1) ప్రజ్ఞ అంటే ఏమిటి?
2) ప్రజ్ఞ అనే మాటకు సాధారణ వాడుకలో జ్ఞానం అనీ, ఏదయినా ప్రవృత్తి అంశానికి సంబంధించిన నైపుణ్యం ఉండడం అనీ చెప్పుకోబడుతోంది. సాంప్రదాయ ఆధ్యాత్మికతలో ప్రజ్ఞ అంటే ప్రత్యేకించిన జ్ఞానం -అంటే ఏదయినా అంశానికి సంబంధించి మామూలు సామాజిక మనిషికి అందుబాటులో లేని ఆధ్యాత్మిక జ్ఞాన విశేషం- అని చెప్పుకోబడుతోంది. అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే, ప్రజ్ఞ అంటే ఏకం ప్రతి -అంటే ఏకం వైపుకు సంబంధించిన- జ్ఞ అని చెప్పుకోనవుతుంది. జ్ఞ అంటే జ్ఞానం అనే దానికి మూల స్థాయి.
3) తెలియబడినది, తెలుసుకోబడినది అనే వాటికి జ్ఞానం అనే దానిని పర్యాయ పదంగా చెప్పుకోనయితే, తెలిసిఉండినతనం అనే స్థితియే జ్ఞ. ప్రస్తుత సృష్టి విధాన సంబంధ మానవ వ్యవహారాల గురించిన జ్ఞానానికి లేదా సమాచారానికి భిన్నంగా, ఏకం వైపు లేదా ఏకం పట్ల -అంటే వ్యక్తిగా తన ఉనికికి మూలం ఏమిటి అనే దాని పట్ల- జ్ఞను కలిగి ఉండడం అనేదే ప్రజ్ఞ. అసలైన ప్రజ్ఞను కలిగి ఉండడం అనేది మూల స్థాయి వాస్తవమే అయి ఉన్నప్పటికీ, ఆ తెలిసిఉండినతనాన్ని తెలిసి ఉండినదిగా తెలుసుకోవడం అనేదే వ్యక్తికి స్థూల ఉనికి రావడానికి సంబంధించి సృష్టి లక్ష్యంలో భాగంగా వ్యక్తి స్థాయి లక్ష్యం.
4) ప్రజ్ఞకు, చైతన్యానికి మధ్య సంబంధం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
5) ఉంది. ప్రజ్ఞ అనేది అక్షర మూలాల అసలైన అర్థంలో మూల స్థితికి సంబంధించి ఉంది. ఆ మూల స్థితి లేదా శూన్య స్థితి ఆరిజిన్ వన్ లేదా ప్రాణం లేదా మూలప్రాణం యొక్క లక్షణం, లక్షణ సంబంధం. చైతన్యం అనేది ప్రాణం నుండి శక్తి విడిపడే మూల స్థాయి సంబంధం.
6) సామాజిక, ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకోబడుతున్న ఇలాంటి కొన్ని పదాలు వాటి మూల అర్థాల పరంగా కొరుకుడు పడని విషయాలు. ఎందుకు అంటే అమోఘంగా పరిఢవిల్లిన మేథస్సు యొక్క పరిమితులకు ఇవి ఏమాత్రం లోబడినవి కావు లేదా ఏ కొంచెం కూడ అవగాహనకు రాజాలనివి, రాదగనంత అతీతమైనవి గనుక.
7) ప్రజ్ఞకు, జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
8) ప్రజ్ఞకు, జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం కేవలం మూల స్థాయిది. ఆ సంబంధాన్ని స్థూల, సామాజిక స్థాయిలకు అన్వయించి చెప్పుకోకూడనిది.
9) ప్రజ్ఞకు, జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం వస్తుతః జ్ఞకు సంబంధించింది. ప్రజ్ఞ, జ్ఞానం అనేవి వాటి అసలైన అర్థంలో వ్యక్తి యొక్క స్థూల, సూక్ష్మ స్థాయిలకు సంబంధించినవి కావు, వ్యక్తి స్థాయి మూలానికి/ ప్రాణానికి సంబంధించినవి, మూల/ ప్రాణ లక్షణమైన జ్ఞకు సంబంధించినవి, వ్యక్తిలో పనిచేసే సంబంధిత స్థాయిల ద్వారా మాత్రమే పనిచేసే మూల స్థాయిల సంబంధమైనవి. మాటగా సృష్టికి అంది, మాటగా వాడబడుతున్నప్పటికీ, వాటిది కేవలం మూల స్థాయియే.
10) ప్రస్తుత సృష్టి విధానంలో అసలైన అర్థంలో అంది ఉండని ప్రజ్ఞ అనేది మాస్టరు యోగం అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ యోగంలో జరిగిన యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ఫలితంగా స్థూల స్థాయిలో పనిచేయవలసిన అవసరం, వ్యక్తి మూలం గురించి ఎవరికి వారికి జ్ఞానం మూల స్థాయిలో వెల్లడి కావలసిన అవసరం.
సమాధానం నెం.155 - ప్రశ్న నెం.155 (4-3-2022) విషయం "ప్రజ్ఞ".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm