానసిక ఆలోచనల ప్రతిరూపమైన కలలు, వాటి సంబంధమైన యాస్ట్రలు ప్రభావాలు ఏవీ లేని స్థితి గనుక, సుషుప్తి అవస్థ ఇంకొక దేనికో సంబంధించింది అని చెప్పుకోవడం కూడ సమంజసమే. అదే ఇపుడు తెలుసుకోవలసిన విషయం.

5) సుషుప్తి అవస్థలో ఉన్నపుడు ఏమీ తెలియదు అని చెప్పుకున్న మీదట, దాని గురించిన లోతులు వివరంగా చెప్పుకోవడం కంటె ముందుగా ఆ సమయంలో జరుగుతూ ఉండేవి ఏమిటి అంటే జీవన/ జీవిత సంబంధమైన బాహ్య కార్యక్రమాలు జరగడం కాకుండా దేహ వ్యవస్థకు -అంటే శరీరం లోపలి స్థూల‌, సూక్ష్మ అవయవాలకు- సంబంధించిన కేవలం ఆంతరిక క్రియలు అని చెప్పుకోవలసిన అవసరం. ఇవి మానవ దేహ నిర్మాణ సంబంధంగా సృష్టి ప్రక్రియగా దేహ వ్యవస్థలో నిరంతరాయంగా జరుగుతూ ఉండే స్థూల శరీర భాగాల లోని సూక్ష్మ క్రియలు. ఇవి మనిషి యొక్క స్థూల ప్రమేయం గానీ, సూక్ష్మ ప్రమేయం గానీ లేకుండా జరుగుతూ ఉండే క్రియలు.

6) పైన చెప్పుకున్న జరుగుతూ ఉండే క్రియలు‌ జరిగేది స్థూలం లోనే అయినా, స్థూల‌ స్థాయికి గానీ, సూక్ష్మ స్థాయికి గానీ సంబంధించినవి కావు.

7) ఇక, ఏమీ తెలియదు అని పైన చెప్పుకున్న దాని గురించిన లోతులు. ఏమీ తెలియదు అన్నపుడు, ఏమీ లేదు అని గానీ లేదా ఏమీ జరగడం లేదు అని గానీ అనుకోవడానికి సుతరామూ వీల్లేని పరిస్థితి. కేవలం తెలియడం లేదు, అంతే. అంతేకాదు, తెలియనిది ఏదో ఉంది, తెలియకుండా జరుగుతున్నది ఏదో ఉంది అని తప్పనిసరిగా అనుకోవలసిన అవసరం. కాకపోతే, అలా అనుకోగలగడం అంత తేలికైన విషయం కాదు.

8) స్థూల, యాస్ట్రలు, మానసిక స్థాయిలకు/ తలాలకు సంబంధించకుండా ఏదో ఉంది, ఏదో జరుగుతోంది అన్నపుడు, దాని గురించి క్లుప్తంగా మాత్రమే చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఆ ఉన్నది, జరుగుతున్నది సృష్టి స్థాయిలకు అతీతమైనది అని, వ్యక్తి సంబంధంగా ఆత్మిక స్థాయిలకు సంబంధించింది అని.

9) సుషుప్తి అవస్థకు, సాంప్రదాయ ఆధ్యాత్మికతలో చెప్పబడే సమాధి స్థితికి సంబంధం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?

10) సంబంధం ఉంది. అది ఏమిటి అంటే తెలియనితనం, రెండిటి లోని సామ్యం. సుషుప్తి అవస్థ ప్రకృతి సిద్ధంగా జరిగేది. సమాధి స్థితి గొప్ప ఆధ్యాత్మిక సాధనల వలన కలిగేది. అంతే తేడా. ప్రయోజనం అనేది రెండిటి లోనూ ఒకటే, అదే ఏ ఉపయోగం లేకపోవడం, కేవలం ఇది అని చెప్పుకోలేని హాయి అనే ఒక గొప్ప అనుభూతి తప్ప.

11) యోగ పరంగా చెప్పుకుంటే, తెలియనితనం అనేది తెలియబడే స్థితికి రావాలి, తెలియనితనం అని కాక, తెలియబడి ఉన్నది అని. ఇది యోగ లక్ష్య సిద్ధికి దాని కొనసాగింపుగా మాత్రమే సంబంధించింది
Post Reply