1) మనిషి అంటే ఏమిటి?
2) కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల సృష్టిక్రమవికాసంలో లోహ వృక్ష జంతు దశల అనంతరం వచ్చిన సర్వోత్కృష్ట రూపం అయిన మానవ జీవియే మనిషి.
దానికి ముందరి జీవ దశలలో లేని ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మానవ రూపం మనిషి. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే బుద్ధిని కలిగి ఉండడం.
3) మానవ రూపానికి పెట్టబడిన పేరు అయిన మనిషి అనే పదం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని తీసుకున్నట్లయితే, మనిషి అంటే మనః + ఈశః అనే పద విభాగంగా మనసు మీద ఈశత్వం కలిగిన వాడు అనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన అర్థం. కానీ, సృష్టి వాతావరణంలో సామాజికంగా ఉన్న వాస్తవిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చెప్పుకున్నట్లయితే, మనిషి అంటే మనసు మీద ఈశత్వం లేదా ఆధిపత్యం పొందదగినవాడు అనే భవిష్య సంబంధిత అర్థం మాత్రమే సమంజసం. "వంద యుద్ధాలు గెలువవచ్చు, వంద యజ్ఞాలు చేయవచ్చు, కానీ మనిషి తన మనసును జయించడం దుర్లభం" అని చెప్పిన గీతా వాక్యమే దీనికి తార్కాణం, ప్రస్తుత మానవ మానసిక స్థితిని లోతుల నుండి గమనించలేకుంటే.
4) మనిషికి సంబంధించి మానసిక స్థాయిని మించింది బుద్ధి స్థాయి. మనిషిలో వస్తుతః బుద్ధి ఉన్నప్పటికీ, దాని క్రియాక్రమం కేవలం జీవన సంబంధమైన లేదా బ్రతుకును సుఖవంతంగా వెళ్ళదీయడానికి సంబంధించిన క్రియాకలాపాలకు మాత్రమే పరిమితమై ఉంది తప్ప, సృష్టి లక్ష్యంలో మనిషికి లేదా మానవ రూపానికి ఉన్న అవసరం ఏమిటి అనే దిశలో పయనం చేయలేనిది మనిషి లోని బుద్ధి.
5) మనిషికి, సృష్టి లక్ష్యానికి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి?
6) సర్వోత్కృష్ట రూపధారి అయిన మనిషియే సృష్టి లక్ష్య సిద్ధికి పట్టుగొమ్మ, అలా అని మనిషికి తెలిసినా తెలియకపోయినా. రూప సంబంధంగా పరిపూర్ణతను పొందిన మనిషి లేదా మానవ రూపం లక్షణపరమైన పరిపూర్ణతను సంతరించుకోవలసి ఉంది. ఆ దిశగా సృష్టి స్థాయి ప్రయోగాలను చేపట్టడానికి జరిగిందే ఈ యోగం యొక్క ఆరంభం. ఏ కారణాల చేత మనిషి తన మనసు మీద ఆధిపత్యం లేదా ఈశత్వం సాధించలేని దీన స్థితిలో ఉన్నాడో, దానికి సంబంధించినవే సమస్త యోగా రికార్డులలో అనేక మితులలో విశ్లేషించి విశదీకరించబడిన పాఠ్యాంశాలు. ఏకంకు చేరుకోవడానికి మనసు/మానసిక పటిమ/మేథో పటిమ సంస్కరించబడి సంకల్ప పటిమ పెంపొందించబడాలి అని అర్థం వచ్చేలా కె. కోర్సులో యథారీతిన గుంభనంగా చెప్పబడిన విషయాలే ఇందుకు తార్కాణం.
7) మనిషికి సృష్టి లక్ష్యం ఏమిటో ఎందుకు తెలియడం లేదు?
8) వస్తుతః బుద్ధి జీవి అయిన మనిషిలో బ్రతుకును వెళ్ళదీయడానికి లేదా సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మాత్రమే బుద్ధి లేదా బుద్ధిలో అంతర్భాగమైన మేథో పటిమ పరిమితమైపోయి ఉంది గనుక, యోగ సంబంధ సమాచారంగా మనిషి శక్తులను లేదా కుండలినీ శక్తులను సాధించడం అనే యాస్ట్రలు లెవెలు యొక్క అంత్యానికి మాత్రమే చేరుకుని ఉన్న కారణంగా చంచల తత్త్వం ఉన్న మనసు మీద ఆధిపత్యం లేదా ఈశత్వం సాధించలేని స్థితిలో ఉన్నాడు గనుక, దాని కారణంగా మానవ రూపానికి సృష్టి లక్ష్య సిద్ధిలో ఉన్న ప్రాశస్త్యాన్ని/అవసరాన్ని లేదా సృష్టి లక్ష్య సిద్ధికి ఏకైక అవసరం మరియు సాధనం మానవ రూపమే అనే విషయాన్ని ఈషణ్మాత్రం గ్రహించలేని మేథో జీవిగా మాత్రమే ఉంటున్నాడు గనుక, మృత్యోర్మా అమృతం గమయ (మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది) అనే అభ్యర్థనా పూర్వక వేదసూక్తం అందినా కూడ, జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ (పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించక తప్పదు) అనే గీతా వాక్యం మరియు దానికి సమానార్థకమైన పునరపి జననం పునరపి మరణం (మళ్ళీ మళ్ళీ జన్మించడం, మళ్ళీ మళ్ళీ మరణించడం) అనే సూత్రం ఆధారంగా మృత్యోర్మా అమృతం గమయ అంటే అపమృత్యువు నుండి కాపాడుము అనే పరిమిత అర్థానికే తన మేథో పటిమను మనిషి సరిపుచ్చుకున్నాడు గనుక, మనిషికి సృష్టి లక్ష్యం ఏమిటో తెలియకుంది, తెలియరాకుంది.
సమాధానం నెం.055 -.ప్రశ్న నెం.055 (16-8-2021) విషయం "మనిషి".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm