సమాధానం నెం.104 - ప్రశ్న నెం.104 (22-11-2021) విషయం "బ్రీతింగులు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.104 - ప్రశ్న నెం.104 (22-11-2021) విషయం "బ్రీతింగులు".

Post by Katakam »

1) బ్రీతింగులు అంటే ఏమిటి?

2) బ్రీతింగులు అంటే వాడుక భాష లోని అర్థంగా శ్వసించడాలు -అంటే శ్వాసక్రియ లేదా శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం- అని చెప్పుకోనవుతుంది. కానీ, యోగ పరమైన అర్థమే ఇక్కడి అవసరం. అందులో కూడ, బ్రీతింగులకు ఏ అపార్థం కల్పించబడి ప్రచారం చేయబడిందో -అంటే బ్రీతింగు నామాలు జబ్బులను తగ్గిస్తాయి, వాటి ఉద్దేశ్యం అదే అని ఏ అపార్థం కల్పించబడి ప్రచారం చేయబడిందో-, దానిని మించిన అసలు అర్థమే ఇక్కడ అవసరం. బ్రీతింగు నామాలు లేదా బ్రీతింగు ప్రిన్సిపుల్సు అనేవి జబ్బులను తగ్గించేవి కావు అని మరొక్కసారి గుర్తు చేసుకోవలసిన అవసరం. ఎందుకు అంటే బ్రీతింగులకు లేదా బ్రీతింగు సూత్రాలకు మాస్టరు గారి డైరీలో 9-12-1914 న "గమనిక - శ్వసింపు ద్వారా పంజర మార్పిడికి (= మరణానికి) కారణం అయ్యేవి 64 రకాల కృశింపు మూల సూత్రాలు ఉన్నాయి. డైరెక్టు లైను మూల సూత్రాలు ప్రస్తుతానికి వాటిలో 15 ను మాత్రమే చక్కదిద్దగలుగుతాయి" అని కొంత అర్థం కాగలిగినంత గుంభనంగానే చెప్పబడి ఉంది గనుక.

3) జబ్బులు తగ్గించేవి బ్రీతింగులు అని యోగ సాధక సమాజంలో ఉన్న నానుడి ఎంతవరకు నిజం?

4) నిజం కాదు, పూర్తి స్థాయి అవాస్తవాన్ని మించి, బ్రీతింగు సూత్రాల అర్థానికి పూర్తిగా విరుద్ధం. బ్రీతింగులు అనేవి పంజర మార్పిడికి లేదా మరణానికి కారణమయే కృశింపు మూల సూత్రాలు. అంటే సంబంధిత బ్రీతింగు మూల సూత్రం పనిచేసే శరీర భాగంలో మరణానికి దారి తీసేటంత బలీయంగా స్థూల స్థాయిలో బయటపడి గానీ, బయటపడకుడా గానీ వాటి మరణ కారణ ప్రభావాన్ని చూపించేవి. యోగం గురించి, యోగ విధానం గురించి ఏమాత్రం అవగాహన లేని ఏ డైరెక్టు మీడియమో లేదా ఏ సీనియరు యోగ సాధకుడో చెప్పిన అర్థం యొక్క ప్రభావమే ఆ నానుడి, దాని ప్రచారం.

5) ఈ యోగంలో, యోగా ప్రాక్టీసులో, యోగ లక్ష్యంలో బ్రీతింగుల పాత్ర ఏమిటి?

6) ఈ యోగంలో బ్రీతింగుల పాత్ర. "కుండలినీ సమర్థమైన (= సృష్టి సంబంధంగా దేని నిర్దేశాలకూ లొంగకుండా తన బాహ్య కార్యక్రమాన్ని నెరవేర్చే కుండలినిని దాని ఆంతరిక కార్యక్రమం వైపుకు మళ్ళేలా లేదా సృష్టి లక్ష్య సంబంధంగా పనిచేసేలా చేయగలిగిన) ప్రకంపనలు ప్రథమ సూత్రం లోనే ఇవ్వబడ్డాయి" (మాస్టరు గారి డైరీ 16-12-1914) అనే లిఖిత భాగంలో ఎంతో గుంభనంగా వివరించబడింది.

7) ఈ యోగా ప్రాక్టీసులో బ్రీతింగుల పాత్ర. "సాధారణ వ్యక్తులకు (= ఈ విషయానికి సంబంధించి మీడియములు అందరూ సాధారణ వ్యక్తులేనని తెలియనగును) బ్రీతింగు ప్రిన్సిపుల్సు వలన సుషుమ్నకు రంధ్రం (= పైన చెప్పబడిన కార్యక్రమంలో భాగంగా హితు నుండి కుండలినికి జరగవలసిన బోరింగుకు ముందరి ప్రక్రియగా సుషుమ్న తయారుకావడం లేదా సుషుమ్నకు రంధ్రం పడడం) పడేది ఒక అంగుళం మాత్రమే" (మాస్టరు గారి డైరీ 10-12-1914) అనే వాక్యంలో అర్థం కావడానికి వీల్లేనంత గుంభనంగా చెప్పబడింది ఈ యోగా ప్రాక్టీసులో బ్రీతింగుల పాత్రయే.

8) ఈ యోగ లక్ష్యంలో బ్రీతింగుల పాత్ర. అమృతత్వం పొందవలసిన స్థూల దేహంలో పంజర మార్పిడికి లేదా మరణానికి కారణమయే కృశింపు మూల సూత్రాలుగా ఎడ్జస్టు కావలసినవి బ్రీతింగులు. ఇదే ఈ యోగ లక్ష్యంలో బ్రీతింగుల పాత్ర.
Post Reply