సమాధానం నెం.670 - ప్రశ్న నెం.670 (28-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ముందస్తు ఆలోచనతో ఈ లైనును పనిచేయించడం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.670 - ప్రశ్న నెం.670 (28-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ముందస్తు ఆలోచనతో ఈ లైనును పనిచేయించడం".

Post by Katakam »

1) "ముందస్తు ఆలోచనతో ఈ విధానాన్ని పనిచేయించడం అనే వివేక పూరితమైన పద్ధతి పాటించబడి ఉండలేదు. మనసుకు ఏ రకమైన బయటి ఆకర్షణ, వ్యాకులత లేకుండా నీవు విడిగా జీవించి ఉండవలసింది. మీ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నిన్ను కఠినంగా ఉండనివ్వలేదు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళుగా తయారవడానికి ఇది కారణం అయి ఉంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.669 విషయం "యోగా రికార్డుల విషయాలు - చెడు ఆరా" కి) కొనసాగింపు అని తెలియనగును. ఎలా కొనసాగింపు అంటే దీని ముందరి ప్రశ్న విషయంలో మాస్టరు గారికి సంబంధించినవిగా కుటుంబ విషయాలు చెప్పబడగా, ప్రస్తుత ప్రశ్న విషయంలో కుటుంబ విషయాలు అనేవి ఈ యోగాన్ని పనిచేయించడం అనే దానికి మాస్టరు గారికి ఎలా అడ్డంకులు అయ్యాయో సూత్ర ప్రాయంగా చెప్పబడింది.

3) ముందస్తు ఆలోచనతో ఈ విధానాన్ని పనిచేయించడం అనే వివేక పూరితమైన పద్ధతి పాటించబడి ఉండలేదు. ముందస్తు ఆలోచనతో. జరుగుతున్న దానిని (జరిగిన తీరును కూడ కలుపుకుని) ఆధారం చేసుకుని జరగబోయే దాని గురించిన ముందస్తు ఆలోచనతో. పనిచేయించడం. స్పష్టమే. అనే వివేక పూరితమైన పద్ధతి. దేనిని దానిని విడిగా తీసుకోగలగడమే వివేక పూరితమైన అనే దానికి అర్థంగా చెప్పుకోనవుతుంది. పాటించబడి ఉండలేదు. స్పష్టమే. వివేక పూరితమైన అని అన్నపుడు, వివేకం అనేది బుద్ధి యొక్క లక్షణాలలో ఒకటి కదా, అది పాటించబడి ఉండలేదు అనే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పుకోవడానికి, దీని ముందరి పదాలను కూడ పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుంది. అదే ముందస్తు ఆలోచనతో ఈ విధానాన్ని పనిచేయించడం అనే వివేక పూరితమైన పద్ధతి పాటించబడి ఉండలేదు అని. ముందస్తు ఆలోచనతో ఈ విధానాన్ని పనిచేయించడం అనే వివేక పూరితమైన పద్ధతి అని అన్నపుడు, వివేక పూరితమైన అనే మాట కేవలం ఆలోచనా విధానానికి లేదా మాస్టరు గారి డైరీలలో చెప్పబడిన గత జన్మల గొప్ప స్థాయిల ప్రభావం చేత జరిగే ఆలోచనా విధానానికి లేదా ఎడమ విధానానికి -అంటే మనసు సంస్కరించబడడం అనే ఒక సృష్టి లక్ష్య మితిలో భాగంగా చక్కదిద్దబడవలసిన ఆలోచనా విధానానికి- మాత్రమే సంబంధించి ఉంది అని, బుద్ధి పరమైన అని కాక వివేక పూరితమైన అనే మాటను జీవన సంబంధమైన అతి తక్కువ స్థాయి గమనికను ప్రస్తావించేదిగా/ సూచించేదిగా వాడడం లోనే ఆ తేడా కొద్దిపాటి పరిశీలనతో స్పష్టంగానే తెలియనవుతుంది. కనుక, ఈ ప్రస్తుత వాక్యం జరిగిన దానికి సంబంధించిన ముక్కుసూటి వ్యాఖ్య మాత్రమే తప్ప, దానిలో వ్యతిరేక అర్థం -అలా జరిపించబడవలసింది కాదు అనే అర్థం- లేదు అని తెలియనగును.

4) మనసుకు ఏ రకమైన బయటి ఆకర్షణ, వ్యాకులత లేకుండా నీవు విడిగా జీవించి ఉండవలసింది. ఈ వాక్యం సంబంధంగా దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.668) లోని "ఇంకా దాని వలన గౌరవం, ప్రేమ, విధేయత ఇంకా నమ్మకం కూడ తుడిచిపెట్టుకుపోయాయి" అని వ్రాయబడిన దానిని మరియు దీని ముందరి ప్రశ్న విషయం (ప్రశ్న, సమాధానం నెం.669) లోని "నీవు తీసుకునే ఆహారం చాలా చెడు ఆరాతో ఉంది. విభిన్నమైన ఆలోచనలతో అది నీకు ఇవ్వబడుతోంది. అందుకనే అది నీకు రుచికరంగా ఉండడం లేదు" అని వ్రాయబడిన దానిని మాస్టరు గారికి మనసుకు వ్యాకులత కలిగించే అంశాలుగా అన్వయించుకోనవుతుంది. బాహ్య ఆకర్షణ గురించి కేవలం ఉదహరించబడింది, ఎలాంటి విషయ ప్రస్తావన/ ఉదాహరణ లేకుండా. నీవు విడిగా జీవించి ఉండవలసింది. మాటలుగా అర్థం కానిది ఏమీ లేకపోయినప్పటికీ, దీని -కుటుంబ జీవనం అనే దాని- లోతులు సృష్టి స్థాయిలకు సంబంధించినవి అని, ప్రస్తుతం చెప్పబడింది కుటుంబ సంబంధంగా ఉన్న ప్రతికూల పరిస్థితులకు లోబడి ఉండిన అవసరానికి భిన్నంగా మాత్రమే అని తెలియనగును. ఈ విషయం కేవలం స్థూల మాస్టరు గారికి మాత్రమే సంబంధించి ఉంది అని, సాధ్యాసాధ్యాల ప్రస్తావన లేకుండా యోగ అవసరాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇది చెప్పబడింది అని తెలియనగును.

5) మీ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నిన్ను కఠినంగా ఉండనివ్వలేదు. కొంత నిశితంగా గమనించగలిగితే, పైన చెప్పుకున్న బాహ్య ఆకర్షణకు సంబంధించిందే ఈ వాక్యం అని తెలియనగును. బాహ్య ఆకర్షణ అంటే కుటుంబంలో ఉన్న సభ్యులకు ఎలా సంబంధిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే, నిక్కచ్చిగా, నిశ్చయంగా చెప్పుకోనయే విషయం ఏమిటి అంటే యోగ సంబంధంగా చెప్పబడిన లక్ష్యంలో భాగం అయిన స్పిరిచ్యువల్ డెవలప్‌మెంటును లేదా ఆత్మ సంబంధమైన డెవలప్‌మెంటును అసలైన అర్థంలో లేదా యోగ పరమైన అర్థంలో పరిగణన లోకి తీసుకుని చెప్పుకుంటే, కుటుంబ పరమైన వ్యక్తుల పట్ల (భార్యను మినహాయించి) ఉండే ప్రేమ కూడ బాహ్య ఆకర్షణయే, నేను లేదా ప్రాణం అనే ఆంతరికానికి/ కేంద్రానికి/ కేంద్రిత కేంద్రానికి బాహ్యమైనదిగా. యోగ పరంగా కర్మ పదార్థాన్ని బాహ్య పదార్థంగా -అంటే అసలైన నేనుకు లేదా ఆంతరికానికి బయటిదిగా- పేర్కొనబడిన విషయాన్ని ఇక్కడ అన్వయించుకోనవుతుంది. ఇక్కడ చెప్పుకోదగిన ఉత్తమోత్తమమైన విషయం ఏమిటి అంటే ఆంతరికమైన లేదా నేను/ ప్రాణ సంబంధమైన అపరిపూర్ణత్వం తోనే కుళ్ళి కునారిల్లిపోతున్న కుటుంబ వ్యవస్థ -అంటే వసుధైక కుటుంబం అనే సృష్టి స్థాయి అంశంలో భాగమైన వ్యక్తి స్థాయి కుటుంబ వ్యవస్థ- లక్ష్య సిద్ధికి అనుగుణంగా, లక్ష్య సిద్ధిలో భాగంగా తీర్చిదిద్దబడవలసిన అవసరం. ప్రస్తుత విషయానికి వస్తే, పిల్లల పట్ల ప్రేమ అనేది యోగ పరమైన ప్రక్రియలకు, యోగ పరమైన డెవలప్‌మెంటుకు వ్యతిరేకమైన ఒక బలహీనతగా మాస్టరు గారు వారి పట్ల కఠినంగా ఉండడం -అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి- అనే దానిని చెయ్యబడనివ్వలేదు అనేది విషయం.

6) వాళ్ళు చెడిపోయిన వాళ్ళుగా తయారవడానికి ఇది కారణం అయి ఉంది. కుటుంబ వ్యవహారంలో పిల్లల పట్ల కఠినంగా ఉండడం అనేది తల్లికి దాదాపు అసంభవం. ఎందుకు అంటే పిల్లల పట్ల తల్లికి వస్తుతః ప్రేమ, అనురాగం, మమత అనేవి అధికంగా ఉంటాయి గనుక. కఠినంగా ఉండదగింది, ఉండవలసింది వస్తుతః తండ్రి మాత్రమే అనేది అందరికీ దాదాపుగా తెలిసిన విషయమే. అలా అని తండ్రికి పిల్లల మీద ప్రేమ ఉండదు అని కాదు. ప్రేమ ప్రేమగా ఉన్నా, పిల్లలు చెడిపోకుండా ఉండడానికి కఠినంగా ఉండడం అనేది తండ్రికి ఒక రకంగా బాధ్యత కూడ. కానీ, మాస్టరు గారి విషయానికి వస్తే, పిల్లల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయనను కఠినంగా ఉండనివ్వని కారణంగా, వాళ్ళు చెడిపోయిన వాళ్ళుగా తయారవడానికి అది కారణం అయి ఉంది అనేది విషయం.

7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

8) ప్రస్తుత ప్రశ్న విషయంలో చెప్పబడిన అంశాలు మాస్టరు గారి కుటుంబానికి ప్రత్యేకం కాదు అని, కుటుంబ వ్యవస్థలో ఉన్న సర్వ సాధారణ వాస్తవాలను తెలియచేయడం ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడడానికి సంబంధించిన విషయాలు యోగ పరంగా తెలియచేయబడడం వెనుక మూల స్థాయిల కార్యక్రమం చూచాయగా తెలియబడనవుతుంది అని తెలియనగును.
Post Reply