1) చైతన్యం అంటే ఏమిటి?
2) చైతన్యం అనే మాటకు మామూలు వాడుక పదజాలంలో ఎరుక అని, కదలిక అని చెప్పుకోబడుతుంది. కానీ, దానికి అర్థం చెప్పవలసి వస్తే, తటపటాయించక తప్పని పరిస్థితి. చైతన్యం అనే మాట ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలలో వాడబడడం కనుపిస్తుంది. ఆధ్యాత్మికతను జోడించి చెప్పుకోవాలి అంటే గాఢ నిద్రావస్థ నుండి లేదా సమాధి స్థితి నుండి బయటికి వచ్చిన పిమ్మట, ఆ స్థితిలో ఉండగా ఏమీ తెలియలేదు అని దేనికి లేదా ఏ స్థాయి ఉనికికి తెలుస్తుందో అదే చైతన్యం లేదా ఎరుక. అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే, చైతన్యం అనే మాటకు కదలిక లేదా చలనం అనే మూల స్థాయి శక్తి సంబంధ ఉనికికి కేంద్రం అయి ఉన్నది అని అర్థం.
3) చైతన్యం దేనికి, లేదా ఏ స్థాయికి, సంబంధించింది?
4) చైతన్యం దేనికి, లేదా ఏ స్థాయికి సంబంధించింది అనే దానికి సమాధానం చెప్పుకోవడం కంటె ముందుగా, దానికి సంబంధించిన కొంత విషయం తెలియడం అవసరం. ఆధ్యాత్మిక విషయాలలో వస్తుతః ఎక్కువగా వాడబడే చైతన్యం అనే మాట అసలు స్థాయి బుద్ధి పనిచేయని బుద్ధి జీవి మనిషికి వస్తుతః సంబంధించింది. కానీ, మాటగా, మాటకు సంబంధించిన పైపై భావం గానే తప్ప, మనిషికి తెలిసేలా అందుబాటులో ఉన్న మనసు, మాట, చేత లాంటిది కాదు చైతన్యం. మనిషికి ఏమాత్రం అందుబాటులో లేనిది చైతన్యం. ఎందుకు అంటే చైతన్యం అనేది మనిషికి ఇంకా అందుబాటులోకి రాని బుద్ధిని మించిన స్థాయికి సంబంధించింది గనుక.
5) ఇపుడిక చైతన్యం ఏ స్థాయికి సంబంధించింది అనే దాని గురించి. క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, చైతన్యం మూల స్థాయికి సంబంధించింది, నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపర నిర్వాణిక్ అనే మూడు స్థాయిల కంటె పై స్థాయికి సంబంధించింది.
6) కొంత వివరంగా చెప్పుకోవాలి అంటే చైతన్యం ప్రాణ సంబంధం. ప్రాణం నుండి శక్తి విడిపడిన సందర్భానికి సంబంధించినదిగా ఏడవ శూన్య స్థితి సంబంధం. శూన్య/మూల స్థితులకు సంబంధించిన విషయం అయిన కారణంగా, ఇంతకు మించి అవసరం లేనిది.
7) చైతన్యానికి, సాంప్రదాయ ఆధ్యాత్మికతలో చెప్పబడే సమాధి స్థితికి సంబంధం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
8) సమాధి స్థితి నుండి బయటికి వచ్చిన పిమ్మట సమాధి స్థితిలో ఉండగా ఏమీ తెలియలేదు అని తెలియడంలో పనిచేసేదే చైతన్యం. కాకపోతే, మనిషిలో ప్రాణం ఉంది, ప్రాణం లేకుంటే మనిషి చనిపోతాడు అని మాత్రమే తప్ప, ప్రాణం గురించి ఏమాత్రం మనిషికి ఎలా అయితే తెలియదో, అదే మాదిరిగా చైతన్యం అనే మాట తప్ప, దాని స్వరూప స్వభావాలు కూడ మనిషికి ఏమాత్రం తెలియదు, తెలిసే అవకాశం కూడ లేదు. ఎందుకు అంటే అది తెలియబడేది కాదు, తెలుసుకునే స్థాయికి సంబంధించింది గనుక, సృష్టి సంబంధంగా తెలుసుకోవడం అనే స్థాయికి సంబంధించిన మేథస్సు కూడ పనిచేయలేని సమాధి స్థితిలో కూడ పనిచేసేది, పనిచేయగలిగింది గనుక.
9) చైతన్యానికి, సమాధి స్థితికి ఉన్న సంబంధం ఏమిటి అంటే సాంప్రదాయ ఆధ్యాత్మికతలో పొందదగిన అత్యున్నత స్థాయిగా పేర్కొనబడి, అమోఘమైన ఆధ్యాత్మిక సాధనల ఫలితంగా పొందదగిన స్థాయి అయి ఉండి, సదరు సాధకునికి ఏ విధంగానూ ఉపయోగం లేని గొప్పది సమాధి స్థితి అయితే, అలాంటి సమాధి స్థితిలో కూడ పనిచేసేది చైతన్యం. యాస్ట్రలు స్థాయికి సంబంధించింది సమాధి స్థితి. ఆత్మిక స్థాయిల కంటె అతీతమైనది చైతన్యం.
10) చైతన్యం, సమాధి స్థితి రెండిటి లోను ఉన్న ఒక లాంటి సామాన్య ధర్మం ఏమిటి అంటే సమాధి స్థితిని పొందడమే తప్ప, ఆ స్థితిలో జరిగే దాని గురించి గానీ, ఆ స్థితి గురించి గానీ ఏమీ తెలియని పరిస్థితి. అలాగే, చైతన్యం గురించి కూడ ఏమీ తెలియని పరిస్థితి. అంతే.
సమాధానం నెం.154 - ప్రశ్న నెం.154 (2-3-2022) విషయం "చైతన్యం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm