సమాధానం నెం.058 - ప్రశ్న నెం.058 (22-8-2021) విషయం "భూమి".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.058 - ప్రశ్న నెం.058 (22-8-2021) విషయం "భూమి".

Post by Katakam »

1) భూమి అంటే ఏమిటి?

2) బృహత్ ప్రాణానికి లేదా మూల ప్రాణం నుండి ఛాయగా/అంశగా ఏర్పడిన సృష్టి ప్రాణానికి నెలవు/ఉనికిస్థానం అయి ఉన్నది భూమి. ఆ కారణంగా జీవ సృష్టికి అనువయిన ప్రదేశం ఈ భూమి అయి ఉంది. ఈ భూమి మీద మాత్రమే జీవ సృష్టి ఉంది. ఈ విశ్వంలో గానీ, విశ్వాంతరాళాలలో గానీ మరెక్కడా జీవ సృష్టి లేదు అనేది విజ్ఞానశాస్త్రం యొక్క పరిశోధన ఫలితమైన సమాధానం.

3) భూమికి, మనిషికి సంబంధం ఏమిటి?

4) జీవ సృష్టి జరిగిన ఈ భూమి మీద ఏర్పడిన జీవ దశలలో తలమానికమైన జీవ రూపం మనిషియే. సృష్టి లక్ష్యం నెరవేరడానికి అనువయిన ప్రదేశం అయిన ఈ భూమి మీద సృష్టి లక్ష్య సిద్ధికి అనువయిన లేదా అర్హత కలిగిన ప్రాథమిక రూపం మనిషిదే.

5) మాస్టరు గారి డైరీలో 14-11-1912 న "మీడియముల గురించి" అనే శీర్షిక క్రింద "ముఖ్యంగా దృష్టి పెట్టవలసినవి" అనే ఉపశీర్షిక క్రింద ఈ యోగం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి అన్నట్లుగా మీడియములకు వేయబడిన ఏడు ప్రశ్పల లోని "ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే మూడవ ప్రశ్న అన్యాపదేశంగా సృష్టి లక్ష్య సిద్ధిలో మనిషి యొక్క మరియు ఈ భూమి యొక్క ప్రాధాన్యతనే సూచిస్తుంది.

6) భూమికి, వాతావరణానికి సంబంధం ఏమిటి?

7) భూమి చుట్టూ కొన్ని వందల కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న వాతావరణం లేదా వాత + ఆవరణం లేదా మూల ద్రవ్యాల సమ్మేళనమైన గాలి యొక్క సాంద్రత కారణంగానే భూమి మీద మనిషి గానీ, ఇతర జీవజాలం గానీ జీవించి ఉండడానికి అనువయిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భూమి వాతావరణానికి, మనిషి లోని ఆంతరిక నిర్మాణతకు మధ్యన ఉన్న సూక్ష్మతమ సామ్యాల కారణంగా మనిషికి సంబంధించిన శ్వాసక్రియ మనిషి ప్రయత్నం లేకుండానే యాంత్రికంగా సాగిపోతోంది. విశ్వానికి మానవుడు సూక్ష్మాతిసూక్ష్మ ప్రతీక అని ఒక మహానుభావుడు చెప్పిన వాక్యం లేదా అతనికి అందిన సమాచారం ఇక్కడ ప్రస్తావనీయం.

8) మనిషి మనుగడలో భూమి పాత్ర ఏమిటి?

9) మనిషి జీవించి ఉంటోంది ఈ భూమి పైనే, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా జీవ సృష్టికి అనువయిన ప్రదేశం ఈ భూమియే, మనిషికి ఆవాస స్థానం లేదా నివాస స్థానం ఈ భూమియే. భూమిని, భూమి వాతావరణాన్ని కాదని వేరే చోట మనిషి నివాస స్థానం ఏర్పరుచుకోవడం అనేది స్థూలంగా సాధ్యమయే విషయం కాదు. మనిషి మనుగడకు అవసరమైన జీవ వనరులు భూమి నుంచి మాత్రమే లభ్యం అవుతాయి అనే వాస్తవం సర్వజన విదితమే.

10) యోగ లక్ష్య సిద్ధిలో భాగంగా మనిషి రూపం తయారు కావడానికి భూమి కూడ తట్టుకునే పరిస్థితిని తగిన మేరకు సంతరించుకోవలసిన అవసరం అనీ, 23 1/2 డిగ్రీల భూమి వంపు సరిచేయబడవలసిన అవసరం అనీ, యోగ సంబంధంగా భూమి మలచబడడానికి "ఎర్త్ మౌల్డింగ్ ప్రిన్సిపుల్స్" ప్రాక్టీసు చేయించబడ్డాయి అనీ మాస్టరు గారి రికార్డులలో ఉన్న విషయాన్ని మరువరాదు. దీనికి సమర్థింపుగా ఉన్నదే మాస్టరు గారి డైరీలో 6-3-1921 న "ఈ లైను వర్కు యొక్క ఉన్నతమైన వత్తిడిని భరించే స్థితి ఈ భూమికి లేదు. కనుక ఆ స్థితిని సమీకరించుకోవడానికి దాని సమయం అది తీసుకుంటుంది" అని వ్రాయబడి ఉన్న విషయం.
Post Reply