1) "అది పనిచేసినపుడు, 15 సెకన్లను మాత్రమే అది కనబరుస్తుంది. 100 గా తన గుణాన్ని చూపడానికి అంతే పరిమాణం అవసరం అని దానికి తెలియవచ్చింది. కనుక ౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని, ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న అదే ౦ కోసమే అని, అది నిశ్చయించుకుంటుంది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680 నుండి 686 వరకు) కొనసాగింపు అని, ఆ ప్రశ్న విషయాలలో ఒక దానికి ఇంకొక దానికి మధ్యన ఉన్న మూల స్థాయిల లోతులు అన్నీ కాల సంబంధమే అయినప్పటికీ, కాల సంబంధమైన లోతులు వస్తుతః సృష్టి లక్ష్యానికి సంబంధించి ఉన్నాయి అని, వాటి అవినాభావ సంబంధం సృష్టికి అందని, అందరాని, అందబడకూడని విషయమే అని, తెలుసుకోవాలి అని అనుకోకుండా ఉండలేని మనస్సుకు, మేథస్సుకు అవి గందరగోళాన్ని మాత్రమే మిగుల్చుతాయి అని, అలా జరగడం కూడ యోగా డెవలప్మెంటు పరమైన ఒక అవకాశమే అని తెలియనగును.
3) అది పనిచేసినపుడు. ౹ గా ఏర్పడిన ౦ 100 కావాలనే ఉద్దేశ్యంతో, 100 సామర్థ్యం చూపడానికి ౦ ను ప్రయత్నించింది అనే అది పనిచేసినపుడు. అది అనే మాటకు చెప్పుకున్న వివరణ ప్రశ్న, సమాధానం నెం.686 విషయం "యోగా రికార్డుల విషయాలు - 100 అనే సామర్థ్యం కోసం ౦ ను ప్రయత్నించింది" లో చూడనగును.
4) 15 సెకన్లను మాత్రమే అది కనబరుస్తుంది. 15 సెకన్లను మాత్రమే అని అన్నపుడు, 15 సెకన్లు పూర్తి అయినపుడు మాత్రమే అనేది స్పష్టంగా తెలియనగును. అంటే ఒక పావు పూర్తి అయిన తరువాత మాత్రమే అది కనపడుతుంది అని. ఎందుకు అలా అనే ప్రశ్న ప్రశ్నగా సమంజసమే అయినా, శూన్య/ మూల స్థాయిలలో జరిగి, సృష్టి యందు అంతటా దాదాపు ప్రతి కార్యకలాపం లోను చోటు చేసుకునే సూత్ర బద్ధపు ప్రక్రియగా దానిని గుర్తించగలగడం మాత్రమే తప్ప, శూన్య/ మూల స్థాయిల ప్రక్రియల గురించిన ఎందుకు అనేది సమాధానం రావడానికి ఏమాత్రం అవకాశం లేని అసంభవమైన విషయమే. ఎందుకు అంటే సృష్టి సంబంధంగా జరిగే ఘటనల విషయం లోనే ఎందుకు అనేది ఏమాత్రం తెలియరాని స్థాయియే మానవ మేథస్సుది గనుక, అంతకు మించి జరిగిన క్షణాల కాలపు కేవల స్థూల స్థాయి ఘటనల ఎందుకు అనేది తెలియడానికి మేథస్సుకు దశాబ్దాల కాలం, కొన్ని సందర్భాలలో శతాబ్దాల కాలం పడుతుంది గనుక, అవే సృష్టి స్థాయి ఘటనలు అయితే, వేల సంవత్సరాలు కూడ పట్టనవుతుంది గనుక. అది కనబరుస్తుంది. స్పష్టమే.
5) 100 గా తన గుణాన్ని చూపడానికి అంతే పరిమాణం అవసరం అని దానికి తెలియవచ్చింది. ఈ వాక్యం గురించిన వివరణ లోకి వెళ్ళడం కంటె ముందు తెలియవచ్చింది అనే మాట యొక్క ప్రక్రియ పరమైన ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. తెలియరావడం అనే ప్రక్రియ మానవ ప్రగతికి -జీవన విధానం లోని వృద్ధికి, అభివృద్ధికి భిన్నంగా, అతీతంగా ఆంతరిక ప్రగతికి- ఆయువుపట్టు. తెలియరావడం అనే ప్రక్రియకు మూలాన్ని తెలుసుకోవడం -అంటే ఏ స్థాయి నుంచి, ఏ స్థాయి ద్వారా వచ్చిందో తెలుసుకోవడం- దాదాపు అసంభవమే అయినప్పటికీ, కేవలం తెలియరావడం అనే ప్రక్రియ జరగడమే ఎంతో విశేషం. అలాంటి అమోఘమైన ప్రక్రియను సుసాధ్యం చేయడం అనేది ఈ యోగంలో అంతర్లీనమై ఉన్న భాగం. ఇపుడిక ప్రస్తుత వాక్య వివరణ లోకి. 100 గా. పూర్తి స్థాయిదిగా. తన గుణాన్ని. తన లక్షణాన్ని. చెపుతున్న విషయం కాల సంబంధంగానే అయినా, ఇది సృష్టి లక్ష్యానికి, సృష్టి లక్ష్య సిద్ధికి ఆయువుపట్టు అయిన మూల ప్రాణానికి జరుగుతున్న ప్రక్రియకు సంబంధించి ఉంది అని తెలియనగును. లక్షణం అని అన్నపుడు, కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల సృష్టిలో లోపించి ఉన్నటువంటిది లక్షణమే. లక్షణ పరంగా రూపం లేదా స్థూల రూపం తయారు కావడం కోసమే యోగం ఆరంభమయింది అనేది అర్థం కావడానికి చాలా చాలా కష్టమైన వాస్తవం. అంతే పరిమాణం. అంటే 15 సెకన్ల గుణానికి సమానంగా 15 సెకన్ల పరిమాణం. అంటే పూర్తి స్థాయి లోని ఒక పావు లక్షణం, మరియొక రెండవ పావు పరిమాణం అని. ఇవి మూల స్థాయిల సంబంధం అని ప్రత్యేకంగా గుర్తు చేసుకోనగును. అవసరం అని దానికి తెలియవచ్చింది. స్పష్టమే. దానికి అంటే 100 అనే పూర్తి స్థాయికి అని చెప్పుకోనగును.
6) కనుక ౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని, ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న అదే ౦ కోసమే అని అది నిశ్చయించుకుంటుంది. కనుక. తెలియవచ్చింది గనుక. తెలియవచ్చింది గనుక నిశ్చయించుకోవడం ఎంత వరకు సమంజసం అనేది ఈ సందర్భంగా ప్రశ్నించుకోవడం సమంజసమే అయినప్పటికీ, అది కేవలం సృష్టి సంబంధ ప్రక్రియకు వర్తించనయేది మాత్రమే అని తెలియనగును. ఎందుకు అంటే మూల స్థాయిల ప్రక్రియలలో తెలియరావడం అనేది తదుపరి జరగవలసిన దానికి అనుగుణంగా మాత్రమే జరుగుతుంది అని తెలియనవుతున్న విషయం గనుక, అదే సృష్టి స్థాయి సంబంధ ప్రక్రియగా తెలియరావడం అనే దానిని నిశ్చయించుకోవడానికి ఇప్పటి వరకు సృష్టి పరంగా, ప్రస్తుత సృష్టి విధాన పరంగా జరిగిన మేథో స్థాయి నెగెటివ్ ప్రక్రియల నుండి, ఆ ప్రక్రియల ప్రభావం నుండి బయటపడడం ప్రాథమిక అవసరం గనుక. ౦ పనిచేస్తున్నది. పూర్తి స్థాయి ౦ పనిచేస్తున్నది. క్వార్టర్స్ సూత్రాలతో అని. ఆ క్వార్టర్స్ సూత్రాల గురించే ప్రశ్న విషయాలు 680 నుండి 686 వరకు అనేక మితులలో చెప్పబడింది. మితులు ఎన్నో అయినప్పటికీ, మితుల సమ్మేళనాలు ఎన్ని అయినప్పటికీ, అక్కడ వస్తుతః పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలే -అంటే ¼, ½, ¾, ౦/౹ లేదా 15, 30, 45, 60- అనేది విషయం. మాస్టరు యొక్క నోట్సు మొదట్లో ఉదహరించిన ¼, ½, ¾, ౦/౹ అనేవే ఇక్కడ కాల సంబంధ క్వార్టర్స్ సూత్రాలుగా వివరించబడుతున్నాయి అని, మాస్టరు యొక్క నోట్సులో ఉన్న ఈ నాలుగు లక్షణాలే శూన్య స్థితులకు, శూన్య స్థాయిలకు, సృష్టి ఆరంభానికి, సృష్టి లక్ష్యానికి, సృష్టి లక్ష్య సిద్ధికి సంబంధించి ఉన్నాయి అని, వాటికి సంబంధించిన లోతులే సమస్త యోగా రికార్డులకు ఆధారం అని తెలియనగును. శూన్య స్థాయిల ప్రక్రియల చివరి దశలలో కాలం గురించిన విషయాలు వెల్లడించడంలో ఊహకు మాత్రమే కాక, ప్రస్తుత పరిస్థితులలో బుద్ధికి కూడ అందని లోతుల విషయాలు గుంభనంగా ఉన్నాయి అని కేవలం విషయంగా అందుతోంది. ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న అదే ౦ కోసమే అని అది నిశ్చయించుకుంటుంది. ఇంకా. అంతేకాక. ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న. పూర్తి స్థాయిలో స్థిరపడి ఉన్న. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటి అంటే ప్రయత్నం చేసేది పూర్తి స్థాయి ౦ యే, ప్రయత్నించబడేది పూర్తి స్థాయి ౦ యే. ప్రయత్నించే స్థాయిలో స్థిరపడి ఉన్నది అదే స్థాయియే. మూలానికి, స్థూలానికి ఉన్న వైవిధ్యం అందని లోతుల నుండి తెలియాలే తప్ప, దీని గురించి సరయిన అవగాహన కలగడం కష్టం. అదే ౦ కోసమే అని. పై వివరణలో చెప్పుకున్న విషయమే. అది నిశ్చయించుకుంటుంది. దీని గురించి ముందే చెప్పుకోవడం జరిగింది.
7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
8) సృష్టికి తెలియని సూక్ష్మం గురించి, సూక్ష్మానికి కూడ తెలియని మూలం గురించి తెలియనయితేనే, ఇది అర్థం కావడం సులభం అవుతుంది అని తెలియనగును.
సమాధానం నెం.687 - ప్రశ్న నెం.687 (31-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - గుణాన్ని చూపడానికి పరిమాణం అవసరం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm