1) మీడియములు, ట్రాన్సు మీడియములు - వీటి అర్థం ఏమిటి?
2) మీడియములు అనే మాటకు చెప్పబడిన అర్థం "మన చుట్టూ జరుగుతూ పోయే సాధారణ సృష్టిక్రమ వికాసంతో పాటు పనిచేసే నూతన ప్రాణానికి వాహకులు అవుతారు అనే అర్థంలో మాస్టరు సీ.వీ.వీ. గారి అనుయాయులను 'మీడియములు' అన్నారు" (యస్. నారాయణ అయ్యరు గారి "నూతన యోగం" యొక్క 'ముందు మాట') అని.
3) ట్రాన్సు మీడియములు అంటే ట్రాన్సులో లేదా మగతలో లేదా అర్థ చైతన్య స్థితిలో ఉండే మీడియములు అని అర్థం.
4) మీడియములకు, ట్రాన్సు మీడియములకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
5) మాస్టరు గారి డైరీలలో 29-9-1912 న "ట్రాన్సు మీడియములు కూడ గ్రహ విధానం లోనే జన్మించారు. నేను వారి జన్మ మూలాలను పరికించాను. వాళ్ళ మూలాలకు స్వయం ప్రకాశమాన ప్రజ్ఞా స్థితి లేదు", "ట్రాన్సు మీడియం, ప్రాక్టీసు మీడియం అనే ఇరువురి మధ్య తేడా ఉంది" అని వ్రాయబడిన విషయం లోతుల లోనే మనం వారి మధ్య ఉన్న తేడాను తెలుసుకునే అవకాశం.
6) మీడియముకు, ట్రాన్సు మీడియముకు మధ్య ఉన్న సామ్యం ఏమిటి అంటే "ట్రాన్సు మీడియములు కూడ గ్రహ విధానం లోనే జన్మించారు" అనేది. అంటే మీడియముల మాదిరిగా ట్రాన్సు మీడియములు కూడ గ్రహ విధానం లోనే -ఎవరి కర్మను వారు అనుభవించి తీరవలసిన అవసరానికి జరిగిన ఏర్పాటు అయిన గ్రహ విధానం లోనే లేదా కర్మ సంబంధ గ్రహ విధానం లోనే- జన్మించారు అని.
7) తేడాకు సంబంధించి, "వాళ్ళ (= ట్రాన్సు మీడియముల) మూలాలకు స్వయం ప్రకాశమాన ప్రజ్ఞా స్థితి లేదు". అంటే మీడియములకు స్వయం ప్రకాశమాన ప్రజ్ఞా స్థితి ఉంది అని. అంటే ట్రాన్సు మీడియములకు యోగ ప్రక్రియలలో తాముగా ఆలోచనలు చేయడం అనేది ఉండదు, కానీ మీడియములకు అలాంటి స్వయం ప్రకాశమాన ప్రజ్ఞా స్థితి ఉంటుంది అని.
8) ట్రాన్సు మీడియములు అంటే ట్రాన్సు లేదా మగత లేదా అర్థ చైతన్య స్థితి సంబంధంగా మాత్రమే యోగ ప్రక్రియలలో మీడియములు.
9) తాత్కాలికంగా సందర్భానుసారం వేరే మీడియములు ఒకరిద్దరు ఉపయోగించుకోబడినా, ట్రాన్సు మీడియములు మాత్రం ముగ్గురే, వాళ్ళే సుందరం, వెంకమ్మ, అమ్మణి. మిగతా అందరూ మీడియములే, ప్రాక్టీసు మీడియములే.
10) ఈ యోగ లక్ష్య సిద్ధిలో వాళ్ళ పాత్ర ఏమిటి?
11) మీడియముల పాత్ర ఏమిటి అనేది మీడియములు అనే మాటకు చెప్పిన అర్థం లోనే ఇమిడి ఉంది. ట్రాన్సు మీడియముల పాత్ర ఏమిటి అనేది మాస్టరు గారి డైరీలలో 21-9-1916 న విడివిడిగా వివరించబడి ఉంది.
12) అలా అత్యంత గుంభనమైన పదజాలంతో వివరించబడిన వాళ్ళ పాత్ర తెలియడానికి యోగం గురించి, యోగ విధానం గురించి, యోగ లక్ష్యం గురించి, యోగ లక్ష్య సిద్ధి గురించి కనీస అవగాహన ఉండడం కనీస అవసరం అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోదగిన విషయం.
సమాధానం నెం.113 - ప్రశ్న నెం.113 (10-12-2021) విషయం "మీడియములు, ట్రాన్సు మీడియములు".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm