1) యం.టీ.ఏ. అంటే ఏమిటి?
2) "యం.టీ.ఏ. అంటే మీ ఫిజికలు మాస్టరు యొక్క ఒక మాస్టరు అని మీకు తెలియాలి" అనేది డైరీలో 10-12-1912 న మీడియములకు సూచించబడింది. ఇందులో "ఒక మాస్టరు" అనేది ప్రత్యేకంగా గుర్తించి, గమనించదగిన విషయం. ఎందుకు అంటే అదే రోజున "ఈ సొసైటీలో మీ స్థాయి, మీ ఫిజికలు మాస్టరు స్థాయి, ఆయన మాస్టరు స్థాయి, 'వన్ పాయింటు' స్థాయి. ఈ స్థాయీ క్రమాన్ని మార్చకూడదు" అని కూడ మీడియములకు సూచించబడిన దానిలో ఫిజికలు మాస్టరు యొక్క మాస్టరు స్థాయి అని కూడ చెప్పబడింది గనుక, 'ఒక మాస్టరు' మరియు 'మాస్టరు' అనే వాటి మధ్య అంతరం ఉన్న సంగతి తెలుస్తూనే ఉన్నా, ఆ అంతరం ఏమిటో తెలియాలి గనుక. ఫిజికలు మాస్టరు యొక్క మాస్టరే, అంటే పరంపరలో చెప్పబడిన మాస్టరే, అసలు మాస్టరు అనే విషయం స్పష్టం. 'ఒక మాస్టరు' అంటే ఏమిటి అనేదే ఇపుడు తెలియవలసిన విషయం.
3) "నీ (= ఫిజికలు మాస్టరు గారి) మాస్టరు యొక్క మూలసూత్రాల ఆచరణకు లోనవడం అనే ఆ విషయాలలో ప్రత్యేకించి నీ యోచనల సంబంధంగా నీ విద్యార్థికి మాత్రమే కాక నీకున్నూ, నీ మీడియముల కోసమున్నూ కడు ఇంపుగా ఉండబోయేలాంటి నిర్దేశాలను వ్రాయడానికి నాకు సంతోషంగా ఉంది" (కె. కోర్సు 28-5-1910 ఉ.9.15). "నేను ఈ ఉదయం వ్రాయకుండా వదిలేసిన సదరు భాగానికి ఈ పంక్తులు కొనసాగింపు గనుక నేను ఈ పంక్తులను కేవలం నీకు నిర్దేశించడానికి మాత్రమే కాక విద్యార్థికి, నీ మీడియములకు అర్థమయేలా చేయడానికి కూడ లిఖిస్తున్నాను" (కె. కోర్సు 28-5-1910 సా.4.30-4.55). ఈ లిఖిత భాగాలు యం.టీ.ఏ. అంటే ఏమిటో తెలియచేస్తున్నాయి. వ్రాసే చెయ్యి స్థూలంగా సుందరంది. 'వ్రాయడానికి', 'లిఖిస్తున్నాను' అని యం.టీ.ఏ. చెప్పడం అనేది స్థూల చేతి ద్వారా వ్రాత కార్యక్రమానికి సంబంధించిన ఒక సూక్ష్మ స్థాయియే యం.టీ.ఏ. అని సూచిస్తోంది. ఇక్కడ నిస్సందేహంగా నిశ్చయించదగిన విషయం ఇదే.
4) యం.టీ.ఏ. ఎవరు అని ఎందుకు అనకూడదు?
5) యం.టీ.ఏ. ఒక స్థూల స్థాయి కాదు గనుక, యం.టీ.ఏ. ఎవరు అని అనకూడదు. ఇందుకు తార్కాణం మరియు మీడియములు గానీ, ఇంకెవరయినా గానీ అపార్థానికి లోనయే అవకాశం లేకుండా ఉండడానికేమో అన్నట్లుగా డైరీలో 30-11-1912 న ప్రాక్టీసు చేయించబడిన నామం "వాట్ ఈజ్ దట్ యం.టీ.ఏ.", అంటే "ఆ యం.టీ.ఏ. అంటే ఏమిటి" అని.
6) మన యోగంలో యం.టీ.ఏ. పాత్ర ఏమిటి?
7) ఫిజికలు మాస్టరు గారి ద్వారా గానీ, సుందరం ద్వారా గానీ, ఏ ఇతర మీడియం ద్వారా గానీ డైరీలు, నోట్సు, యమ్. కోర్సు వివరణలు, కె. కోర్సు, విద్యార్థి ద్వారా రికార్డు, యస్. యస్. ద్వారా నోట్సు మొదలైన యోగా రికార్డులను లిఖించడంలో సూక్ష్మ స్థాయిగా వ్రాతకు సంబంధించిన పాత్రయే యం.టీ.ఏ. లేదా ఆ సూక్ష్మ స్థాయి పాత్ర యం.టీ.ఏ. దే.
సమాధానం నెం.043 - ప్రశ్న నెం.043 (23-7-2021) విషయం "యం.టీ.ఏ.".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm