సమాధానం నెం.061 - ప్రశ్న నెం.061 (28-8-2021) విషయం "జనరల్ ప్రాక్టీసు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.061 - ప్రశ్న నెం.061 (28-8-2021) విషయం "జనరల్ ప్రాక్టీసు".

Post by Katakam »

1) శ్రీ వీ.యల్.యన్. మూర్తి, నరసరావుపేట అనే యోగ మిత్రుడు తెలుగులో అడిగిన విషయాలకు ఇది సమాధానం.

2) ప్రశ్న - ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మాస్టరు సి.వి.వి గారు తప్పనిసరిగా జనరల్ ప్రేయర్ చేసుకోమన్నారు.

3) సమాధానం - జనరల్ ప్రేయరు అనే మాట గురించి చిన్న వివరణ. జనరల్ అంటే మిగతా కోర్సు నామాలతో సంబంధం లేకుండా 'రోజువారీగా చేసుకునేది' అని. 'ప్రేయరు' (ప్రార్థన) అనే మాట డైరీలలో గానీ, మాస్టరు గారి మిగతా రికార్డులలో గానీ ఎక్కడా లేదు, కనుపించదు, 'ప్రాక్టీసు' అనే మాట మాత్రమే ఉంది, కనుపిస్తుంది. అందువలన, దానిని 'జనరల్ ప్రాక్టీసు' అని మాత్రమే ఇక్కడ ఉదహరించడం జరుగుతుంది.

4) జనరల్ ప్రాక్టీసు ఏమి చేయాలి అని కాక, ఎలా చేయాలి అనే దాని గురించి "సూచన" గా "తదుపరి నిర్దేశాలు" మాస్టరు గారి డైరీలో 17-12-1914 న చివరి సారిగా ఇవ్వబడ్డాయి.

5) ప్ర. - వారు ఒకటి రెండు సార్లు ప్రేయర్ ఫార్మేట్ మార్చినారని విన్నాను.

6) స. - ఆ విన్నది వాస్తవ దూరం. డైరీల ఆరంభం నుండి చివరి వరకు "మాస్టరు నామం ప్రాక్టీసు చేయవలసింది" అని మాత్రమే ఉంది.

7) ప్ర. - ప్రస్తుతము ఒక్కొక్క సెంటర్లో ఎవరికి తోచినట్టు వారు ఏవేవో యాడ్ చేసుకుని జనరల్ ప్రేయర్ కొనసాగిస్తున్నారు.

8) స. - అలా చేయబడుతున్నవి మనసుకు అనిపించి గానీ, ఏవో విని గానీ, ఏవేవో పుస్తకాలు చదివి గానీ చేయబడుతున్నవే తప్ప, మాస్టరు గారి డైరీలను గానీ లేదా మాస్టరు గారి ఇతర రికార్డులను గానీ పాటించి చేస్తున్నవి కాదని మాత్రం చెప్పనయే అవకాశం.

9) జనరల్ ప్రాక్టీసు గురించి "మాస్టరు నామం చేయవలసింది" అని, "ఉదయం సాయంత్రం చేయవలసింది" అని చెప్పిన సందర్భం మాస్టరు గారి డైరీలో 30-11-1920 న "ఇకమీదట మీడియములకు పంచే ప్రాక్టీసు ఏమీ లేదు. ఆ ట్రూత్ చలనం బాహ్యంలో కనపడే వరకు మీడియములు మాస్టరు నామాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేయాలి" అని లిఖించబడి ఉంది.

10) 30-11-1920 తరువాత, 5-1-1922 న "స్థానిక మీడియములకు సూచన" గా అప్పటికే ప్రాక్టీసు చేయబడుతున్న ఒలిడియరు 3 నామం గురించి "రేపు ఉదయం 6 గంటల ప్రాక్టీసుతో ఒలిడియరు 3 నామాన్ని మొదలు పెట్టి, మరల నిర్దేశించే వరకు దానిని కొనసాగించవలసింది" అని జనరల్ ప్రాక్టీసులో మాస్టరు నామంతో పాటు ఒలిడియరు 3 నామాన్ని కూడ కలిపి చేయమని చెప్పబడింది.

11) ప్ర. - అసలు మాస్టరు సి.వి.వి. గారు చివరిగా మార్చి ఇచ్చిన ప్రేయర్ ఏది?

12) స. - మార్చింది ఏమీ లేదు. జనరల్ ప్రాక్టీసులో మాస్టరు నామానికి ఒలిడియరు 3 నామం జోడించబడింది, అంతే.

13) ప్ర. - దయచేసి మనకు డైరీలు అన్నిటికీ ఆధారం కనుక దానిలో యథాతథంగా మాస్టర్ సి.వి.వి. గారు మార్చి ఇచ్చిన జనరల్ ప్రేయర్ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

14) స. - మార్చి ఇవ్వడం ఏమీ లేదు అని చెప్పుకున్న మీదట, జనరల్ ప్రాక్టీసుకు సంబంధించి ఉంది మాస్టరు నామం (మాస్టర్ సీ.వీ.వీ. నమస్కారం) మరియు ఒలిడియరు 3 నామం మాత్రమే అని చెప్పుకున్న మీదట, ఇక 'డైరీలు ఆధారం' అనే విషయం గురించి. మాస్టరు గారి డైరీలలో మాత్రమే కాక, కె. కోర్సు వాల్యూం 4 లో అధిక భాగం కూడ జనరల్ ప్రాక్టీసు మరియు ప్రాక్టీసు గురించి యథారీతిన గుంభనమైన పదజాలాలతో చెప్పబడి ఉంది అని మాత్రం తెలియచేయబడుతోంది.
Post Reply