1) ఈ యోగా ప్రాక్టీసు చేసేవారు తాయత్తులు ధరించకూడదు అంటారు. అది నిజమేనా?
2) అవును, నిజమే. మాస్టరు గారి డైరీలలో 26-3-1919 న "మీడియములకు సూచన" గా చెప్పబడిన "ఇకమీదట యంత్రాలతో కూడిన తాయత్తులు ఎవరూ ధరించరాదు. స్కూలుకు (= యోగా స్కూలు ఫ్రెండ్సు సొసైటీకి) ఇచ్చివేయాలి" అనేదే దీనికి నిర్ధారణ. కాకపోతే, తాయత్తులు అనే మాట, వాటిని ధరించడం వలన ఒక ప్రత్యేక రక్షణ పనిచేస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే అయినా, తాయత్తు గురించి, అది యంత్రంతో/ సంకేతాలతో కూడి ఉంటుంది అని అనడం గురించి తెలియవలసిన అవసరమే.
3) అలా అని అనడానికి కారణాలు ఏమిటి?
4) ఆ కారణాలు తెలియాలి అంటే తాయత్తు అంటే ఏమిటో, దానికి సంబంధించిన పదం యంత్రం అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరం.
5) తాయత్తు గురించి. బీజాక్షరాలకు -మంత్ర సంబంధమైన బీజాక్షరాలకు- ఒక నిగూఢ క్రమంలో లిఖిత రూపం కలిగించి, అలా లిఖించబడిన కాగితాన్ని గానీ లేదా లోహపు రేకును గానీ ఒక లోహపు గొట్టంలో నిక్షిప్తం చేసి లేదా ఇంకే విధంగా అయినా వాక్కు రూపంగా ఘన పదార్థ వస్తువులో నిక్షిప్తం చేసి, దానిని శరీరం మీద ధరింపచేస్తే, అదే తాయత్తు. దాని వలన ధరించిన వ్యక్తికి దుష్ట పీడల నుంచి రక్షణ కలుగుతుంది అనేది నమ్మబడుతున్న విషయం.
6) యంత్రం గురించి. యజనాత్ త్రాయత ఇతి యంత్రః అనేది వ్యుత్పత్తి. అంటే యజనం (= దీని మూల రూపం యజ్ఞం) చేయువారిని రక్షించేది అని. ఈ సందర్భానికి యజనం అంటే జపం అని అర్థం. జపం చేసిన మూలాక్షరాలను లేదా బీజాక్షరాలను పైన చెప్పుకున్న విధంగా నిక్షిప్తం చేయడమే లేదా నిక్షిప్తం చేసే ప్రక్రియయే యంత్రం లేదా యంత్ర నిర్మాణం. దాని వలన రక్షణ కలిగించేదే యంత్రం. యంత్ర ప్రక్రియతో ఏర్పాటయిన వస్తు రూపం లేదా యంత్రం నిక్షిప్తం చేయబడిన స్థూల రూప వస్తువే తాయత్తు.
7) యోగ పరంగా చెప్పుకోవాలి అంటే యాస్ట్రలు పీడల లేదా ప్రభావాల నుండి రక్షణ కోసం చేయబడే యాస్ట్రలు ప్రక్రియకు కల్పించబడిన స్థూల రూప రక్షణ కవచమే తాయత్తు.
8) మానవ దేహ వ్యవస్థ లోని మొత్తం ఏడు తలాల లోను మార్పులు తీసుకురావడానికి సంకల్పించిన ఈ యోగ విధానంలో ఒక్క యాస్ట్రలు తలానికి మాత్రమే సంబంధించిన తాయత్తు ప్రక్రియ అనవసరం మాత్రమే కాక, అవరోధం కూడ అవుతుంది గనుక, తాయత్తులు ధరించరాదు అనేది ఈ యోగంలో ఖరాఖండిగా చెప్పబడిన విషయం.
9) తాయత్తులు ధరించిన వారు ఈ యోగానికి అనర్హులా?
10) యాస్ట్రలు స్థాయి ప్రక్రియగా తాయత్తులు ధరించడం అనేది ఈ యోగానికి సంబంధించిన అర్హతకు లేదా అనర్హతకు సంబంధించిన విషయమే కాదు. గత జన్మల ఆధ్యాత్మిక ప్రగతి మాత్రమే ఈ యోగంలో చేరే అర్హతకు ప్రాతిపదిక. ఈ యోగంలో చేరిన తరువాత యోగా ప్రాక్టీసు చేయడానికి సంబంధించి ఒక నిబంధన మాత్రమే తాయత్తులు ధరించకుండడం. అంతే.
సమాధానం నెం.111 - ప్రశ్న నెం.111 (6-12-2021) విషయం "తాయత్తులు, ఈ యోగం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm