1) ఇండిపెండెన్సీ అంటే ఏమిటి?
2) ఇండిపెండెన్సీ అంటే తెలుగు పదంగా స్వతంత్రత అని అర్థం. ఇండిపెండెన్సీ అంటే యోగ పరంగా వాడబడిన విలక్షణమైన అర్థంలో, ఇన్ + డిపెండెన్సీ అనే పద విభాగంగా, అత్యంత ఆంతరికమైన దాని మీద ఆధారపడి ఉండే తత్త్వం. అలాగే, స్వతంత్రత అంటే స్వ + తంత్రత అనే పద విభాగంగా, స్వ లేదా స్వయం -అసలు నేను- సమస్త కార్యకలాపాలను నిర్వహించుకునే తత్త్వం. మాటల తేడాయే తప్ప రెండిటి అర్థం ఒకటే. రెండిటి అర్థాన్ని పరికించి, పరిశీలించగలిగితే, అర్థం కాదగిన విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ఆధారపడడం గానీ, నిర్వహణ గానీ కేవలం బాహ్యం నుంచి మాత్రమే జరుగుతోంది అని. ఆ బాహ్యమే సాధారణ వాడుకలో చెప్పుకునే నేను, అసలు నేను కాని, అసలు నేనుకు ఒక రకంగా సంబంధం లేని, కానీ అసలు నేనుగా కేవలం చెలామణి అవుతున్న నకిలీ నేను, కర్మ విధానానికి మరియు ప్రస్తుత సృష్టి విధానానికి సంబంధించిన వ్యక్తి స్థాయి నేను.
3) ఇండిపెండెన్సీ అనే మాట ఇండిపెండెన్సు అనే మాటకు ఏ రకంగా భిన్నం?
4) ఇండిపెండెన్సీ అనేది తత్త్వంగా సూక్ష్మ, సూక్ష్మాతిసూక్ష్మ స్థాయి ఆంతరిక కార్యకలాపాలకు సంబంధించింది. ఇండిపెండెన్సు లేదా స్వాతంత్ర్యం అనేది సామాజికమైన స్థూల స్థాయి బాహ్య కార్యకలాపాలకు సంబంధించింది.
ఇండిపెండెన్సీలో ఆధారమైనది, ఆధారపడబడవలసినది అత్యంత ఆంతరికమైన ఏకం లేదా ప్రాణం లేదా అసలు నేను. ఇండిపెండెన్సుకు ఆధారమైనది శరీరానికి బాహ్యం, ఏకానికి లేదా ప్రాణానికి ఇతరమైన బాహ్యం, అసలు నేనుకు భిన్నమైనది మరియు అసలు నేను కానిది అయిన నకిలీ నేను. ఇండిపెండెన్సీ వ్యక్తి మూలానికి సంబంధించింది. ఇండిపెండెన్సు వ్యక్తి స్థూలానికి సంబంధించింది. ఇండిపెండెన్సీ యోగ లక్ష్యానికి సంబంధించింది. ఇండిపెండెన్సు సామాజిక పరమైన పరిపాలనా వ్యవస్థకు సంబంధించింది.
5) ఇండిపెండెన్సీ అనే మాట వ్యక్తికి సంబంధించిందా, సృష్టికి సంబంధించిందా?
6) ఇండిపెండెన్సీ వ్యక్తికి సంబంధించింది, సృష్టికి కూడ సంబంధించింది. ఎలా అనేదే ఇపుడు చెప్పుకోవలసిన అవసరం.
7) ఇండిపెండెన్సీ వ్యక్తికి సంబంధించింది అనేదాని గురించి. ఇండిపెండెన్సీ అంటే అత్యంత ఆంతరికమైన దాని మీద ఆధారపడడం అనే దాని లోనే దీని వివరణ తెలుసుకోనవుతుంది. యోగ పరంగా చెప్పుకున్న దాని ప్రకారం మనిషిలో ఏడు తలాలు ఉన్నాయి. వాటిలో ఫిజికలు, యాస్ట్రలు, రూప మానసికం అనే వాటికి పరిమితమై ఉన్నది ప్రస్తుత మానవ పరిస్థితి. వాటిని మించిన అరూప మానసికం, బుద్ధిక్, నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపర నిర్వాణిక్ తలాల స్థాయిలను దాటితేనే తప్ప ఏకంకు చేరుకోలేని పరిస్థితి. వాటిలో వ్యక్తి స్థాయి సంబంధం కూడ అయిన బుద్ధిక్ తలానికి పైన ఉన్నదే నిర్వాణిక్ తలం. అదే యోగ నామం "హు దట్ గైడ్స్ ది నిర్వాణ ఇండిపెండెన్స్ టు గైడ్ ది సోల్స్" (మాస్టరు గారి డైరీ 9-12-1912) లో ఉన్న గుంభనమైన రహస్యం.
8) ఇండిపెండెన్సీ సృష్టికి కూడ సంబంధించింది. వ్యక్తుల సామూహికమే విశ్వం, సృష్టి గనుక, వ్యక్తులుగా సమస్త జనాలకు ఇండిపెండెన్సీ రావడమే ఇండిపెండెన్సీ సృష్టికి సంబంధించింది అని చెప్పుకోవడానికి ఆధారం.
సమాధానం నెం.103 - ప్రశ్న నెం.103 (20-11-2021) విషయం "ఇండిపెండెన్సీ (స్వతంత్రత)".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm