ప్రశ్న నెం.008 (10-5-2021) విషయం "మనం ప్రస్తుతం చేసే ప్రాక్టీసు అసలైన యోగా ప్రాక్టీసేనా".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Admin
Site Admin
Posts: 16
Joined: Sat May 08, 2021 3:02 am

ప్రశ్న నెం.008 (10-5-2021) విషయం "మనం ప్రస్తుతం చేసే ప్రాక్టీసు అసలైన యోగా ప్రాక్టీసేనా".

Post by Admin »

ప్రశ్న నెం.8 (10-5-2021) యొక్క విషయం (తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఒక యోగమిత్రుడు లేవనెత్తిన అంశం) - ఎక్కడ చూసినా, ఏదో కలిసిరావాలని లేదా ఆరోగ్యం బాగుపడాలని లేదా కోరికలు తీరాలని యోగా ప్రాక్టీసు చేయడం జరుగుతోంది తప్ప యోగా ప్రాక్టీసు ఎందుకు చేస్తున్నామో తెలిసి ప్రాక్టీసు చేయడంలేదని అనిపిస్తోంది. మనం అలా చేసేది అసలు యోగా ప్రాక్టీసేనా?

సదరు యోగ మిత్రుడు లేవనెత్తిన అంశాన్ని ఆధారం చేసుకుని మనం వేసుకోదగిన ప్రశ్న - లేవనెత్తిన అంశం యొక్క వాస్తవికత ఏమిటి అనేది యోగ సాధకులు ఎవరికి వారు నిజాయితీగా తమ ఆంతరంగిక మనోరథాన్ని గమనించుకుని తేల్చుకోవలసిన విషయం అయినప్పటికీ, యోగా ప్రాక్టీసు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేస్తున్నామా అనేది ప్రశ్నించుకోదగినది మాత్రమే కాక కాదనలేని వాస్తవం కూడ కాదా? అప్పటి మీడియములను ఉద్దేశించి14-11-1912 న డైరీలో వేయబడిన 'ఈ యోగా ప్రాక్టీసు దేనికోసం ఉద్దేశించబడిందో మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి' అనే ప్రశ్న ప్రస్తుత యోగ సాధక సమాజానికి వర్తించదా? ఏమీ తెలియడం లేదు అనే ఆంతరంగిక తపనను మించి, అలా తెలుసుకోవడానికి నిజాయితీతో కూడిన ప్రయత్నం జరుగుతోందా? ఖచ్చితంగా చెప్పాలి అంటే అలా తెలుసుకోవడం నిజంగా సాధ్యమేనా? అందుకు సహకరించని అంశాలు ఏమిటి?
Post Reply