సమాధానం నెం.162 - ప్రశ్న నెం.162 (18-3-2022) విషయం "అరిషడ్వర్గాలు - కామం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.162 - ప్రశ్న నెం.162 (18-3-2022) విషయం "అరిషడ్వర్గాలు - కామం".

Post by Katakam »

1) అరిషడ్వర్గాలలోని కామం అంటే ఏమిటి?

2) కామం అంటే ఏమిటి అని తెలుసుకోవడం కంటె ముందుగా అరిషడ్వర్గాలు అనే మాటకు లోతుల అర్థాన్ని తెలుసుకోవలసిన అవసరం. అరి + షట్ + వర్గాలు, అరి లేదా శత్రువు అనే ఆరు వర్గాలు. అంటే శత్రువులు అయిన ఆరు వర్గాలు - కామం‌, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అని. ఆరు వర్గాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వర్గం చొప్పున ఆరు వర్గాలు అని. అంటే కామ వర్గం, క్రోధ వర్గం, వగైరా. అంటే కామం వగైరా అనే సమూహం, క్రోధం వగైరా అనే సమూహం, వగైరా. ఉదాహరణకు - కామ వర్గం అంటే కామం అనే ప్రధాన శత్రువు, దాని వర్గం అంటే దానికి సంబంధించిన, దానికి అనుగుణమైన వాటి సమూహం. ప్రతి వర్గానిదీ ఇదే తీరు. ఆరింటి లోని ప్రతి ఒక్క శత్రు వర్గానికి అది మరియు దానికి సంబంధించిన అనుగుణ్య సమూహం.

3) ఇపుడిక కామం గురించి. కామం అంటే వస్తుతః సంభోగేచ్ఛ, స్త్రీ పురుషుల మధ్య పవిత్ర సృష్టి కార్యమైన సంతానోత్పత్తి నిమిత్తం ఒకరినొకరు కలవాలి అనే కోరిక. ఈ కామం వ్యక్తిగతం కాదు, సృష్టి గతం, ఖచ్చితంగా చెప్పుకుంటే‌ మూల/ శూన్య స్థాయిల సంబంధం, సృష్టిలో పనిచేసే కామం మాదిరిగా కాక, క్రింది స్థాయిలకు పరిమితం చేసే ఎలాంటి విశేషణాలు లేని ఒక శుద్ధ మూల భావనగా, సృష్టి స్థాయి భావనకు అతీతంగా ఆ భావన యొక్క పరిమితులకు లోబడని సృష్ట్యాతీత మూల భావనగా.

4) అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే‌, కామం అంటే స్థూల రూప ధారణ అనంతరం ఉండకుండా ఉండలేనిది లేదా ఖచ్చితంగా ఉండితీరక తప్పనిది.

5) మానవ జీవనంలో కామం యొక్క పాత్ర ఏమిటి?

6) సృష్టి ప్రక్రియలో కామం యొక్క పాత్ర ఏమిటి?

7) పవిత్ర కార్యమైన కామానికి వర్గం లేదా అనుచర సమూహం కోరికలు. అసలైన పవిత్ర అర్థంలో కాక, ఏ ఇతరమైన దాని గురించి అయినా కలిగే కోరికలు. ఆ కోరికలే సృష్టి ప్రక్రియ లోని వ్యక్తి జీవనాన్ని, జీవితాన్ని అప్రతిహతంగా శాసిస్తున్నాయి. ఇది సర్వజన విదితమైన విషయమే. కానయితే, తెలియని, తెలియబడజాలని, ఒకవేళ లీలామాత్రంగా తట్టినా వివరంగా పైకి చెప్పలేని, చెప్పుకోలేని విషయం ఏమిటి అంటే అరిషడ్వర్గాల లోని మిగతా అయిదు కూడ కామ/ కోరిక జనితాలే, కానీ వాటి వర్గాలకు కారణం కాగలిగిన ప్రధాన అంశాలుగా మాత్రమే.

