1) జ్ఞానం అంటే ఏమిటి?
2) జ్ఞానం అంటే మామూలు వాడుకలో తెలిసి ఉన్న లేదా తెలుసుకోబడి ఉన్న విషయాల సంపుటి. తెలిసి ఉన్న లేదా తెలుసుకోబడి ఉన్న అని అన్నపుడు, మనిషికి బాహ్య ప్రేరణ చేత లేదా బాహ్యంగా ఉండే పంచేంద్రియ గోచర విషయాల/ వస్తువుల ఇంద్రియ సంపర్కం చేత తెలియబడి ఉన్నది అని అర్థం. మరి ఆ జ్ఞానం వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఎందుకు ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే, తెలియడం/ తెలుసుకోవడం అనే ప్రక్రియను క్రియాశీలం చేసేది వ్యక్తి వ్యక్తికీ ఇంద్రియ గోచరత్వాన్ని మించి ఆంతరికంలో ఏదో ఉంది అనేది చూచాయగా, కానీ ఖచ్చితంగా, తెలియవచ్చే విషయం.
3) తెలియడం, తెలుసుకోవడం అనే దానికి సంబంధించి ఆంతరికంలో ఉన్నది వస్తుతః మూల స్థాయి జ్ఞ కు (అంటే తెలిసిఉండినతనానికి) సంబంధించింది. కానీ, ఆమూల స్థాయి జ్ఞ యథాతథంగా సృష్టి లోనికి, సృష్టిలో సర్వోత్కృష్ట జీవి అయిన మనిషి లోనికి దిగి వచ్చి ఉండలేదు. ఆ కారణంగా, లౌకిక స్థూల జీవన కార్యకలాపాలకు పరిమితమై, వాటికి సరిపోయే విధంగా బాహ్య ప్రేరణకు మాత్రమే లోనయే మేథస్సే జ్ఞానానికి ప్రేరణగా ఉంటోంది.
4) ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి అనే దానిని గుంభనమైన పదజాలం లోనే అయినా, అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకోవలసిన అవసరం. అది ఏమిటి అంటే - జ్ఞానం అంటే జ్ఞ యొక్క విస్తరణ అని. అంటే మనిషి ప్రారంభ జన్మకు రావడం కంటె ముందుగా ఏర్పడే ఆరంభ ఉనికికి, వ్యక్తి స్థాయికి పరిమితమై సంక్రమించే ఉనికి యొక్క లేదా ప్రాణం యొక్క లక్షణమే జ్ఞ. ఆ జ్ఞ యొక్క అసలైన స్థాయిదిగా కాక, సృష్టి సంబంధ స్థాయిలకు దిగి వచ్చినదిగా మేథస్సు యొక్క బహిర్ముఖ ప్రక్రియ సంబంధ ప్రేరణకు అనుగుణంగా కలిగేదే జ్ఞానంగా పరిగణించబడుతోంది. నిక్కచ్చిగా చెప్పుకోవాలి అంటే సేకరించబడిన సమాచార సంపుటియే జ్ఞానంగా భాసిల్లుతోంది.
5) జ్ఞానం దేనికి, అంటే ఏ స్థాయికి, సంబంధించింది?
6) జ్ఞానం దాని అసలైన అర్థంలో మూల స్థాయికి సంబంధించింది. జ్ఞానం అంటే జ్ఞ యొక్క విస్తరణయే అని చెప్పుకున్న మీదట, ఆ అసలైన జ్ఞానాన్ని సముపార్జించడమే వ్యక్తి ఉనికికి లక్ష్యం అయి ఉంది. ఆ జ్ఞానం బాహ్య ప్రేరణ వలన లేదా మేథస్సు యొక్క బహిర్ముఖ ప్రక్రియ వలన సాధ్యం అయ్యేది సుతరామూ కాదు, అంతర్ముఖ ప్రక్రియకు ఆలవాలమైన బుద్ధి ప్రక్రియ వలన మాత్రమే సాధ్యపడుతుంది. మూల స్థాయిది అయిన నిజమైన జ్ఞానం ఆత్మిక స్థాయిల కార్యక్రమాల ఫలితంగా బుద్ధిక్ స్థాయి ద్వారా మాత్రమే వెల్లడయే అవకాశం, గుర్తించబడే అవకాశం.
7) జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
8) జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అనేది మామూలుగా చెప్పుకోబడుతున్న విషయం. అంటే పైకి చెప్పుకోలేని, చెప్పుకోబడని భావంగా అజ్ఞానం అనేది జ్ఞానానికి కొనసాగింపు ప్రక్రియగా, జ్ఞానానికి తదుపరిదిగా తీసుకోబడుతున్న పరిస్థితి. కానీ, వాస్తవానికి జ్ఞానం కంటె ముందరి స్థితి అజ్ఞానం. జ్ఞానానికి ఒక రకంగా జ్ఞ మూలం అయితే, అజ్ఞానం అనేది జ్ఞానానికి మూలం అని కాక ముందరి స్థితిగా తీసుకోనవుతుంది. మూల/ శూన్య స్థితులకు సంబంధించిన జ్ఞానం, జ్ఞ అనేవి ఉనికి సహిత శూన్య స్థితుల సంబంధం అయితే, అజ్ఞానం అనేది ఉనికి రహిత శూన్య స్థితుల సంబంధం. అంటే ఉనికి సహిత శూన్య స్థితి అయిన ప్రాణ సంబంధం జ్ఞానం, జ్ఞ అనేవి. ప్రాణ ఉనికి కంటె ముందుగా ఉన్న ఉనికి రహిత శూన్య స్థితుల సంబంధం అజ్ఞానం.
సమాధానం నెం.156 - ప్రశ్న నెం.156 (6-3-2022) విషయం "జ్ఞానం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm