సమాధానం నెం.668 - ప్రశ్న నెం.668 (24-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆస్తి నిర్వహణ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.668 - ప్రశ్న నెం.668 (24-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆస్తి నిర్వహణ".

Post by Katakam »

1) "నేను ఇదివరకే చెప్పినట్లుగా ఆస్తి నిర్వహణను నీ కుమారుడు చూసుకునేలా నీవు ఏర్పాటు చేసి ఉండవలసింది. అది చేయబడలేదు, ఆ వత్తిడి నీకు అనుభూతం అవుతోంది. అంతేకాదు ఏదో కారణంగా వాళ్ళ మానసిక ప్రవృత్తి మార్చబడి ఉంది. ఆ కారణం బయటపెట్టబడదు. ఇంకా దాని వలన గౌరవం, ప్రేమ, విధేయత ఇంకా నమ్మకం కూడ తుడిచిపెట్టుకుపోయాయి" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా , ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.667 విషయం "యోగా రికార్డుల విషయాలు - బాహ్య వత్తిడిని తట్టుకోలేకపోవడం" కు) ఒక రకంగా కొనసాగింపు అని తెలియనగును. ఒక రకంగా అనే దానికి వివరణ ఏమిటి అంటే దీని ముందరి ప్రశ్న విషయంలో బాహ్య వత్తిడిని తట్టుకోలేకపోవడానికి యోగ పరమైన కారణం చెప్పబడగా, ప్రస్తుత ప్రశ్న విషయంలో వ్యక్తిగతంగా మాస్టరు గారికి సంబంధించిన కారణాలు, దాని పర్యవసానాలు చెప్పబడుతున్నాయి అని.

3) నేను ఇదివరకే చెప్పినట్లుగా ఆస్తి నిర్వహణను నీ కుమారుడు చూసుకునేలా నీవు ఏర్పాటు చేసి ఉండవలసింది. అది చేయబడలేదు, ఆ వత్తిడి నీకు అనుభూతం అవుతోంది. వీటిలో విడివిడి మాటలకు అర్థాలు కాకుండా, మొత్తానికి సంబంధించి విషయం చెప్పబడుతోంది, అవసరమైన చోట వివరణలతో. మాస్టరు గారు యోగ సంబంధ విషయాలలో నెం.1 మీడియంగా, ఫిజికల్ మాస్టరుగా పాల్గొంటూ, కుటుంబ పెద్దగా వ్యక్తిగతంగా ఆస్తి నిర్వహణను బాధ్యతగా వహిస్తున్నారని, కానీ ఆస్తి నిర్వహణను కుమారుడికి అప్పగించవలసిందని మాస్టరు గారికి ఇదివరకే చెప్పబడిందని/ సూచించబడిందని, కానీ వ్యక్తిగా మాస్టరు గారు ఆ పని చేయలేదని ఇక్కడ చెప్పబడుతున్న విషయం. ఆ వత్తిడి నీకు అనుభూతం అవుతోంది. దీని గురించి వివరంగా చెప్పుకోవలసిన అవసరం. ఈ సందర్భంగా, యోగ విధాన పరమైన విషయంగా చెప్పుకోబడిన 'వత్తిడి లేని చోట యోగ పరమైన డెవలప్‌మెంటుకు చోటు ఉండదు' లేదా 'యోగ పరమైన డెవలప్‌మెంటుకు వత్తిడి తప్పనిసరి అవసరం' అనే దానిని అన్వయం చేసుకుని కూడ చెప్పుకోవలసిన అవసరం. వత్తిడి నీకు అనుభూతం అవుతోంది అని అన్నపుడు, యోగా ప్రాక్టీసులో కర్మ పదార్థం కదిలించి కుదిలించబడడం వలన కలిగే వత్తిడి యొక్క ప్రభావం మాత్రమే రకరకాలుగా -అందులో ముఖ్యంగా రుగ్మతల రూపంగా- బయటపడడం, వాటికి యోగా ప్రాక్టీసు ఆగవలసిన అవసరం లేని విధంగా ఉపశమనం కోసం సందర్భాన్ని బట్టి టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు ఇవ్వబడ్డాయి. కానీ, వ్యక్తిగతంగా కుటుంబ పెద్ద అయిన మాస్టరు గారు ఆస్తి నిర్వహణ బాధ్యతను వహించడం అనేది కూడ ఒకానొక దశ వరకు -అంటే నింపబడిన వ్యూ బయటికి అన్ని వైపులకు వికీర్ణం చెందడం అనే ప్రక్రియ ముందు వరకు- వత్తిడిగా -అంటే యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ప్రభావాన్ని తట్టుకునేదిగా- అవసరం అయ్యింది. కానీ, ప్రస్తుత ప్రక్రియ ఆరంభమైన తరువాత, యోగా ప్రాక్టీసు సంబంధమైన వత్తిడికి అదనంగా వహిస్తున్న ఆస్తి నిర్వహణ వత్తిడి అనవసరం అయ్యింది. అందుచేతనే, ఇదివరకే చెప్పినట్లుగా ఆస్తి నిర్వహణను నీ కుమారుడు చూసుకునేలా నీవు ఏర్పాటు చేసి ఉండవలసింది అని చెప్పబడింది. దీని వలన తెలియబడుతున్న విషయం ఏమిటి అంటే ఒకప్పుడు అవసరం అయిన వ్యక్తిగత బాధ్యత ప్రస్తుత ప్రక్రియ దృష్ట్యా అనవసరం అయ్యింది అని.

4) అంతేకాదు ఏదో కారణంగా వాళ్ళ మానసిక ప్రవృత్తి మార్చబడి ఉంది. ఏదో కారణంగా. కారణం ఏమిటి అనేది చెప్పబడకపోయినా, అది మాస్టరు గారు వ్యక్తిగతంగా ఆస్తి నిర్వహణ కుమారుడికి ఇవ్వకపోవడానికి సంబంధించి ఉంది అని సమంజసంగా చెప్పుకోనవుతుంది. వాళ్ళ. కుటుంబ సభ్యుల. మానసిక ప్రవృత్తి. స్పష్టమే. మార్చబడి ఉంది. మారింది/ మారిపోయింది అని కాక, మార్చబడి ఉంది అని అనడంలో మాస్టరు గారు కావాలని చేయకపోయినా, ఆయన ఆస్తి నిర్వహణ ఇవ్వకపోవడం అనే దాని వలన వాళ్ళ మానసిక ప్రవృత్తి మార్చబడి ఉంది అనేది విషయం.

5) ఆ కారణం బయటపెట్టబడదు. ఆ కారణం బయటపెట్టబడదు అని అన్నపుడు, అది పరోక్షంగా మాస్టరు గారికి సంబంధించింది అనేది సమంజసంగా ఊహించనవుతుంది. కాకపోతే, చెప్పుకోకుండా ఉండలేని సర్వ సాధారణంగా జరిగే కుటుంబ సంబంధ వ్యవహారం ఏమిటి అంటే సమాజంలో ఆస్తిపాస్తుల సంబంధంగా కుటుంబ సభ్యులలో విభిన్న రీతులుగా కాననయే సర్వ సాధారణ పరిస్థితియే మాస్టరు గారి కుటుంబంలో కూడ నెలకొని ఉంది అని. అందుచేతనే, ఆ కారణం బయటపెట్టబడదు అని చెప్పబడింది అని తెలియనగును. దాని ఫలితాలే తదుపరి వాక్యంలో వివరించబడ్డాయి.

6) ఇంకా దాని వలన గౌరవం, ప్రేమ, విధేయత ఇంకా నమ్మకం కూడ తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి వివరణ ఇచ్చుకునే ముందు యోగ సాధకులలో సర్వ సాధారణంగా ఉన్న మానసిక ధోరణి గురించి చెప్పుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. యోగా ప్రాక్టీసు చేస్తున్నాం గనుక, ఒక ప్రత్యేకత ఉంటుంది, సామాన్య జనానీకం కంటె ఉన్నతంగా ఉంటాము, ఉండాలి అనేది సహజమైన భావన. దీని లోని వాస్తవ పరిస్థితి భిన్నం అనేది తెలియవలసిన అవసరం. గత జన్మల గొప్ప స్థాయిల కారణంగా ఆ భావన సహజం, సమంజసం కూడాను. కానీ, కుటుంబ పరిస్థితులు దానికి అనుగుణంగా ఉంటాయి అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే గత జన్మల గొప్ప స్థాయిల కారణంగా యోగంలో చేరి, యోగా ప్రాక్టీసు చేసుకునే అర్హతను పొందిన వరకు సబబే. కానీ, యోగా ప్రాక్టీసు యొక్క ఉద్దేశ్యం గత జన్మల గొప్ప స్థాయిల ఆంతరిక ప్రభావం నుండి బయటపడి లేదా ఆ ప్రభావం చక్కదిద్దబడి, డెవలప్ కావడం గనుక, సామాజిక జీవనంలో -అందులో ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో- సర్వ వ్యాప్తంగా ఉండే సగటు పరిస్థితులే ఉంటాయి అని తెలియడం అంత కష్టమైన విషయం కాదు అని తెలియనగును. అదే ప్రస్తుత ప్రశ్న విషయంలో చెప్పబడిన విషయం అని కూడ తెలియనగును. ఇంకా దాని వలన గౌరవం, ప్రేమ, విధేయత ఇంకా నమ్మకం కూడ తుడిచిపెట్టుకుపోయాయి అని అన్నపుడు, కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్ద పట్ల ఉండే గౌరవం, కుటుంబంలో వివిధ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, ఇక్కడ మాస్టరు గారి పట్ల, కుటుంబ పెద్దకు విధేయంగా ఉండడం, ఇవి కాక యోగం పట్ల నమ్మకం తుడిచిపెట్టుకుపోయాయి అనేది విషయం.

7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

8) యోగ సాధకులు అయినప్పటికీ, వాళ్ళ కుటుంబాలలో పరిస్థితులు సామాన్య పరిస్థితులకు భిన్నంగా ఉండవు అని తెలియడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలియనగును.
Post Reply