8) ఇంకొక విషయం ఏమిటి అంటే పవిత్ర మూల భావనగా మూల స్థాయిలో బయలుదేరిన కామం, సృష్టి పరంగా దాని క్రింది స్థాయి అర్థంలో సుఖ ప్రాప్తికి, సూక్ష్మ సంతృప్తికి ఆలవాలం అయిపోయింది, పవిత్ర సంతానోత్పత్తి కార్యాన్ని మించి, విశృంఖలమై, లక్షణ పరమైన వ్యక్తి స్థాయి దిగజారుడుతనానికి మరియు సృష్టి స్థాయి దిగజారుడుతనానికి మూల కారణం అయిపోయింది. స్త్రీ పురుష సంబంధాన్ని నీచ స్థాయికి దిగజార్చింది. వావి వరుసలను కూడ అతిక్రమించి, భీతావహ సామాజిక స్థితిగతులను సమగ్రంగా సమర్థవంతంగా సృష్టించి, జీవన జీవిత అవసరాల ప్రతి క్రియాకలాపం లోను చొచ్చుకుపోయింది. భగవంతుని చిద్విలాసం అని పేర్కొనబడిన సృష్టిని కామకేళీ కలాపాల విలాసంగా లేదా చిరునామాగా మార్చివేసింది. బుద్ధి జీవి మనిషిలో బుద్ధి పనిచేయడం లేదు అనే వాస్తవానికి ఋజువుగా/ నిర్ధారణగా మనిషి యొక్క వేషం, భాష,, వర్తన, ప్రవర్తన, నీతి, రీతి సమస్తాన్ని తనకు -అంటే కామానికి, కోరికలకు- పాదాక్రాంతం చేసుకుంది.

9) ఈ యోగ లక్ష్య సిద్ధికి, కామానికి మధ్య ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?

10) ఉంది, క్రింది స్థాయి అర్థంలో కాదు, దాని మూల స్థాయి అర్థంలో మాత్రమే ఉంది. మనిషికి తన స్థూల‌ పుట్టుకకు కారణం గానీ, సృష్టి లక్ష్యం ఏమిటి అనే దానికి సరయిన అర్థం, పరమార్థం గానీ తెలియకపోయినా, కామం యొక్క మూల స్థాయి అర్థం లోని ప్రభావం చేత ఎందుకు అనేది తెలియకుండా మరణానికి భయపడుతూ, మరణించకుండా ఉండిపోవాలి అని "మృత్యోర్మా అమృతం గమయ" అనే వేద సూక్తానికి అనుగుణమైన మరియు మోక్షం అనే మాట యొక్క అసలైన అర్థం లోని సృష్టి లక్ష్యానికి అనుగుణమైన ఆంతరిక భావనను కలిగి ఉన్నాడు. అంతేకాదు, "కామి గాక మోక్షగామి గాడు" అని క్రింది స్థాయి కామాన్ని బలపరిచే విధంగా చెప్పబడిన సామాజిక సూక్తానికి భిన్నంగా, మోక్షానికి చెప్పబడిన విపరీత అర్థానికే -అంటే భగవంతుడిలో/ దేముడిలో ఐక్యం అయిపోవడం అనే విపరీత అర్థానికే- పైపైనే అయినా, వస్తుతః మోక్షానికి లేదా అసలైన అర్థం లోని మోక్షానికి తనకు తెలియని ఆంతరికంలో కట్టుబడి ఉన్నాడు. ఆ క్రింది స్థాయి కామం లేదా కోరిక ఈ యోగ విధాన ప్రభావం చేత సృష్టి జనుల సమస్తం లోను జరిగే యోగ క్రియల ఫలితంగా సమస్త సృష్టికి సంబంధించిన ఈ యోగం యొక్క లక్ష్య సిద్ధికి దారితీయనుంది.
Post Reply