1) సూక్ష్మం అంటే ఏమిటి?
2) క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే స్థూలం కానిది సూక్ష్మం. అంటే ఇంద్రియ గోచరమయే బాహ్య, ఆంతరిక శరీర భాగాలకు భిన్నంగా ఇంద్రియ గోచరం కానిది సూక్ష్మం. దానినే సాంప్రదాయబద్ధమైన సిద్ధాంతంలో సూక్ష్మ శరీరం అన్నారు, దానినే విభాగాలుగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నారు. ఇది ఆధ్యాత్మికవేత్తలకు అందిన విభజన.
3) ఈ యోగంలో మానవ శరీరాన్ని ఏడు తలాలుగా విభజించారు ఫిజికలు, యాస్ట్రలు, మెంటలు, బుద్ధిక్, నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపర నిర్వాణిక్ అని. ఇవి సాంప్రదాయ సిద్ధాంతం లోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే ఏడు చక్రాలతో సరిపోలుతాయి. సాంప్రదాయ సిద్ధాంతంలో చక్రాలుగా చెప్పబడినవే మానవ శరీరం యొక్క ఏడు తలాలుగా యోగంలో చెప్పబడినాయి. ఏడు తలాలలో మూడు అథో తలాలు ఫిజికలు, యాస్ట్రలు, మెంటలు. మూడు ఊర్థ్వ తలాలు నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపర నిర్వాణిక్. మధ్యలోని బుద్ధిక్ తలం అథో తలాలకు, ఊర్థ్వ తలాలకు వారధి లాంటిది. స్థూల శరీరంలో పనిచేసే యాస్ట్రలు తలం, మెంటలు తలం రెండిటినీ కలిపి సూక్ష్మం అని చెప్పుకోవచ్చు. మెంటలు తలం మళ్ళీ మెంటలు రూప, మెంటలు అరూప అని విభజన. ఇంద్రియ గోచరం కానివి, కానీ అవి పనిచేస్తున్నట్లుగా తెలిసే అవకాశం ఉన్నవి అయిన యాస్ట్రలు, మెంటలు తలాలనే సూక్ష్మం అంటారు.
4) సూక్ష్మం యొక్క అవసరం ఏమిటి?
5) తనలో జరిగే సమస్త క్రియాకలాపాలకు స్థూలం సాధనం మాత్రమే అయి ఉంది. స్థూలం క్రియాకలాపాలను చేయదు, ఆ క్రియాకలాపాలు జరగడానికి కేవలం సాధనం మాత్రమే. ఉదాహరణకు కన్ను స్థూల సాధనం, కంటి ద్వారా జరిగే చూపు అనే క్రియ సూక్ష్మం. ఇలాగే ప్రతి శరీర అవయవం, దాని ద్వారా జరిగే క్రియాక్రమం లేదా కార్యక్రమం అన్నీనూ. స్థూల శరీరంలో చోటు చేసుకునే సూక్ష్మ క్రియలు సమస్తం శక్తి ప్రేరితం. శక్తి ప్రేరితంగా పనిచేసే సూక్ష్మ తలాలనే సూక్ష్మం అని పేర్కొనవచ్చు. సందర్భాన్ని బట్టి ప్రతి తలాన్ని కూడ సూక్ష్మం అని ప్రస్తావించనగును. సాధనమైన స్థూలంలో జరిగే క్రియాకలాపాలకు అవసరమైనది సూక్ష్మమే, సూక్ష్మ అథో తలాల సమాహారమే.
6) సూక్ష్మానికి, సృష్టి లక్ష్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
7) 'నేను ఎవరిని, నేను అది కావాలి' అనే సంకల్పమే సృష్టి లక్ష్యం అని చెప్పుకున్న మీదట, ఆ సంకల్పం నెరవేరడానికే శక్తి/ఆదిశక్తి సృష్టికర్తగా సృష్టి చేసింది అని చెప్పుకున్న మీదట, వ్యక్తి స్థాయిలో శక్తి ప్రేరితంగా పనిచేసే సూక్ష్మమే సృష్టి లక్ష్య సిద్ధిలో క్రియా భాగం. స్థూలంలో మూలం/ప్రాణం కలవడమే యోగం అని చెప్పుకోబడిన మీదట, ఆ కలయిక జరగడానికి క్రియా రూపంగా పనిచేయవలసింది వ్యక్తి స్థాయిలో సూక్ష్మమే. కాకపోతే, ఆ పనిచేయవలసిన తీరు ప్రస్తుత సృష్టి విధానానికి అనుగుణంగా కాక నూతన సృష్టి విధానపు లేదా సృష్టి నూతన విధానపు తీరుకు అనుగుణంగా మాత్రమే.
సమాధానం నెం.053 - ప్రశ్న నెం.053 (12-8-2021) విషయం "సూక్ష్మం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm