సమాధానం నెం.665 - ప్రశ్న నెం.665 (18-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీ నోటి శబ్దాలు అన్నీ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.665 - ప్రశ్న నెం.665 (18-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీ నోటి శబ్దాలు అన్నీ".

Post by Katakam »

1) "నీ నోటి శబ్దాలు అన్నీ త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి జాలువారుతున్నాయి అని భావించు. ఎన్నడూ దానికి ఎలాంటి విలువ ఇవ్వవద్దు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ఏ ప్రశ్న విషయానికి కొన‌సాగింపు కాకపోయినప్పటికీ, తెలియని లోతులలో మాస్టరు గారిలో కలిగిన ఏదో భావనకు సంబంధించి ఉంది అని నిశ్చయంగా చెప్పుకోనగును. కాకపోతే, ఆ భావన ప్రస్తుత ప్రశ్న విషయానికి సంబంధించేదిగా ఉంది అని, ఆ భావన ఏమిటి అనేది వివరణలో తెలియనవుతుంది అని తెలియనగును.

3) నీ నోటి శబ్దాలు అన్నీ. నీ. నీ అనేది మాస్టరు గారికి సంబంధించింది. నోటి శబ్దాలు అన్నీ. మాస్టరు గారి నోటి ద్వారా వెలువడే మాటలు అన్నీ. ఇక్కడ నోటి శబ్దాలు అన్నీ అని అన్నపుడు, మాస్టరు గారి పాత్రను యోగ ప్రక్రియలకు సంబంధించి -అంటే యోగా ప్రాక్టీసు పరంగా, యోగ పరంగా జరుగుతున్న విషయాలకు సంబంధించి- మరియు యోగా ప్రాక్టీసు పరంగా, యోగ పరంగా కాకుండా కేవలం వ్యక్తిగా -అంటే వెంకాసామిరావు గారిగా ఉన్న సమయాలకు సంబంధించి- విడివిడిగా పరిగణన లోకి తీసుకోవలసిన అవసరం. ప్రస్తుత ప్రశ్న విషయం లోని తదుపరి మాటలకు సంబంధించి, ఫిజికలు మాస్టరు గారి -అంటే యోగ సంబంధమైన ప్రక్రియలలో పాల్గొంటునప్పటి- పాత్రను కాక, వ్యక్తిగా -అంటే వెంకాసామిరావు గారిగా- ఉంటున్నప్పటి పాత్రను తీసుకుని మాట్లాడే మాటలు అన్నీ అనే దానిని అన్వయించుకోవలసిన అవసరం.

4) త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి. దీని ముందరి ప్రశ్న విషయంలో (ప్రశ్న, సమాధానం నెం.653 విషయం "యోగా రికార్డుల విషయాలు - మగతల స్థితులు" లో) త్రోయింగ్ గిడ్డీనెస్ గురించి కొంత వివరంగానే చెప్పుకోవడం జరిగింది. కానీ, ఇది సందర్భం గనుక, మరికొంత వివరంగా. త్రోయింగ్ గిడ్డీనెస్ అంటే మాట పరమైన అర్థంగా తన్నుకుని బయటపడే మగత అని. ప్రక్రియ పరమైన లోతుల అర్థం చెప్పుకోవలసిన అవసరం. మానవ శరీరంలో చిత్తంలో నిల్వ అయి ఉన్న దానికి భిన్నమైనది, అతీతమైనది దానిని చిత్తం లోపలికి ప్రవేశించనివ్వదు, తిరస్కరిస్తుంది. వస్తుతః ఇది ప్రస్తుత సృష్టి విధానం. కానీ, యోగ పరంగా జరిగే ప్రక్రియలో ప్రస్తుత సృష్టి విధానానికి అందని లోతులలో ఉండి, చిత్తపు నిల్వకు భిన్నమైనది, అతీతమైనది చొప్పించబడుతుంది. అది లోపల ఇమడడానికి కొంత/ ఎంతో సమయం పడుతుంది. జ్ఞానం మానవ శరీరంలో ఇమడదు అనే సూత్రాన్ని ఇక్కడ అన్వయించుకోనవుతుంది. వస్తుతః ఇమడలేని యోగ ప్రక్రియగా పూర్తిగా ఇమడక ముందు లేదా ఇమిడే ప్రక్రియలో ఉండగా, విషయ తీవ్రత వలన బయటపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అది నోటి మాట రూపంగా తన్నుకుని బయటపడుతుంది, విషయంగా యథాతథంగా కాక (ఎందుకు అంటే అది లోపల ఇమడనేరదు గనుక, ఇమిడే ప్రక్రియలో మాత్రమే ఉంది గనుక), దాని ప్రభావం చేత మాట్లాడే మాటలలో ప్రత్యేకంగా గుర్తించదగినదిగా మాత్రమే (యోగ పరమైన గమనికకు మాత్రమే తెలిసే విధంగా) బయటపడుతుంది. అదే త్రోయింగ్ గిడ్డీనెస్. దీనికి మాస్టరు గారి కాలంలో జరిగి, ఒక మీడియం అయిన టి.యస్. శంకర అయ్యరు గారు తను వ్రాసిన వ్యాసంలో చెప్పిన దానిని ఉదాహరణగా చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. ఒక సంగీత విద్వాంసుడు త్యాగరాయ కీర్తనలు ఆలాపించగా, త్యాగరాయ కీర్తనలు ఆలాపించడం అలా కాదు అని, అప్పుడు అక్కడ ఉన్న మాస్టరు గారు త్యాగరాజ స్వామిని ఆ విద్వాంసుని లోనికి ఆవాహన చేసి, పాడించిన సందర్భం. దానికి సంబంధించిన తదుపరి సంభాషణలో మాస్టరు గారు 'నేను కుక్క చేత కూడ ఆంగ్లంలో మాట్లాడించగలను' అని చెప్పినట్లుగా శంకర అయ్యరు గారి వ్యాసంలో వ్రాయబడి ఉన్న విషయం. మాస్టరు గారి నోటి మాటలు త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి వచ్చాయి అనే దానికి ఇది ఉదాహరణ. ఎలా అంటే మాస్టరు గారికి అలాంటి శక్తి ఉంది అనేది ఆయన మాటలలో ప్రకటితం. కానీ, అది విశ్వ విధాన పరంగా కుండలినీ శక్తులలో భాగమే, ఒక మహిమయే తప్ప, మహిమలకు చోటు లేని యోగ సంబంధం కాదు.

5) జాలువారుతున్నాయి. మాటలో ఒక ప్రత్యేకత కాననవుతుంది. దానికి అర్థంగా చెప్పుకుంటే, అది గత జన్మల గొప్ప స్థాయిల ప్రభావంగా సూక్ష్మ సంబంధమైనదిగా తన్నుకుని బయటపడే త్రోయింగ్ గిడ్డీనెస్‌యే అని చెప్పుకోనవుతుంది. ఇది విశ్వ విధాన సంబంధమైన విషయమే, యోగ పరంగా చెప్పబడింది. గొప్ప మహానుభావులు లేదా మేథో మహానుభావులు శాపం పెట్టడం, అనుగ్రహించడం లాంటివి ఈ కోవకు చెందినవే, స్థూల స్థాయికి తెలిసే (కేవలం అరుదుగా మాత్రమే) లేదా తెలియని విధంగా సూక్ష్మం నుంచి బయటపడేదే.

6) అని భావించు. తెలుసుకో అని కాకుండా భావించు అని చెప్పడంలో/ సూచించడంలో ఉన్న విధాన పరమైన ప్రత్యేకత గురించి చెప్పుకోవలసిన అవసరమే. తెలుసుకో అని అంటే చెప్పబడిన వారికి కేవలం విషయంగా తెలియడం మాత్రమే జరుగుతుంది. కానీ, భావించు అని చెప్పడంలో, భావించు అనేది భావన చేసుకోవడం క్రిందికి వస్తుంది అని, పైనుంచి వచ్చిన దానిని భావన చేసుకోవడం వలన ఆ భావనా పటిమ/ బలం చేత (ఎందుకు అంటే అది పైనుంచి చెప్పబడింది/ సూచించబడింది గనుక) దానికి సంబంధించిన వర్కు జరిగి, దానిలో చక్కదిద్దబడడం జరిగి, దానిలో మార్పు చోటు చేసుకునే అవకాశం మాత్రమే కాక, చోటు చేసుకుంటుంది అని తెలియనగును. ఇక్కడ ఒక విధాన పరమైన విషయం చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. యోగ పరమైన డెవలప్‌మెంటు చోటు చేసుకోవడానికి సంబంధించి యోగ సాధకులకు స్థూల స్థాయిలో అందుబాటులో ఉన్న ఏకైక వనరు భావన మాత్రమే. కాకపోతే, ఆ భావనలో యాథాలాపంగా తీసుకోవడం కాక, నిజాయితీ ఉండవలసిన అవసరం. భావనకు ఉన్న ప్రాధాన్యత మాస్టరు గారి డైరీలలో ప్రాక్టీసు నామం చేయబోయే ముందు "భావన" అని వ్రాయబడి ఉండడంలో తెలియనవుతుంది.

7) ఎన్నడూ దానికి ఎలాంటి విలువ ఇవ్వవద్దు. ఎన్నడూ. స్పష్టమే. దానికి‌. త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి నోటి శబ్దాలు తన్నుకుని రావడం అనే దానికి. కానీ, దానిని గుర్తించడం ఎలా అనేది సమంజసమైన ప్రశ్నయే. జరుగుతున్న వాటిని గమనించగలిగినపుడు, దానిలో తేడా తెలిసే అవకాశం, దానిని విశ్లేషించుకుంటే, దానిలో మార్పు రావలసిన అవసరం తెలిసే అవకాశం. ఆ అవసరాన్ని గుర్తించి, దానికి తగినట్లుగా గానీ లేదా జరిగిన దానిని గుర్తు చేసుకుని నమస్కారం చేసుకోవడం గానీ చేయడమే నిజాయితీగా భావన చేసుకోవడం క్రిందికి వస్తుంది అని తెలియనగును. ఎలాంటి విలువ. ప్రస్తుత సృష్టి విధానంలో యోగ పరమైన మాటలుగా త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి నోటి మాటలు రావడం అనేది గొప్పగానే/ మహిమగానే పరిగణించనవుతుంది. కానీ, యోగ పరంగా కుండలినీ శక్తులు నిర్వీర్యం కావలిసిందే గనుక, వాటికి విలువ ఏమీ లేదు అనేది విషయం. ఇవ్వవద్దు. స్పష్టమే, అందుచేతనే దానికి విలువ ఇవ్వవద్దు అనే సూచన.

8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

9) యోగా ప్రాక్టీసు చేస్తూ కూడ, యోగం యొక్క విలువ తెలియక మహిమల పట్ల ఆకర్షితులు అయ్యే యోగ సాధక సమాజ సభ్యులకు ఇది కళ్ళు తెరిపించే సందర్భం అని తెలియనగును.
Post Reply