సమాధానం నెం.107 - ప్రశ్న నెం.107 (28-11-2021) విషయం "పూజలు, ఈ యోగం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.107 - ప్రశ్న నెం.107 (28-11-2021) విషయం "పూజలు, ఈ యోగం".

Post by Katakam »

1) ఈ యోగంలో పూజల పాత్ర ఏమిటి?

2) సాంప్రదాయ విధానంలో శాస్త్రోక్తంగా చేసే పూజలు పునస్కారాలు గానీ, మామూలుగా దీపం పెట్టి లేదా/ మరియు దణ్ణం పెట్టి గానీ చేసే పూజలు గానీ ఈ యోగంలో లేవు. వాటి పాత్ర కూడ ఏమీ లేదు. ఈ యోగా ప్రాక్టీసులో అవి లేకపోవడమే వాటి పాత్ర.

3) కాకపోతే, పూజలు పునస్కారాలు ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేసుకుంటే, సామాజికంగా చెప్పుకోదగిన, చెప్పుకోబడుతున్న సమాధానం ఏమిటి అంటే అది సాంప్రదాయం, సాంప్రదాయాన్ని పాటించడం మన ధర్మం అని. మరి సాంప్రదాయం ఎందుకు ఉంది అనే ప్రశ్నకు సమాధానం కోసం తడుముకోవలసిందే. మనిషి లోనే దివ్యత్వం ఉంది అనే విషయానికి/ వాస్తవానికి గుర్తింపు రాకుండా, మనిషికి ఆధ్యాత్మికంగా తన మీద తనకు నమ్మకం కలగకుండా బాహ్యమైన దేముళ్ళ మీదనే, దేముళ్ళ అంశం మీదనే ప్రతి దానికీ ఆధారపడడం, ఆధారపడుతూనే ఉండడం అనేదే మేథావి మహానుభావులు దేముళ్ళను, దేముళ్ళ అంశాన్నీ సృష్టించి, దేముళ్ళ అంశాన్ని పెంచి పోషిస్తున్న దాని లోని సాంప్రదాయపు లోతుల మర్మం.

4) ఈ యోగంలో అవి ఎందుకు కూడదు?

5) ఈ యోగం గురించి, ఈ యోగ విధానం గురించి కనీస అవగాహన ఉంటే, దీనికి సమాధానం సులువే. ఎలా అంటే ఈ యోగం‌, ఈ యోగ విధానం సమస్తం తన అసలు నేను మీద ఆధారపడడం అనే అంతర్ముఖ ప్రక్రియకు సంబంధించి ఉంది గనుక, పూజలు పునస్కారాలు అనేవి కేవలం బాహ్యమైన దేముళ్ళ అంశం మీద ఆధారపడడం అనే బహిర్ముఖ ప్రక్రియకు మాత్రమే సంబంధించి ఉన్నాయి గనుక, సామాజిక జీవన కార్యకలాపాలలో తన మీద తనకు నమ్మకం/ విశ్వాసం ఉండడం అనే బహిర్ముఖ ప్రక్రియ తన అసలు నేను మీద తాను ఆధారపడి ఉండడం అనే అంతర్ముఖ ప్రక్రియకు, ఆధ్యాత్మిక జీవిత ప్రక్రియకు దారి తీయడం అసంభవం గనుక, అలా అంతర్ముఖం కావడమే ఈ యోగం, ఈ యోగ విధానం మరియు ఈ యోగా ప్రాక్టీసు లోని క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ప్రాథమిక ఉద్దేశ్యం గనుక.

6) కె. కోర్సులో ఉన్న "ప్రాణాన్ని పూజించడం" అంటే ఏమిటి?

7) కె. కోర్సు హస్తలిఖిత వాల్యూం 3 లో 18-6-1910 న వ్రాయబడి ఉన్న "అదే (= ఆచార్యులు ఉపదేశించి, పాటింపచేసిన) అనుష్ఠానాన్ని ఇక్కడ (= ఈ యోగ విధానంలో) అన్వయం చేయాలి, మీకు మీరు (అంటే నీ మీడియములు మరియు నీవు) గా ప్రాణాన్ని పూజిస్తున్నట్లుగా మీరు భావన చేసుకుంటూ" అనేది ప్రస్తుత సందర్భ భాగం. బాహ్యంగా దేముళ్ళకు, ప్రత్యేక మనుషులకు పూజలు పునస్కారాలు చేస్తున్న పరిస్థితులలో ప్రాణాన్ని పూజించడం అనేది అర్థం కాని విషయమే. ఈ యోగం, ఈ యోగ విధానం, ఈ యోగ లక్ష్యం, ఈ యోగ లక్ష్య సిద్ధి గురించి ఒకలాంటి అవగాహన కలిగితే తప్ప, ఏ కొంచెమైనా అర్థం కావడానికి అవకాశం లేని అంశం. కొంచెం లోతుగా పరిశీలించగలిగితే, ఈ యోగా రికార్డులు సమస్తం ప్రాణానికి, ప్రాణాన్ని పూజించడానికి సంబంధించినవే అనీ, ప్రాణాన్ని పూజించడ అనేది దేముళ్ళకు పూజలు చేయడం లాంటి బహిర్ముఖ ప్రక్రియ కాదు అనీ, ప్రాణాన్ని పూజించడం అనేది మనిషి లోనే ఉన్న దివ్యత్వాన్ని లేదా ప్రాణాన్ని మేలుకొలపడానికి లేదా క్రియాశీలం చేయడానికి సంబంధించిన సృష్టి స్థాయిల ద్వారా జరిగే మూల స్థాయిల అంతర్ముఖ ప్రక్రియ అనీ కేవలం చూచాయగా మాత్రమే తెలిసే అవకాశం.
Post Reply