1) భార్య అంటే ఏమిటి?
2) భార్య అంటే మామూలు వాడుక లోని సతి, పత్ని అనే పర్యాయ పదాలుగా చెప్పుకోనయినప్పటికీ, అక్షర మూలాల స్థాయి నుండి చెప్పుకుంటే, విభజిత పదాలుగా యా + భారః, అంటే ఏది భారమో, అది భార్య అనే సామాజిక అర్థంలో "భరించబడేది" అనీ, మూల స్థాయి అర్థంలో "భారమైనది" అనీ చెప్పుకోనవుతుంది.
3) సామాజిక అర్థంలో "భరించబడేది" గా భార్య అనేది "భరించేవాడు" అనే అర్థం లోని భర్తకు భారం అయి ఉంది. వినగానే ఏదో నెగెటివ్ అర్థం నుండి కలిగే భావనలను మించి, దానిలో ఉన్న పాజిటివ్ కోణాన్ని దర్శించగలిగితే, భార్యాభర్తల బంధాలు (పెళ్ళిళ్ళు) పైనే (స్వర్గం లోనే) నిర్ణయం అవుతాయి అనే పారిభాషిక పదజాలం యొక్క కారణభూత మూల స్థితులతో కూడిన సృష్టి రహస్యం బట్టబయలు అవుతుంది. భార్యభర్తల బంధానికి ఉన్న మూల స్థాయి పవిత్రత, భార్యకు భర్త, భర్తకు భార్య అవసరం అయిన సృష్టి నేపథ్యంలో మూల స్థాయి సమానత్వం సృష్టికి అందకపోవడమే, వసుధైక కుటుంబం అనే సృష్టి స్థాయి మూల సూత్రం లోని వ్యక్తి స్థాయి కుటుంబంలో, కుటుంబ జీవనంలో అనేక రకాల అసమానతలకు, ఛిన్నాభిన్న కుటుంబ వ్యవస్థకు మరియు సృష్టి లక్ష్య ప్రథమాంకం అయిన సృష్టి దిగజారుడుకు దారి తీసింది.
4) సామాజిక స్థాయి అర్థంలో 'భరించబడేది' అయిన భార్య అనే పదానికి మూల స్థాయి 'భారమైనది' అనే ఉన్నతం, ఉత్తమం అయిన అర్థం శూన్య స్థితులలో జరిగిన 'ప్రాణం నుండి శక్తి విడిపడడం' అనే సృష్టికి తెలియబడని మూల ప్రక్రియ లోతులను అన్వయం చేయగలిగితే మాత్రమే తెలియదగినది. ప్రస్తుత శక్తిమయ సృష్టి ప్రాణమయ సృష్టిగా మారవలసిన అవసరం అనే ఈ యోగ సంబంధ సమాచారంలో మాత్రమే అది తెలియనవుతుంది అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోనవుతుంది.
5) కుటుంబ జీవనంలో భార్య పాత్ర ఏమిటి?
6) కుటుంబ జీవనంలో భార్య పాత్ర ఏమిటి అనేది సామాజిక స్థాయిలో పాజిటివ్ గా మరియు నెగెటివ్ గా రెండు విధాలుగానూ పరిగణన లోకి తీసుకోవడం అంత కష్టం కాకపోయినప్పటికీ, ఆ నెగెటివ్ పాత్ర యొక్క పాజిటివ్ కోణాన్ని యాస్ట్రలు లెవెలుకు, మెంటలు లెవెలుకు మించి మూల స్థాయిల అన్వయంతో చూడగలిగితే, భార్య పాత్ర సృష్టి చేసిన సృష్టికర్త అయిన ఆదిశక్తితో పోల్చదగినదే, భర్త పాత్రను ప్రాణంతో పోల్చదగిన మాదిరిగా.
7) ఈ యోగ పరంగా భార్య పాత్ర యొక్క విశిష్టత ఏమిటి?
8) భార్య పాత్ర కుటుంబ జీవనం లోని తల్లి, వగైరా ఏ స్త్రీ పాత్ర తోనూ పోల్చదగనిది. ప్రాణంతో పోల్చదగిన భర్తకు సృష్టి లక్ష్య సిద్ధిలో భార్య సూక్ష్మ సృష్టి స్థాయిలో అనుకూలంగా కాక వస్తుతః ప్రతికూలంగా సహకరించడం అనేది సృష్టికి ఈ రోజుకూ తెలియనిది, తెలియజాలనిది, తెలియబడకూడనిది. ఈ యోగ రికార్డులలో ప్రాణం, శక్తి అనే పేరుతో వివరించబడిన విషయాలను భర్త, భార్య పాత్రలకు అన్వయించి చూడగలిగితే (ఇది చూడబడగలగడాన్ని మించి, స్థూల దేహాల స్థాయి సృష్టి లక్ష్య సిద్ధిలో ఆచరణకు రావడం అనేదానికి మాత్రమే ప్రాధాన్యతను సంతరించుకుంది), భార్య పాత్ర యొక్క విశిష్టతను గుర్తించే అవకాశం.
సమాధానం నెం.102 - ప్రశ్న నెం.102 (18-11-2021) విషయం "భార్య".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm