1) 'ప్రాక్టీసు నామాలను చర్చించరాదు' అని డైరీలలో వ్రాయబడిన విషయానికి సంబంధించిన సందర్భం ఏమిటి?
2) 'మాస్టరు యొక్క స్పెషల్ కోర్సుల' ను ప్రాక్టీసు చేయడంలో భాగంగా దాని లోని VII (7వ) నామానికి సంబంధించి 9-12-1912 న మాస్టరు గారి డైరీలలో వ్రాయబడి ఉన్న విషయం - " 'హు దట్ గైడ్స్ ది నిర్వాణ ఇండిపెండెన్స్ టు గైడ్ ది సోల్స్'. గమనిక: వి.ఆర్., ఆర్.ఆర్. అనవసరమైన అభ్యంతరం లేవనెత్తడం వలన కొంత చర్చ జరిగి, మాస్టరు చేత కోర్సు ఆపివేయబడి, 14-11-1912 న ఇవ్వబడిన 7 ప్రశ్నలను పరికించమని మీడియములకు చెప్పబడింది." దీనికి కొనసాగింపుగా 10-12-1912 న "మీడియములకు ప్రత్యేక సూచన" గా వ్రాయబడిన నాలుగు పాయింట్లలో మొదటిది "ప్రాక్టీసు నామాలను చర్చించరాదు" అనే ప్రస్తుత ప్రశ్న విషయం.
3) ఇపుడిక ఈ సందర్భంగా జరిగిన దానికి సంబంధించిన లోతులు.
4) "హు దట్ గైడ్స్ ది నిర్వాణ ఇండిపెండెన్స్ టు గైడ్ ది సోల్స్" అనే సదరు సంబంధిత నామం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
5) "హు దట్ గైడ్స్ ది నిర్వాణ ఇండిపెండెన్స్ టు గైడ్ ది సోల్స్". అర్థం కావడానికి లేదా అర్థం చెప్పుకోవడానికి అవకాశం ఉన్న ఈ నామం యొక్క అర్థం ఏమిటి అంటే "ఆత్మలకు మార్గనిర్దేశం చేసే ఆ నిర్వాణ ఇండిపెండెన్సుకు మార్గనిర్దేశం చేసేది ఎవరు" అని. ఇది కేనోపనిషత్తు లోని "ఎవరి సంకల్పం వలన అప్పటికే దిశానిర్దేశం చేయబడిన మానసం తన విషయాల/ వస్తువుల వైపుకు వెళ్తుంది" అనే అర్థం కలిగిన శ్లోకంతో వస్తుతః పోల్చదగినదిగా ఉన్నందున, వి.ఆర్. (సూర్యుడు), ఆర్. ఆర్. (నారదుడు) కోర్సు నామాన్ని శ్లోకంతో పోల్చి, శ్లోకం లోని అర్థమే కోర్సు నామంలో ఉంది కదా, తేడా ఏమి ఉంది అని అభ్యంతరం లేవనెత్తగా, మాస్టరు గారు దానిని వివరించి చెప్పే ప్రయత్నంలో కొంత చర్చ జరిగి, కోర్సు ప్రాక్టీసు ఆపివేయబడి, తదుపరి రోజు "ప్రాక్టీసు నామాలను చర్చించరాదు" అనే "ప్రత్యేక సూచన" వచ్చి, ఆ ఇద్దరు మీడియములకు రెండు రోజుల బహిష్కరణ శిక్ష విధించబడింది.
6) ఇదీ ఆ సందర్భానికి సంబంధించిన ఘటన వెనుక ఉన్న సూక్ష్మ సన్నివేశం.
7) ఆ కోర్సు నామం యొక్క ప్రాముఖ్యతగా తెలియవలసిన విషయం ఏమిటి అంటే ఇండిపెండెన్సు అనేది వస్తుతః నిర్వాణిక్ లెవెలుకు సంబంధించింది అని, నిర్వాణిక్ లెవెలు ఇండిపెండెన్సు క్రమేణా దేహ వ్యవస్థ యొక్క అన్ని తలాలకు, ఉపతలాలకు విస్తరించగా కలిగేది ఇండిపెండెన్సీ అని, దానికి మార్గనిర్దేశం పైనుండి మాత్రమే రావలసి ఉంటుంది అని. దీనికి సంబంధించిన మరియొక విషయమే ఇప్పుడు చెప్పబడబోతోంది.
8) ఆ సందర్భం దృష్ట్యా తెలియదగిన విషయం ఏమిటి?
9) ఆ సందర్భం దృష్ట్యా తెలియదగిన మరియొక విషయం ఏమిటి అంటే వి.ఆర్. (సూర్యుడు), ఆర్. ఆర్. (నారదుడు) లాంటి గొప్ప జ్ఞాన సంపన్నులకు సైతం యోగ సంబంధమైన లోతుల గురించి సరయిన అవగాహన కలిగే అవకాశం లేదు అని, అలాంటివి అయిన కోర్సు నామాల గురించి -మూల స్థాయి సంబంధంగా "అథారిటేటివ్ ఆథెంటిక్ ఆటోబయాగ్రఫిక్ వేవ్స్ ఆఫ్ అనమటోపియా", గంభీర అర్థంగా "స్వస్వప్రేరణాదక్ష స్వసంజనిత స్వజీవచిత్రణా (= కల్పనా, రచనా, నిర్మాణ, నిర్వహణా) దక్ష లక్ష్యవస్తుభావయుక్త ధ్వని తరంగాలు", తెలిసే మాటలుగా "తనకు తాను ప్రేరణ కాగలిగిన, తన నుండి తాను జనియించిన, నిజ ప్రాణ చిత్రణను (= కల్పన, రచన, నిర్మాణం, నిర్వహణ) చేయగలిగిన, సదా లక్ష్యవస్తు భావంతో కూడి ఉండే ధ్వని తరంగాలు" అనే లక్షణం కలిగిన కోర్సు నామాల (కోర్సు నామాలే కాదు, యోగ సాహిత్యం కూడ) గురించి- చర్చించడం కూడదు అని. ఎందుకు అంటే చర్చకు పరిమితం కావడం అనేది మేథస్సు యొక్క నైజం గనుక, మూల స్థాయి అర్థాలను అందుకోవడం మేథస్సు యొక్క పరిధి లోనిది కాదు, అలా అందడం కేవలం అసంభవం గనుక.
సమాధానం నెం.116 - ప్రశ్న నెం.116 (16-12-2021) విషయం "ప్రాక్టీసు నామాలను చర్చించరాదు".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm